ETV Bharat / science-and-technology

క్రోమ్ యూజర్లకు శుభవార్త.. ఇన్​కాగ్నిటో మోడ్​కు లాక్..​ బ్రౌజింగ్ హిస్టరీ సేఫ్​..

author img

By

Published : Jan 27, 2023, 7:38 PM IST

ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. క్రోమ్​లోని ఇన్​కాగ్నిటో మోడ్​కు లాక్​ వేసుకునే సౌలభ్యాన్ని అండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. క్రోమ్​లోని ఈ మోడ్​లో సేవ్​ అయ్యే బ్రౌజింగ్​ హిస్టరీ ఇతరులకు కనిపించకుండా ఉండేందుకే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.

Chrome Incognito Mode Lock
క్రోమ్​ ఇన్​కాగ్నిటో మోడ్​కు లాక్​

ప్రైవేట్​ బ్రౌజింగ్​ కోసం వినియోగించే క్రోమ్ సెర్చ్​ ఇంజన్​​లోని ఇన్​కాగ్నిటో మోడ్​కి సంబంధించి గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. క్రోమ్​​లోని ఇన్​కాగ్నిటో మోడ్​కు లాక్​ వేసుకునే సౌలభ్యాన్ని ఆండ్రాయిడ్​ మొబైల్స్​లోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా డివైజ్​ యూజర్స్​ సేఫ్​ బ్రౌజింగ్​ చేయడానికే ప్రాధాన్యమిస్తారు. అందులో భాగంగా అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది క్రోమ్​ సెర్చ్​ ఇంజన్​లో ఉండే ఇన్​కాగ్నిటో మోడ్​. ఎందుకంటే ఈ మోడ్​లో మనకి కావాల్సిన కంటెంట్​ ఎంత వెతుక్కున్నా ఇందులో సేవ్​ అవ్వదనే ఉద్దేశంతో ఉంటారు. కానీ నిజానికి ప్రైవేట్​ బ్రౌజింగ్​ కోసమని దీనిని ఆశ్రయించే వాళ్లు గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో కూడా మనం అన్వేషించే ప్రతీ అంశం నిక్షిప్తమై ఉంటుందనే వాస్తవం. బహుశా ఈ విషయం సాంకేతిక నిపుణులకు తప్ప సాధారణ యూజర్స్​కి తెలియకపోవచ్చు. అయితే మనం ఏ టాపిక్​ వెతికినా ఇతరులు మన మొబైల్​ తీసుకున్నప్పుడు మనం చూసిన వెబ్​సైట్స్​ వివరాలు వారి కంట పడకూడదనే అనుకుంటాము. ఏదేమైనా ఇన్​కాగ్నిటో మోడ్​ మన బ్రౌజింగ్​ హిస్టరీని సేవ్​ చేస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే దీనికి లాక్​ వేసుకునే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది టెక్​ దిగ్గజం గూగుల్.

ఆండ్రాయిడ్​ మొబైల్స్​లో ఉండే క్రోమ్ ఇన్​కాగ్నిటో మోడ్​ను లాక్​ చేసుకునే సరికొత్త ఫీచర్​ను గూగుల్​ రూపొందించింది. కాగా ఈ సౌకర్యం అంతకుముందు కేవలం ఐఓఎస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ ఉండే ఫోన్​లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా, ప్రైవేట్​ బ్రౌజింగ్​ కోసం వినియోగించే క్రోమ్ సెర్చ్​ ఇంజన్​​లోని ఇన్​కాగ్నిటో మోడ్​కి సంబంధించి ప్రస్తుతం గూగుల్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం పట్ల యూజర్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ మోడ్​ను ఎలా లాక్​ చేసుకోవాలి..?

  • వినియోగదారులు తమ డివైజ్​ను అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతుల్లో ఈ ప్రైవేట్​ బ్రౌజర్​లోని ట్యాబ్​లను లాక్​, అన్​లాక్​​ చేసుకోవచ్చు.
  • ఇకపోతే ఈ ఫీచర్ ఇంకా అన్ని డివైజ్​లలో అందుబాటులోకి రాలేదు.

అయితే ఇంతకుముందు 2021 నుంచి ఈ సౌకర్యం కేవలం ఐఓఎస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​లతో కూడిన డివైజ్​లలో మాత్రమే పనిచేసేది. కాగా సంస్థ తాజా నిర్ణయంతో ఆండ్రాయిడ్​ ఫోన్​లలో కూడా ఈ ఫీచర్​ను ఆస్వాదించే అవకాశం యూజర్స్​కి లభిస్తోంది.

అయితే కింద వివరించిన స్టెప్స్​ను అనుసరిస్తే ఇన్​కాగ్నిటో మోడ్​ను సులువుగా లాక్​ చేయెచ్చు..!

  • ముందుగా మీరు డివైజ్​లోని క్రోమ్​ నుంచి ఎగ్జిట్​ అవ్వాలి.
  • తర్వాత సెట్టింగ్స్​లోకి వెళ్లి ప్రైవసీ అండ్​​ సెక్యూరిటీ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • అనంతరం లాక్ ఇన్​కాగ్నిటో ట్యాబ్స్​ అనే నీలం రంగు బటన్​పై నొక్కి ఎనేబుల్ చేసుకోవాలి.

అంతే దీంతో మీ వ్యక్తిగత గోప్యతకు తాళం వేసినట్లే.

ఒకసారి ఇలా చెక్​ చేసి చూడండి..!
ఈ ఫీచర్​ను చెక్​ చేయడానికి ముందుగా మీరు క్రోమ్​ను క్లోజ్​ చేయండి. అనంతరం దాన్ని ఓపెన్​ చేసినప్పుడు అన్​లాక్​ చేయమని స్క్రీన్​పై ఓ తెర కనిపిస్తుంది. అది మనం లాక్​ చేసే సమయంలో పెట్టుకునే నంబర్ ​లాక్​, ప్యాటర్న్​ లాక్​ లేదా ఫింగర్​ప్రింట్​ ఏదైనా కావచ్చు.

ఇకపోతే ఈ ఇన్​కాగ్నిటో మోడ్​ మినహా మిగతా సెర్చ్​ బ్రౌజర్స్​ అన్నీ పబ్లిక్​గా అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా యాక్సెస్​ చేయెచ్చు. అయితే ప్రస్తుతం గూగుల్​ తెచ్చిన ఈ ఫీచర్​ ఓ హ్యండీ ఫీచర్​ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మీ ఫోన్‌ను వేరొకరికి ఇచ్చే సందర్భంలో మీరు ఏ వెబ్​సైట్స్​ని వీక్షించారో వారికి తెలియకుండా ఉండాలి అనే సమయంలో ఈ ఫీచర్​ మనకు సహాయపడుతుంది. మీరు దీన్ని మీ ఫోన్‌లో ప్రయత్నించినా విజయవంతం కాకపోతే ఆండ్రాయిడ్​ డివైజ్​లలో అందుబాటులోకి వచ్చే ప్రక్రియ జరుగుతోందని గూగుల్ నుంచి ఓ సందేశం వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.