సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు చెందిన గూగుల్ క్లౌడ్ వ్యాపారాల ఏషియా పసిఫిక్ విభాగాధిపతిగా కరణ్ బజ్వాను నియమించింది. ప్రస్తుతం ఈయన గూగుల్ క్లౌడ్ ఇండియా ఎండీగా ఉన్నారు.
బజ్వా నియామకం మంగళవారం (జనవరి 5) నుంచే అమలులోకి రానుంది. ఈయన ప్రస్తుతం గురుగ్రామ్ నుంచి పని చేస్తుండగా.. ఇకపై సింగపూర్ నుంచి సేవలందించనున్నారు. గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్స్, గూగుల్ వర్క్ ప్లేస్ వంటి విభాగాలకు బజ్వానే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు.
![Karan Bajwa, Google Cloud APAC leader](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10124056_karan.jpg)
గూగుల్ క్లౌడ్ ఇండియాకు నూతన అధిపతిని నియమించే వరకు.. బజ్వానే ఆ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెక్ మహీంద్రా, ఎల్&టీ ఫినాన్స్, షేర్ చాట్, విప్రో, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, కియా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు గూగుల్ క్లౌడ్ వినియోగదారులుగా ఉన్నాయి.
ఇదీ చూడండి:అమెజాన్ అధినేత ఉదారత- దాతృత్వంలోనూ టాప్