ప్రస్తుత 'స్మార్ట్' యుగంలో ఏదైనా సాధ్యమే!(google android phone) ఒకప్పుడు చిన్న ఫోన్లో అక్షరాలు టైప్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. అలాంటి స్మార్ట్ ఫోన్ రాకతో 'ఒక్క టచ్'తో అంతా సులభమైపోయింది. ఇప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫేషియల్ రికగ్నిషన్‌ను ఉపయోగిస్తున్నాము. ఆ తర్వాత 'హలో గూగుల్' అని పలకరిస్తే చాలు.. మనకు కావాల్సిన యాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు గూగుల్.. మరో అడుగు ముందుకేసి రెండు టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటితో ఇక కను సైగతో స్మార్ట్‌ఫోన్‌ను శాసించవచ్చు(android features list).
ఈ టూల్స్ పేరు కెమెరా స్విచెస్, ప్రాజెక్ట్ యాక్టివేట్(project activate android). వీటిలో ఫ్రంట్ కెమెరా, కృత్రిమ మేధ సాంకేతికత ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని, ముఖకవళికల ఆధారంగా ఫోన్‌ను యాక్సెస్ చేయవచ్చు. మాటలు సరిగ్గా రాని, అవయవ లోపాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్లను తీసుకొచ్చారు.
కెమెరా యాక్సెస్...
2015లో గూగుల్ తీసుకొచ్చిన స్విచ్ యాక్సెస్‌లో కొత్త ఫీచర్ ఈ కెమెరా స్విచెస్. దీని ద్వారా.. యూజర్ ముఖకవళికలను గుర్తిస్తుంది స్మార్ట్‌ఫోన్. కన్ను సైగలు, ముఖకవళికల ఆధారంగా యూజర్‌కు కావాల్సిన పనిని పూర్తిచేస్తుంది. అంటే.. చేతులు వాడకుండానే పని మొత్తం అయిపోతుంది!
పని సులభంగా అయ్యేందుకు ఆరు ఆప్షన్స్‌ను పొందుపరిచింది గూగుల్. 'లుక్ అప్','లుక్ రైట్','లుక్ లెఫ్ట్','స్మైల్','ఓపెన్ యువర్ మౌత్','రైజ్ ఐబ్రోస్' వంటి ఆప్షన్స్‌ను మనకు కావాల్సిన పని కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నోటిఫికేషన్స్‌ను ఓపెన్ చేసేందుకు లుక్ అప్ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఫోన్ ముందు ముఖాన్ని పైకి ఎత్తినప్పుడు.. నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు కొన్ని ఫోన్లలో ఇది అందుబాటులో ఉంది. ఈ నెల చివరకు పూర్తిస్థాయిలో తీసుకురానున్నారు. ఫోన్లో 'ఆండ్రాయిడ్ యాక్సెసబులిటీ' సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్విచ్ యాక్సెస్‌లో దీనిని చూడవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రాజెక్ట్ యాక్టివేట్..
ప్రాజెక్ట్ యాక్టివేట్ అనేది కొత్త ఆండ్రాయిడ్ యాప్. ముఖకవళికల ఆధారంగా, ఒక్క సైగతో ఎన్నో పనులు చేయవచ్చు. మెసేజింగ్, ఫోన్ కాల్, ఆడియో ప్లే చేయడం వంటివి సులభంగా చేసేయవచ్చు.
ప్రస్తుతం ఇది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
సుందర్ పిచాయ్ ట్వీట్..
కొత్త ఫీచర్లపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
"స్మార్ట్‌ఫోన్ వాడడాన్ని అందరికీ మరింత సులభతరం చేసేందుకు కెమెరా స్విచెస్, ప్రాజెక్ట్ యాక్టివేట్ను రూపొందించాము. ముఖకవళికలు, కను సైగలను గుర్తించేందుకు ఫ్రంట్-కెమెరా, గూగుల్ఏఐ(కృత్రిమ మేధ)ను ఇది ఉపయోగించుకుంటుంది."
--- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
ఇవీ చూడండి:-