ETV Bharat / science-and-technology

ఆ ఆండ్రాయిడ్​ వెర్షన్​లో ఇకపై గూగుల్​ సేవలు బంద్​! - Google Play Store

సాధారణంగా ఆండ్రాయిడ్​ మొబైల్స్​ వాడే వారంతా రెండు, మూడేళ్ల తర్వాత కొత్త ఫోన్లకు మారుతున్నారు. మరికొందరు స్మార్ట్​ఫోన్​ పని అయిపోయేంత వరకు వదలరు. మీరూ ఇలాంటి కోవకు చెందిన వారైతే మీ ఫోన్​లో గూగుల్​ యాప్స్​(జీ-మెయిల్​, యూట్యూబ్​, గూగుల్​ మ్యాప్స్​) ఇక పనిచేయబోవు. అయితే ఇది కొంతమందికి మాత్రమే!

Gmail, YouTube, Google Maps to be blocked by Google on these Android phones
ఆండ్రాయిడ్​లో ఇకపై గూగుల్​ సేవలు బంద్​!
author img

By

Published : Sep 12, 2021, 4:37 PM IST

దిగ్గజ టెక్​ సంస్థ గూగుల్​ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో జీ-మెయిల్​, యూట్యూబ్​, గూగుల్​ మ్యాప్స్​ సహా పలు యాప్​లను బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లను అప్​డేట్​ చేసుకోవచ్చు. అయితే కొందరు.. పాత ఫోన్​లు ఆగిపోయేంత వరకు ఉపయోగించడానికి ఇష్టపడతారు. అటువంటి పాత ఆండ్రాయిడ్​ ఫోన్​లలో గూగుల్​ అకౌంట్​తో లింక్​ అయి ఉన్న అన్ని యాప్​లను నిలిపివేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యూజర్లు తమ గూగుల్ అకౌంట్‌తో సైన్​ఇన్​ చేయకుండా నిరోధించే ప్రణాళికలను సంస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇటీవల ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​ కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది.

ఏ ఆండ్రాయిడ్​ వెర్షన్​లో..

గూగుల్​ పరిచయం చేసిన ఆండ్రాయిడ్​ వెర్షన్లకు ఏదైనా తీపి పదార్థం పేరును పెట్టడం ఆనవాయితీ. అయితే డిసెంబరు 2010లో జింజర్​బ్రెడ్​ వెర్షన్​ను మార్కెట్​లోకి విడుదల చేయగా.. దాదాపు 11 ఏళ్ల తర్వాత, ఇప్పుడు దానికి సంబంధించిన సేవలు ఆపేయాలని గూగుల్​ నిర్ణయం తీసుకుంది. యూజర్ల భద్రత కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్​ తెలిపింది.

ఎప్పటి నుంచి పనిచేయవు​..

2017 ఫిబ్రవరిలో.. జింజర్​బ్రెడ్​ ఆండ్రాయిడ్​ వెర్షన్​లో గూగుల్​ పే కాంటాక్ట్​లెస్​ పేమెంట్​ పని చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ దిగ్గజ సంస్థకు చెందిన యాప్స్​ ఇకపై పనిచేయవని ప్రకటన ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 27 నుంచి ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్​లో జీ-మెయిల్​, యూట్యూబ్​, గూగుల్​ మ్యాప్​లలో సైన్​ఇన్​ అయ్యేందుకు వీలుండదు. ఒకవేళ ఆ రోజు నుంచి సదరు యాప్స్​లో లాగిన్​ అయినా.. ఎర్రర్​ అని వస్తుందని గూగుల్​ తెలిపింది. పైన చెప్పిన మూడు యూప్స్​తో పాటు గూగుల్​ ప్లేస్టోర్​, గూగుల్​ క్యాలెండర్​ సేవలు కూడా ఆగిపోనున్నాయి.

ఇప్పుడేం చేయాలి?

ఈ యాప్స్​ అన్నీ మళ్లీ మీ స్మార్ట్​ఫోన్లలో పనిచేయాలంటే.. కనీసం ఆండ్రాయిడ్​ 3.0 వెర్షన్​కు అయినా అప్​గ్రేడ్​ అవ్వక తప్పదు. ఒకవేళ మీ మొబైల్​ ఓఎస్​ అప్​డేట్​ చేసేందుకు వీలులేకుంటే.. కొత్త ఫోన్​ కొనుగోలు చేయడం మేలు.

ఇదీ చూడండి.. ఇంటర్నెట్ భద్రత కోసం గూగుల్​ ఏబీసీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.