ETV Bharat / science-and-technology

కొత్త ఏడాదిలో కొత్త గ్యాడ్జెట్లు ఏంటో మీరూ తెలుసుకోండి!

ఏటా కొత్త గ్యాడ్జెట్లు ఎన్నో వస్తుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే దైనందిన జీవనంలో ఉపయోగపడతాయి. అవి మాత్రమే కొంతకాలమైనా నిలిచి ఉంటాయి. అయితే ఈ ఏడాది నిర్వహించిన సీఈఎస్‌ టెక్‌ ఎక్స్‌పోలో- అటు కరోనా వైరస్‌ని అడ్డుకుంటూనే ఇటు నిత్య జీవితానికి పనికొచ్చేలా తయారుచేసినవే ఎక్కువ మందిని ఆకర్షించాయి. మరి వాటిమీద ఓ లుక్కేద్దామా..!

author img

By

Published : Jan 24, 2021, 12:41 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

new-gadgets-in-new-year
కొత్త ఏడాదిలో కొత్త గ్యాడ్జెట్లు...!

ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే చాలు... ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా మారింది. అయితే అలా వేసుకునే మాస్క్‌, వైరస్‌ సోకకుండా ఎంతవరకూ అడ్డుకోగలదనేది ప్రశ్నార్థకమే. అందుకే అనేక కంపెనీలు స్మార్ట్‌ మాస్క్‌ల తయారీకి శ్రీకారం చుట్టాయి. అలాంటివాటిల్లో ఒకటి ఎయిర్‌పాప్‌ యాక్టివ్‌ ప్లస్‌ స్మార్ట్‌ మాస్క్‌. ఇందులో అమర్చిన సెన్సర్‌, చుట్టుపక్కల వాతావరణంలోని గాలినాణ్యతను పరిశీలించి దానికి అనుసంధానమై ఉన్న ఫోను ఆప్‌కి పంపిస్తుంది. మాస్కులో ఉన్న ఫిల్టరు వాతావరణంలోని కలుషితాలను సైతం లోపలకు వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి వైరస్‌ సోకకుండా పూర్తి రక్షణనిస్తుందట. ఎల్‌జీ ప్యూరీకేర్‌ వేరబుల్‌ ప్యూరిఫైర్‌ మాస్క్‌ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇందులో అమర్చిన రెండు ఫిల్టర్లు 99.95 శాతం వైరస్‌నీ, బ్యాక్టీరియానీ నిరోధించడమే కాదు, ఇందులోని రెండు ఫ్యాన్లు శ్వాసకి ఇబ్బంది లేకుండానూ చేస్తాయి.

new gadgets in new year
మాస్క్‌... మరింత స్మార్ట్‌గా!

కొవిడ్‌ కాలంలో మాస్క్‌ ఎంత తప్పనిసరైనా ఫోను లేకుండా నిమిషం గడవదన్నది తెలిసిందే. కానీ మాస్క్‌ పెట్టుకుని ఫోను మాట్లాడటం కొంత ఇబ్బందికరమే. హెడ్‌సెట్‌ లేదా ఇయర్‌పాడ్స్‌ పెట్టుకున్నా ఎంతోకొంత అసౌకర్యంగానే ఉంటుంది. అందుకే ‘మాస్క్‌ఫోన్‌’ కంపెనీ రెండూ కలిసిన పరికరాన్ని తయారుచేసింది. ఇందులో ఎన్‌95 ఫిల్టర్‌తోపాటు వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లూ మైక్రోఫోనూ కూడా ఉంటాయట. రేజర్‌ కంపెనీ మరో అడుగు ముందుకేసి మాస్క్‌తో మాట్లాడుతున్నా మాట స్పష్టంగా వినిపించేలా వాయిస్‌ ఆంప్లిఫయిర్‌తో ఉన్న స్మార్ట్‌ మాస్క్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

హెల్త్​ రిపోర్ట్​ మీ చెంతే..

ఎంత స్మార్ట్‌ మాస్క్‌ పెట్టుకున్నా బయటకు వెళ్లినప్పుడు ఏ వైపు నుంచి కొవిడ్‌ సోకుతుందో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటివాళ్లు ఈ బయో ఇంటెలెసెన్స్‌ కంపెనీ తయారుచేసిన బటన్‌ను ఛాతీ పై భాగంలో అతికించుకుంటే సరి... ఇది ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతనీ పల్స్‌ రేటునీ ఫోనులో చూపిస్తుంది. మూడునెలలపాటు నిరంతరాయంగా పనిచేసే ఈ బటన్‌ చెంత ఉంటే, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేకంగా హెల్త్‌ రిపోర్ట్‌ అవసరం లేదు. దీనికి అనుసంధానమై ఉన్న ఆప్‌లో వివరాలన్నీ ఉంటాయి. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత ఏ కాస్త పెరిగినా వెంటనే జాగ్రత్తపడొచ్చు.

new gadgets in news
బయో బటన్‌!

టచ్​లెస్​ డోర్​ బెల్​

వ్యాక్సీన్‌ వచ్చినా కరోనా భయం కొంతకాలం వెంటాడుతుంటుంది. కానీ అవసరాన్ని బట్టి స్నేహితులూ బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు- చేత్తో తలుపు కొట్టాలన్నా డోర్‌బెల్‌ మోగించాలన్నా భయం అనిపించడం సహజం. అందుకే ఇప్పుడు వాటిని టచ్‌ చేయకుండానే మ్యాట్‌మీద నిలబడితే చాలు, బెల్‌ దానంతటదే మోగేలా టచ్‌లెస్‌ వీడియో డోర్‌ బెల్‌ను తయారుచేసింది అలారం డాట్‌ కామ్‌ అనే సంస్థ. అర్లో అనే మరో కంపెనీ కూడా బ్యాటరీతో పనిచేసే డోర్‌బెల్‌ను రూపొందించింది. ఎవరైనా వచ్చి బెల్‌ ముందు నిలబడగానే అందులో ఉన్న కెమెరా వాళ్లను పసిగడుతుంది. ఆపై ‘నేను మీకోసం బెల్‌ మోగిస్తున్నా... ఒక్క నిమిషం వేచి ఉండండి’ అని ముందుగానే రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌ వినిపిస్తుంది. తరవాత డోర్‌ మోగుతుంది. సో, చేతులకి ఏమీ అంటదన్నమాట.

new gadgets in news
చేత్తో పని లేదు!

తడితే చాలు..

రిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకూ ఎలాంటి ఇన్ఫెక్షన్లూ సోకకుండా ఉండేందుకు రోబోలూ మాస్క్‌లూ వంటి వాటిని యూవీలైట్లతో తయారుచేయడం సాధారణమైపోయింది. అయితే తాగే నీళ్లు కూడా అంతే పరిశుభ్రంగా ఉండేందుకన్నట్లు ఎల్‌జీ కంపెనీ ఇన్‌స్టా వ్యూ రిఫ్రిజిరేటర్‌ను తయారుచేసింది. పాక్షిక పారదర్శకంగా ఉండే దీని తలుపుమీద రెండుసార్లు తడితే చాలు... ఫ్రిజ్‌లోని యూవీ లైట్లు వెలగడంతో లోపలున్నవన్నీ చక్కగా కనిపిస్తాయి. పైగా ఆ లైట్లు లోపల బ్యాక్టీరియా చేరకుండా చేస్తాయి. ఇంకా ఇందులో అమర్చిన మైక్రోఫోనూ స్పీకర్ల వల్ల తాకకుండా కేవలం వాయిస్‌ కమాండ్స్‌ ద్వారానే ఫ్రిజ్‌ తలుపు తెరుచుకుని మూసుకునేలా చేయొచ్చట.

new gadgets in news
ఫ్రిజ్‌... పరిశుభ్రంగా..!

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..

కొవిడ్‌ పుణ్యమాని ఎవరికి వాళ్లు ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. అయితే కారులో ఎంత దూరం అని ప్రయాణించగలరు... అందుకే జనరల్‌ మోటార్స్‌ కంపెనీ క్యాడిలాక్‌ ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ డ్రియోడ్‌ అనే ఎయిర్‌ ట్యాక్సీకి రూపకల్పన చేసింది. ఇటు కారులానూ అటు ఎయిర్‌క్రాఫ్ట్‌ లానూ వాడుకోగలిగేలా తయారుచేసిన ఈ ట్యాక్సీ గంటకు 55 మైళ్ల వేగంతో దానంతటదే డ్రైవ్‌ చేసుకుంటూ ప్రయాణిస్తుందట. కిక్కిరిసిన నగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందనడంలో నో డౌట్‌.

new gadgets in news
కారులో ఎగిరిపోవచ్చు!

టచ్​ చేస్తే చాలు..

మొబైల్‌ ప్రపంచంలో ఫోల్డబుల్‌ ఫోన్ల ఆవిష్కరణ ఒక సంచలనం. ఇప్పటికే ఇవి చాలానే మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా వాటితోపాటు ఎల్‌జీ, టిసిఎల్‌... వంటి కంపెనీలు రోలబుల్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీని ప్రారంభించాయి. ఈ ఏడాదే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్లమీద వేలితో చిన్నగా టచ్‌ చేస్తే చాలు... 6.7 అంగుళాల ఫోను కాస్తా 7.8 అంగుళాల సైజుకి పెరిగి చిన్నసైజు ట్యాబ్లెట్‌లా మారిపోతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చిన్నసైజులోనూ చదువుకోవాలనుకున్నప్పుడు పెద్దసైజులోనూ ఉన్న ఫోనుని వాడుకోవచ్చన్నమాట.

new gadgets in news
ఫోను సాగిపోతుంది!

ఎన్నిరోజులైనా పర్లేదు..

స్ట్‌బిన్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా అందులో వేసే రకరకాల చెత్త కారణంగా అది అంతో ఇంతో వాసన వస్తూనే ఉంటుంది. అయితే పెటల్‌ కంపెనీ ఎలాంటి వాసనా రాని ఓ డస్ట్‌బిన్‌ను తయారుచేసింది. ఇందులో అమర్చిన యూవీసీ టెక్నాలజీ వల్ల ఇది లోపల వేసిన పదార్థాల్లో బ్యాక్టీరియా విస్తరించకుండా ఫ్రీజ్‌ చేసేస్తుందట. దాంతో అందులో అవి ఎన్ని రోజులున్నా కుళ్లిపోకుండా ఉంటాయి. పిల్లల డైపర్లూ వదిలేసిన ఆహారపదార్థాలు ఏది వేసినా కూడా వాసన రానివ్వకుండా కుళ్లిపోకుండా తయారైన ఈ డస్ట్‌బిన్‌కి చైల్డ్‌ లాక్‌ కూడా ఉందట. చీకట్లో కూడా ఈ డస్ట్‌బిన్‌ కనిపించేలా దాని ఫుట్‌ పెడల్‌ దగ్గర లైటు వెలుగుతుంటుంది.

new gadgets in news
చెత్తడబ్బా... వాసన రాదు!

భయం అవసరం లేదు..

ఫీసుకు వెళ్లే హడావుడిలోనో చుట్టాలొచ్చినప్పుడో వంట చేసే కంగారులోనో ఏదొకటి ఒలకబోస్తుంటాం. అలాగే ఇంట్లో పిల్లలు, పెంపుడు కుక్కలు ఉన్నప్పుడు కూడా నేలమీదా కార్పెట్లపైనా సోఫాల్లోనూ మరకలు పడటం మామూలే. వాటిని శుభ్రం చేసుకోవడమే పెద్ద సమస్య. అందుకే బ్లాక్‌ డెకర్‌ కంపెనీ గతేడాది చివరలో స్పిల్‌బస్టర్‌ అనే పరికరాన్ని తీసుకొచ్చింది. ఇది నేలమీద ఏది పడినా చిటికెలో శుభ్రం చేసేస్తుంది, మరక లేకుండా చేస్తుంది. చిన్నపాటి తుపాకీలా ఉన్న దీన్ని కింద పడిన వాటిమీద ఉంచి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు, ఒలికిన పాలు, సాస్‌, పచ్చడి ఏదయినాగానీ పీల్చుకుని దానికి అమర్చిన బౌల్‌లోకి వచ్చేలా చేస్తుంది. ఆపై దానికి ఉన్న స్క్రబ్బింగ్‌ బ్రష్‌తో అక్కడ మరక ల్లేకుండా శుభ్రం చేసేస్తుంది. పని పూర్తయ్యాక చెత్త చేరుకున్న బౌల్‌ని విడిగా తీసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

new gadgets in news
మరక మిగలదు

ఇవే కాదు, కొహ్లెర్‌ కంపెనీ ఫ్లష్‌ నొక్కకుండానే పనిచేసేలా రూపొందించిన టాయ్‌లెట్టూ, అచ్చం స్పాలో ఉన్న అనుభూతిని కలిగించేలా డిజైన్‌ చేసిన స్టిల్‌నెస్‌ బాత్‌ టబ్బూ; ఇన్ఫెక్షన్లు సోకకుండా పరిసరాల్ని శుభ్రంచేసేందుకు అల్ట్రా వయొలెట్‌ కాంతితో పనిచేసే ఎల్‌జీ అటానమస్‌ రోబో, ఇంటర్నెట్‌ ఆప్‌తో అనుసంధానమై పనిచేసే స్మూతీ మేకర్లూ నచ్చిన లిప్‌స్టిక్కు రంగుని అప్పటికప్పుడు తయారుచేసిచ్చే స్మార్ట్‌ లిప్‌స్టిక్కులూ....ఇలా మరెన్నో అధునాతన ఉపకరణాలు ఈ ఏడాది మార్కెట్లోకి రానున్నాయి.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల మార్కెట్​లోకి ఎస్​ఎక్స్​ఆర్ 160 మోడల్ స్కూటర్

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.