ETV Bharat / science-and-technology

2020 బెస్ట్​ టీవీ : ఎల్జీ ఫ్లాట్ స్క్రీన్

ఒకప్పుడు లావుగా ఉన్న టెలివిజన్‌ సన్నబడి డ్రాయింగ్‌రూమ్‌ షెల్ఫ్‌లోనుంచి గోడ మీదికి ఎక్కి చాలాకాలమే అయింది. అయితే ఆ గోడమీద కూడా కేవలం కేలండరు మందంతో అతుక్కుపోయే టీవీలను రూపొందించింది ఎల్జీ కంపెనీ.

lg-flat-screen-television-is-the-best-tv-of-the-year-2020
ఎల్జీ ఫ్లాట్ స్క్రీన్
author img

By

Published : Dec 27, 2020, 5:25 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ఈ ఏడాది బెస్ట్‌ టీవీ అనిపించుకున్న ఎల్జీ ఫ్లాట్‌ స్క్రీన్‌ టీవీ మందం రెండు సెంటీ మీటర్లే. దీని తెర సెల్ఫ్‌లిట్‌ పిక్సెల్స్‌తో ప్రకాశవంతంగా వెలిగిపోతుంటుంది. సినిమా అయినా క్రికెట్‌ అయినా చూస్తుంటే మనమూ అందులో భాగమేనేమో అన్నంతగా లీనమైపోయేలా ఆకట్టుకుంటుంది గేలరీ డిజైన్‌. ఏఐ ప్రాసెసర్‌, పిక్చర్‌ ప్రో, సౌండ్‌ ప్రో లాంటివే కాక డాల్బీ విజన్‌ ఐక్యూ, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌లాంటి ప్రత్యేకతలన్నీ ఉన్నాయి.

తెర సరే, మరీ ఇంత సన్నగా ఉండే దీనిలో ప్రత్యేక ఫీచర్లు ఏమి ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. ఇప్పుడు వస్తున్న కొత్త టీవీల్లాగే దీన్ని కూడా ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసి గూగుల్‌ అసిస్టెంట్‌, అలెక్సా లాంటివన్నీ వాడుకోవచ్చు. గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఇంకా ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో అనుసంధానం చేసి సోఫాలోనుంచి కదలకుండానే ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవచ్చు. కాలింగ్‌ బెల్‌ కొట్టిందెవరో చూడవచ్చు. మన దేశంలోనూ అందుబాటులో ఉన్న దీని ధర మూడు లక్షల పాతిక వేల రూపాయలు.

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.