Flipkart Big Dussehra Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ మరో ఫెస్టివ్ సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల బిగ్ బిలియన్ డేస్ పేరుతో అతిపెద్ద సేల్ నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. దసరా పండగను పురస్కరించుకుని "బిగ్ దసరా సేల్"ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. అక్టోబర్ 22 నుంచి 29 వరకు మొత్తం 8 రోజుల పాటు ఈ సేల్ జరపనున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
"బిగ్ దసరా సేల్"లో భాగంగా కోటక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ కార్డు హోల్డర్లకు 10 శాతం మేర డిస్కౌంట్‌ను కూడా అందించనుంది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులపైనా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం డిస్కౌంట్ లభించనుంది. అయితే అది ఒక్క 21వ తేదీన మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. సూపర్ కాయిన్లతో 5% అదనపు డిస్కౌంట్ పొందొచ్చని కూడా వెల్లడించింది. దీని తర్వాత దీపావళికి ముందు కూడా మరో సేల్ నిర్వహించనుంది ఫ్లిప్‌కార్ట్.
Flipkart Big Dussehra Sale Offers : ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫ్యాషన్ దుస్తులపై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక డీల్స్ ప్రకటించింది. మోటోరొలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 5జీ, గూగుల్ పిక్సెల్ 7ఏ, శాంసంగ్ ఎస్ 22 5జీ, పోకో ఎఫ్5, వివో టీ2 ప్రో లాంటి మొబైల్స్‌పై ఆఫర్లు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. త్వరలోనే ఐఫోన్ 14 సహా పలు మొబైల్స్‌పై ఆఫర్లను రివీల్ చేయనుంది. ఈ సేల్‌లోని ధరలు.. ఇంచుమించు బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగానే ఉండనున్నాయి. కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్ మిస్ అయిన వారు.. ఈ బిగ్ దసరా సేల్‌లో వాటిని సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ షాపింగ్.. ఈ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి పండగే!
Flipkart Big Billion Days Sale 2023 Offers : దసరా సీజన్ మొదలైంది. అందుకే పలు ఆన్లైన్ షాపింగ్ వేదికలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్.. బిగ్ బిలియన్ డేస్ 2023ని అనౌన్స్ చేసింది. అయితే.. క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే ఫ్లిప్‌కార్ట్ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.