జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ.. అత్యంత ఖరీదైన బ్రావియా స్మార్ట్ టీవీని భారత్‌లో విడుదల చేసింది. హెచ్డీఎంఐ 2.1 సపోర్ట్‌పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ గేమ్స్ ఆడేవారికి అత్యంత అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంట్లోనే ఉంటూ థియేటర్లో సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించవచ్చని ప్రకటించిన సోనీ.. కాగ్నిటివ్ ప్రాసెసర్ టెక్నాలజీతో రూపొందించినట్లు పేర్కొంది. 195, 164, 139సెం.మీ.లలో లభ్యం కానున్న సోనీ బ్రావియా.. ప్రారంభ ధర రూ.2,99,990
సోనీ బ్రావియా ఫీచర్లు..
- ఏ 80జే హెచ్డీఆర్
- 4కే రిజల్యూషన్
- డాల్బీ విజన్
- డాల్బీ సౌండ్
"ఓఎల్‌ఈడీ సిరీస్‌లో అభివృద్ధి చేసిన ఎక్స్‌ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ సాంప్రదాయ కృత్రిమ మేధను మించి.. మానవ మెదడులా ఆలోచించేలా రూపొందించాం. అత్యంత వాస్తవికమైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్-ఫ్రమ్-పిక్చర్ రియాలిటీతో ఉత్తమమైన అనుభూతిని అందించనుంది."
-సోనీ ఇండియా
ఇది దేశంలోని అన్ని సోనీ కేంద్రాలతో పాటు.. ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టల్‌లలో అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది.
ఇవీ చదవండి: సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీలు- ధరలు ఇలా..