ETV Bharat / science-and-technology

ఆ ఫీచర్​తో మీ ఐఫోన్​లో డేటా సేఫ్​!

Erase Data iPhone: ఒక్కోసారి తెలియకుండానే మీ ఐఫోన్​లోని డేటా ఇతరులు, సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశముంది. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించేందుకు ఓ ఫీచర్​.. ఐఫోన్​లో ఉంది. దానిని యాక్టివేట్​ చేస్తే మీ డేటాకు ఎలాంటి ముప్పు ఉండదు. మరి ఆ ఫీచరేంటో చుద్దామా?​

Erase Data iPhone
Erase Data iPhone
author img

By

Published : Dec 26, 2021, 1:16 PM IST

Erase Data iPhone: ఐఫోన్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు! ఆ ఫోన్‌లో ఉండే ఫీచర్స్‌ అలాంటివి. అయినప్పటికీ కొన్నిసార్లు ఐఫోన్​ యూజర్ల డేటా లీకైందని వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఫోన్​ పోవడం, దొంగతనానికి గురవడం, హ్యాక్​ అవడం.. ఇలా సందర్భం ఏదైనా మీ డేటా ఇతరులు/సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశముంది. సులభతరమైన పాస్​వర్డ్​లు సెట్​ చేసుకోవడం వల్ల మీ ఫోన్​ ఈజీగా హ్యాక్​ అయ్యే ప్రమాదముంది. అయితే ఆ ప్రమాదం నుంచి యూజర్ల డేటాను కోల్పోకుండా.. ఇతరులకు చిక్కకుండా అదిరిపోయే ఫీచర్​ ఐఫోన్​లో ఉంది. అదే 'ఎరేస్​ డేటా​'.

ఐఫోన్​ సేఫ్టీ ఫీచర్​

'ఎరేస్​ డేటా' ఫంక్షన్​తో మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ ఐఫోన్​లో ఈ ఫీచర్‌ ఆన్​ చేసి ఉన్నట్లయితే.. మీకు తెలియకుండా ఇతరులెవరైనా పాస్‌వర్డ్‌ను ఓపెన్​ చేయడానికి, ఫోన్​ హ్యాక్​ చేయడానికి ప్రయత్నించినా.. ఆ డేటా డిలీట్​ అయిపోతుంది. 10 సార్లు తప్పు పాస్​వర్డ్​ ఎంటర్ చేస్తే.. మీ ఐఫోన్​లోని ఫొటోస్​, మెసేజ్​లు, కాంటాక్ట్​ నెంబర్లు సహా మొత్తం డేటా డిలీట్​ అయిపోతుంది.

ఎరేస్​ డేటా ఫంక్షన్​ను ఎలా ఎనెబుల్ చేయాలనేదే కదా మీ డౌట్​! ఇలా యాక్టివేట్​ చేసేయండి.

  • మీ ఐఫోన్​లో సెట్టింగ్స్​ను ఓపెన్​ చేయాలి
  • ఫేస్​ ఐడీ, పాస్​కోడ్​ ఓపెన్​ చేయాలి. అక్కడ మీ పాస్​వర్డ్​ ఎంటర్​ చేయాలి.
  • కిందికి స్క్రోల్ చేయాలి. ఎరేస్​ డేటాను ఆన్​ చేయాలి.

మళ్లీ ఆ డేటాను పొందలేమా?

అయితే.. మీ డేటా అంతా పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. మళ్లీ మీ డేటాను సేఫ్​గా బ్యాకప్​ చేసుకోవచ్చు. ఐక్లౌడ్​లో డేటా బ్యాకప్‌ ఉన్నంత వరకు మీ డేటా సురక్షితంగా ఉంటుంది. ఈ ఐక్లౌడ్​ ద్వారా కొత్త ఫోన్​లో మీ డేటాను తిరిగి పొందవచ్చు.

ఇదీ చూడండి: Background apps on Android: ఆండ్రాయిడ్​ ఫోన్లలో అలా చేస్తే నష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.