స్పెక్ట్రమ్ వేలానికి ఆరో రౌండ్ బిడ్లు దాఖలు చేసే ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్రం బుధవారం నోటీసు జారీ చేసింది.
వేలంలో పాల్గొనే టెలికాం కంపెనీలు ఫిబ్రవరి 5లోపు తమ దరఖాస్తులు పంపించాలని టెలికాం విభాగం(డాట్) స్పష్టం చేసింది.
రూ.3.92 లక్షల కోట్లు విలువైన.. 2,251.25 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేసే ప్రతిపాదనకు 2020 డిసెంబరు 17న కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
జనవరి 12 ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు డాట్ వెల్లడించింది. నోటీసుపై వివరణ కోరేందుకు ఈ నెల 28ని తుది తేదీగా నిర్ణయించింది.