Iphone 14 with slider screen: కొత్త ఐఫోన్ మరో స్లైడర్ స్క్రీన్‌తో రానుందా? కాన్సెప్ట్స్ ఐఫోన్ విడుదల చేసిన తాజా డిజైన్ ట్రైలర్ చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. వచ్చే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ పరికరాలు మరింత సౌకర్యంగా ఉండటం ఖాయమని తెలుస్తోంది. కొత్త ఐఫోన్ అనగానే ఎలాంటి వినూత్న ఫీచర్లతో అలరిస్తాయోననే ఆసక్తి అందరి మదిలోనూ మెదులుతుంది. రాబోయే ఐఫోన్లు సైతం ఇప్పట్నుంచే అలాంటి ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ఇవి సెకండరీ స్లైడర్ స్క్రీన్‌తో పాటు గాలితో.. అంటే వైర్‌లెస్ ఛార్జింగ్ పరిజ్ఞానంతోనూ ముస్తాబు కానున్నాయి మరి. ఫోన్‌ను అడ్డంగా పట్టుకొని మీది తెరను పైకి జరిపితే కింది తెర కీబోర్డుగా, గేమింగ్ కంట్రోల్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు, తెర మీద పనులు చేసుకోవటానికి మరింత స్పేస్ కూడా లభిస్తుంది. ఒకే సమయంలో రెండు తెరలనూ వాడుకోవచ్చు. ఛార్జింగ్ స్టాండ్, కేబుళ్ల జంజాటం లేకుండా గాలి ద్వారానే ఫోన్లు ఛార్జ్ అవుతాయి.
Apple wireless charger: గతంలోనూ యాపిల్ సంస్థ ఇలాంటి సదుపాయం కల్పించినప్పటికీ తాజా పరిజ్ఞానంతో దూరం నుంచీ ఫోన్లను ఛార్జ్ చేసుకోవచ్చు. సాకెట్‌కు ఛార్జర్‌ను పెట్టి ఉంచితే గదిలో ఎక్కడ్నుంచైనా ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ భద్రత.. ఏ16 బయోనిక్ స్మార్ట్‌ఫోన్ చిప్‌తో కూడిన ఇవి తెలుపు, నారింజ, ముదురు నీలం, నలుపు, సింధూర వర్ణాల్లో అలరించనున్నాయి. డేటా మార్పిడి, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి కనెక్టర్‌తోనూ కూడి ఉంటాయి. ఐరోపా సమాఖ్య కొత్త నిబంధనల మేరకు ఈ యూఎస్‌బీని అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 14 మోడల్ 1 టీబీ, ప్రొ మోడల్ 2 టీబీ స్టోరేజీ కలిగి ఉండొచ్చు. కెమెరా మరింత మెరుగవ్వనుంది. ముఖ్యంగా చాలా విమర్శలు ఎదుర్కొన్న బంప్‌ను తొలగించనున్నారు.
ఇదీ చూడండి: మీ ఐఫోన్ ఇకపై మీరే రిపేర్ చేసుకోవచ్చు!
ఇదీ చూడండి: ఐఫోన్ సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేశారా? ఓసారి చూడండి!