భారత్‌కు చెందిన 70 లక్షల మంది డెబిట్, క్రెడిట్ కార్డుదారుల డేటా.. డార్క్ వెబ్‌లో లీక్ అయినట్టు ఓ అంతర్జాల భద్రతా పరిశోధకుడు వెల్లడించారు. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రెస్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు లీక్ అయినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా వినియోగదారుల పేర్లు, వారు పనిచేసే సంస్థ, వార్షిక ఆదాయానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయని రాజశేఖర్ రాజహరియ వివరించారు.
'ఈ డేటా 2010-19 మధ్యకాలానికి సంబంధించింది. హ్యాకర్లకు ఇది ఎంతో విలువైనది. దీని సైజు 2జీబీ వరకు ఉంటుంది. ఫిషింగ్ దాడులతో పాటు ఇతర సైబర్ దాడులకు హ్యాకర్లు పాల్పడవచ్చు. అయితే కార్డు నెంబర్లు లేకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం.'
-- రాజశేఖర్, ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్.
థర్డ్ పార్టీ సర్వీసుల నుంచి డేటా లీక్ అయినట్టు అనుమానం వ్యక్తం చేశారు రాజశేఖర్. తమ కార్డులను అమ్మడానికి ఈ సర్వీసులను బ్యాంక్‌లు సంప్రదిస్తూ ఉంటాయి.
ఈ డేటాను ఇప్పటికే అమ్మేసి ఉంటారని.. ఆ తర్వాతే ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చుంటాయని అభిప్రాయపడ్డారు రాజశేఖర్. ఇంటర్నెట్లో అత్యంత విలువైనది ఏదైనా ఉంటే.. అది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన డేటానేనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- కరోనా ఆందోళనకు 45నిమిషాల సూత్రం!