ETV Bharat / science-and-technology

కొత్త వేరియంట్లపై టీకాల సత్తా ఎంత?

కరోనావైరస్​లో రోజురోజుకూ ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతున్నాయి. ప్రధాన వైరస్​ను అడ్డుకునేందుకు తయారు చేసిన టీకాలు.. ఈ వేరియంట్లను సమర్థంగా నివారించగలుగుతున్నాయా? దానిపై నిపుణులు ఏమంటున్నారు?

Coronavirus: so many variants, but vaccines are still effective
కొత్త వేరియంట్లపై టీకాల సత్తా ఎంత?
author img

By

Published : May 26, 2021, 10:00 AM IST

రోజులు గడిచిన కొద్దీ వైరస్​లలో మార్పులు వస్తుంటాయి. కొన్ని మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. మరికొన్ని వైరస్ తీవ్రతను తగ్గిస్తాయి. కొన్నిసార్లు వైరస్ మనుగడ సాధించేందుకు ఈ మార్పులు తోడ్పడతాయి.

జన్యుపదార్థాలలో జరిగే పొరపాట్ల వల్ల ఈ మార్పులు సంభవిస్తుంటాయి. వైరస్ తీవ్రతను పెంచి, మరింత వ్యాపించేలా చేసే మార్పులపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుంది. సహజ రోగనిరోధక శక్తిని, టీకా ద్వారా లభించిన ఇమ్యూనిటీని సైతం ఈ వేరియంట్లు సమర్థంగా ఎదుర్కొంటాయి.

ఇదీ చదవండి- 'కొత్త రకం కరోనాను తేలికగా తీసుకోలేము'

కరోనా సైతం

కొవిడ్-19కు కారణమయ్యే సార్స్​-కోవ్-2 వైరస్ ఇందుకు భిన్నమేమీ కాదు. వైరస్ వ్యాపించిన ప్రతిసారి మరింత ప్రాణాంతకంగా మారుతుంది. ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా ఇది జరుగుతుంది. కాబట్టి వైరస్ వేరియంట్లను గుర్తించి, అవి వేగంగా వ్యాపిస్తున్నాయా?, వ్యాధి తీవ్రతను పెంచుతున్నాయా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాల్సి ఉంటుంది.

నాలుగు ఆందోళనకర వేరియంట్లు

ఒక వేరియంట్​ను గుర్తిస్తే దాని తీవ్రతను బట్టి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ ఆఫ్ హై కాం​సిక్వెన్స్​గా విభజిస్తారు. ఇప్పటివరకు వేరియంట్ ఆఫ్ కాంసిక్వెన్స్ బయటపడకపోవడం కొంతవరకు ఉపశమనం కలిగించే వార్తే. వేరియంట్ ఆఫ్ కన్సర్న్​(ఆందోళనకరమైన వేరియంట్)లు నాలుగు వెలుగులోకి వచ్చాయి.

అవి

  1. యూకేలో బయటపడిన 'బీ117'
  2. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన 'బీ1351'
  3. బ్రెజిల్​లో గుర్తించిన 'పీ1'
  4. ఇండియాలో కనిపించిన 'బీ16172'

ఆందోళకరమైన వేరియంట్లు బయటపడటం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని అర్థమవుతోంది. వ్యాధి తీవ్రత పెరగడం, యాంటీబాడీలను వైరస్​లు ఎదుర్కోవడం, టీకా ప్రభావాన్ని తగ్గించడం వంటివి వీటి పర్యవసానాలు. ఈ వైరస్ రకాలన్నీ వ్యాప్తిని పెంచాయనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.

వైరస్ వ్యాప్తి పెరుగుదలను జనాభాలో గుర్తించవచ్చు. కానీ ఎందుకు వ్యాప్తి పెరుగుతుందనేది ల్యాబరేటరీల్లో పరీక్షించి తెలుసుకోవాలి. మానవ శరీరంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లే వైరస్ స్పైక్ ప్రోటీన్.. ఈ ఆందోళనకరమైన వేరియంట్లలో గణనీయంగా మార్పుచెందింది. కొవిడ్ స్పైక్ ప్రోటీన్​ను లక్ష్యంగా చేసుకొనేలా తీర్చిదిద్దిన యాంటీబాడీలు ఈ కొత్త వేరియంట్లను సమర్థంగా నిలువరించలేకపోతున్నాయి. ఈ విషయం కొన్ని ల్యాబ్ పరిశోధనల్లో వెల్లడైంది.

టీకాల పనితీరు భేష్

కానీ ఆందోళకరమైన వేరియంట్ వ్యాప్తిలో ఉన్న ప్రాంతాల నుంచి తీసుకున్న డేటాను పరిశీలిస్తే.. వ్యాక్సిన్​ ప్రభావవంతంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీకా యాంటీబాడీలను అడ్డుకునేంత ప్రమాదకరంగా కరోనావైరస్ మారిపోలేదని స్పష్టమవుతోంది. ఖతర్​లో నిర్వహించిన ఓ పరిశోధన ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది.

ఇదీ చదవండి- 'భారత్ వేరియంట్​పై అమెరికా టీకాలు భేష్'

వైరస్ రకం టీకా సమర్థత
బీ117 వేరియంట్​ ఫైజర్ 90 శాతం
బీ117 వేరియంట్​ ఆస్ట్రాజెనెకా 75 శాతం
బీ1351 వేరియంట్ఫైజర్ 75 శాతం
బీ16172 వేరియంట్ఫైజర్ 88 శాతం
బీ16172 వేరియంట్ఆస్ట్రాజెనెకా 60 శాతం

ఫైజర్​తో పోలిస్తే ఆస్ట్రాజెనెకా టీకా సమర్థత తక్కువగా ఉందని తెలుస్తోంది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల విడుదల మధ్య తేడా ఉండటం ఇందుకు ఓ కారణం అయి ఉండొచ్చు.

ఇదీ చదవండి- 'ఆ కరోనా రకాలపై టీకాలూ పనిచేయవ్!'

వ్యాక్సిన్​లను ఎదురించి వేరియంట్లు వ్యాప్తి చెందితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ వేరియంట్లు అధిక మరణాలకు కారణమవుతున్నాయా లేదా అనేది గుర్తించాలి. వైరస్ తీవ్రతను, మరణ ముప్పును తగ్గించడం టీకా ప్రాథమిక ఉద్దేశం. ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. ప్రధానంగా చెలామణిలో ఉన్న వ్యాక్సిన్లు ఈ పని చేస్తే సరిపోతుంది.

ఇదీ చదవండి- 'టీకాలే ఆ వేరియంట్​ను సమర్థంగా ఎదుర్కొంటాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.