ETV Bharat / science-and-technology

బెస్ట్​ రూ.199 ప్లాన్​ (జియో/ ఎయిర్​టెల్/ వొడాఫోన్/ BSNL)​ ఏదంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 3:07 PM IST

Comparison Of All 199 Prepaid Plans In Telugu : దేశంలోని టాప్-4 టెలికాం కంపెనీలు అయిన బీఎస్​ఎన్​ఎల్​, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు.. భిన్నమైన బెనిఫిట్స్​తో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్​లను అందిస్తున్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్​ ప్లానో తెలుసుకుందామా?

best 199 prepaid plan in India
Comparison Of All 199 Prepaid Plans

Comparison Of All 199 Prepaid Plans : బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అనే ఈ నాలుగు భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు విభిన్నమైన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్‌ల కోసం ఒకేసారి రూ.200 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులకు రూ.199 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ధర ఒక్కటే అయినప్పటికీ.. ఈ నాలుగు టెల్కోలు అందిస్తున్న బెనిఫిట్స్ భిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL 199 Plan Details :
BSNL రూ.199 ప్లాన్ 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటా చొప్పున అందిస్తుంది. అంటే ఈ ప్లాన్‌తో మొత్తంగా 60GB డేటా పొందవచ్చు. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) ప్రకారం, 2జీబీ డేటా అయిపోయిన తరువాత, 40 Kbps స్పీడ్​తో వినియోగదారులు డేటాను వాడుకోవచ్చు.

Airtel 199 Plan Details :
భారతీ ఎయిర్‌టెల్ తన రూ.199 ప్లాన్‌ను 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 SMSలను పొందుతారు. వీటితో పాటు వింక్ మ్యూజిక్, హలోట్యూన్స్​ను కూడా ఉచితంగా లభిస్తాయి. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో రూ. 5 విలువైన టాక్‌టైమ్‌ను కూడా అదనంగా అందిస్తుంది.

Vi 199 Plan Details :
వొడాఫోన్ ఐడియా (Vi) రూ.199 ప్లాన్ 18 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో ప్రతి రోజు 1GB డేటా చొప్పున మొత్తంగా 18 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనితోపాటు Vi మూవీస్ & టీవీ బేసిక్​ కూడా ఆస్వాదించవచ్చు. FUP ప్రకారం, నిర్ణీత డేటా పూర్తయిన తర్వాత నెట్ స్పీడ్ 64 Kbpsకు పడిపోతుంది. ఈ వీఐ ప్లాన్​లో.. డేటా ప్రయోజనాలతో పాటు, వినియోగదారులు ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలు పొందుతారు.

Reliance Jio 199 Plan Details :
రిలయన్స్ జియో కూడా రూ.199 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్​ 23 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.55 GB చొప్పున లభిస్తుంది. ఈ ప్లాన్​ ద్వారా.. అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ.. రోజుకు 100 ఎస్ఎంఎస్‎లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‎తో సహా జియో యాప్‌లు అన్నీ వినియోగించుకోవచ్చు. FUP నియమం ప్రకారం, నిర్దేశిత డేటా వినియోగించిన తర్వాత.. ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గిపోతుంది.

ఫేక్ వెబ్​సైట్స్​ను గుర్తించాలా? ఈ సింపుల్​ ట్రిక్స్​ ఫాలో అవ్వండి!

మంచి వాటర్ హీటర్​ కొనాలా? తక్కువ బడ్జెట్​లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.