జాబిల్లి నుంచి మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక 'చాంగే -5' భూమిని సురక్షితంగా చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంగోలియాలోని సిజివాంగ్ జిల్లాలో సంబంధిత క్యాప్సూల్ దిగింది.
ఇదీ చదవండి: జాబిల్లిపై జాతీయ జెండా పాతిన చైనా
ఈ నెల 1న జాబిల్లి ఉపరితలంపై కాలు మోపిన 'చాంగే -5' రెండు మీటర్ల లోతు వరకు తవ్వడం ద్వారా దాదాపు రెండు కిలోల నమూనాలను సేకరించింది. చంద్రుడి నుంచి మట్టి, రాతి నమూనాలను భూమికి తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరి సారిగా 1976లో అప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన 'లూనా-24' చందమామ నుంచి నమూనాలను మోసుకొచ్చింది.
ఇదీ చదవండి: చంద్రుడిపై తవ్వకాలు మొదలు పెట్టిన చైనా