ChatGpt Earn Money : చాట్‌జీపీటీ.. ఇప్పుడు ఎక్కడా చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే దీనికి.. రోజురోజుకు ఆదరణ బాగా పెరుగుతోంది. గతేడాది నవంబరులో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ వల్ల అనేక లాభాలున్నాయని కొందరు వాదిస్తుంటే.. మరికొందరేమో తమ ఉద్యోగాలకే ఎసరు తెస్తుందంటూ వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే చాట్‌జీపీటీతో కూడా డబ్బులు ( ChatGpt Make Money Ideas ) సంపాదించవచ్చన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సామాజిక మాధ్యమాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్ ద్వారా అనేక మంది డబ్బు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చాట్‌జీపీటీని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని అంటున్నారు. మరి దీంట్లో నిజమెంత? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెబ్సైట్ లేదా యాప్ క్రియేట్ చేయవచ్చు!
ChatGpt Earning Money Sources : చాట్‌జీపీటీ ద్వారా చాలా సులువుగా వెబ్సైట్ లేదా యాప్‌ను క్రియేట్ చేయవచ్చు. వీటిని మీరు స్వయంగా ఉపయోగించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. లేదా ఇతరుల కోసం వెబ్‌సైట్స్ లేదా యాప్స్ రూపొందించి ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇందు కోసం మీరు నివసించే ప్రాంతంలో మంచి గిరాకీ ఉండే చిన్న చిన్న రిటైల్ స్టోర్స్‌ను ముందుగా ఎంచుకోండి. వారు వారి వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఏవైనా వెబ్సైట్ లేదా ఆన్లైన్ సేవలను వినియోగిస్తున్నారా? లేదా? అని ఆరాతీయండి. ఒకవేళ వినియోగించకపోతే మీ దగ్గర ఉన్న కనీస ప్రాథమిక పరిజ్ఞానంతో చాట్‌జీపీటీ సాయంతో సులభంగా, అర్థమయ్యే విధంగా ఉండే ప్రోగ్రామింగ్‌ను, వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయండి. దీని ద్వారా కలిగే లాభాలను దుకాణదారులకు వివరించండి. ఈ వెబ్సైట్ మీ పనిని మరింత సులభతరం చేస్తుందని చెప్పండి. వెబ్‌సైట్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే, మిమ్మల్ని సంప్రదించవచ్చని భరోసానివ్వండి. ఇందుకోసం మీరు నామినల్‌గా ఛార్జీలను వసూలు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ఒక రెస్టారెంట్ కోసం ఆన్లైన్ ఆర్డరింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. అది పెద్దగా విజయం సాధించలేదు. అయినా ChatGPTతో దానికి సంబంధించిన ఫొటోలు, పని వేళలు, కస్టమర్ రివ్యూస్ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని.. మీరు తయారు చేసిన వెబ్సైట్ లేదా యాప్‌లో పొందుపరచవచ్చు. ఇందుకోసం సదరు సంస్థ మీకు డబ్బులను చెల్లిస్తుంది. మొత్తంగా వినియోగదారులకు ఎటువంటి సమాచారం కావాలో ముందే తెలుసుకొని, వాటికి అనుగుణంగా ఈ ఏఐ టూల్‌ను వినియోగించండి. దీంతో మీరు డబ్బు సంపాదించే( ChatGpt Money Earning ) అవకాశం మెరుగవుతుంది.
వ్యాపార సమస్యలకు చెక్!
How To Earn Money Using ChatGpt : వ్యాపార రంగంలో నెలకొన్న సాంకేతిక సమస్యలే కాకుండా, ఇతరత్రా లోటుపాట్లను పరిష్కరించేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకోండి. చిన్న, మధ్య తరహా వ్యాపారులు బిజినెస్‌కి సంబంధించిన సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం వారికి సులభంగా అర్థమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను రూపొందించండి. లేదా వారికి ఉపయోగపడే ఆన్లైన్ టూల్స్‌ను చాట్‌జీపీటీతో తయారుచేయండి. ఈ విధంగా కూడా మీరు డబ్బులు సంపాందించడానికి వీలవుతుంది.
ఫ్రీలాన్సింగ్‌తో కూడా డబ్బు!
Does ChatGpt Earn Money : వ్యాపారానికి సంబంధించి లావాదేవీల రిపోర్ట్‌లను సులువుగా రూపొందించేలా ఒక వ్యవస్థను చాట్‌జీపీటీ ద్వారా క్రియేట్ చేయవచ్చు. ఇందులో ఎక్సెల్ ఫార్ములాలతో పాటు, ఇతర బిజినెస్ ఆధారిత సిస్టమ్‌లను కూడా జోడించవచ్చు. వీటి ద్వారా వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలా మీరు తరచూ కమర్షియల్ అవుట్‌లెట్స్‌కు.. సేవలను అందించడం ద్వారా మీ మార్కెట్‌ను విస్తరించుకోవచ్చు. ప్రముఖ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లైన అప్‌వర్క్(Upwork), (Fiverr) ల్లోనూ మీ సర్వీస్‌ను అందించి డబ్బులు సంపాదించవచ్చు.
ఈ మార్గాల ద్వారా కూడా..
- ఎవరైనా వారి అవసరాలకు తగ్గట్టు వీడియోలను ఎడిట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు చాట్‌జీపీటీ ప్లగిన్ల సాయంతో దాన్ని మరింత ఆకర్షణీయంగా క్రియేట్ చేసి ఇవ్వవచ్చు.
- ఈ చాట్‌బాట్ సాయంతో వ్యాపార సమాచారంతో పాటు ఇతర డేటాను కూడా ఫ్లోఛార్ట్లు, గ్రాఫ్‌ల రూపంలో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దవచ్చు.
- చాట్‌జీపీటీ సాయంతో చాలా సులువుగా డేటా సాల్వింగ్ ప్లాబ్లమ్స్( Data Solving Problem With ChatGPt )ను పరిష్కరించవచ్చు. ఈ విధంగా డేటా ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించి కూడా డబ్బులు సంపాదించవచ్చు.
- చాట్‌జీపీటీ సాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోస్, ఇన్‌స్టా రీల్స్, ప్రమోషన్స్ లాంటి రూపొందించవచ్చు. వీటి సాయంతో సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి సొమ్మును ఆర్జించవచ్చు.
- 'చాట్‌జీపీటీ వల్ల నా జీవితం తలకిందులైంది.. 90శాతం ఆదాయం కోల్పోయా.. నా కుటుంబ పరిస్థితి..'
- 'AIతో ఉద్యోగాలు ఉఫ్.. అది నిజమే'.. బాంబు పేల్చిన చాట్‌జీపీటీ సీఈవో
- Meta Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్‌కు పోటీగా ఫేస్బుక్ AI.. ఫ్రీ యాక్సెస్!
- ఒక్క ప్రశ్నతో నిమిషంలో రూ.17వేలు ఇచ్చిన చాట్‌జీపీటీ.. మీరూ ట్రై చేస్తారా?