ETV Bharat / science-and-technology

చాట్​జీపీటీ బంపర్ ఆఫర్.. రూ.16 లక్షలు గెలిచే ఛాన్స్.. ఇలా చేస్తేనే.. - openai bug bounty

చాట్​జీపీటీతో లక్షలు సంపాదించే ఛాన్స్! మీలో ఆ ఒక్క ట్యాలెంట్ ఉంటే చాలు.. లక్షల జాక్​పాట్ కొట్టేయొచ్చు. అసలేంటా ట్యాలెంట్? ఏం చేస్తే డబ్బులు వస్తాయి? చూద్దాం పదండి..

chatgpt-bug-bounty
chatgpt-bug-bounty
author img

By

Published : Apr 13, 2023, 8:27 PM IST

ఇంటర్నెట్​లో సంచలనంగా మారిన చాట్​జీపీటీతో లక్షలు సంపాదిస్తారా? అయితే ఈ అవకాశం మీకోసమే. చాట్​జీపీటీలో బగ్స్ గుర్తించి చెప్పినవారికి భారీగా నజరానా ఇవ్వనున్నట్లు దాని యాజమాన్య సంస్థ ఓపెన్ఏఐ ప్రకటించింది. చాట్​జీపీటీతో పాటు ఓపెన్ఏఐ ప్లగ్ఇన్స్, ఓపెన్ఏఐ ఏపీఐ, సంబంధిత సర్వీసులలో లోపాలను గుర్తిస్తే 200 డాలర్ల నుంచి 20వేల డాలర్ల వరకు చెల్లిస్తామని తెలిపింది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.16,330 నుంచి రూ.16.33 లక్షలతో సమానం.

'భద్రతాపరమైన లోపాలు, బగ్స్ ఏవైనా గుర్తిస్తే వాటిని మా దృష్టికి తీసుకురండి. మీ కృషి తోడైతే మా టెక్నాలజీ మరింత సురక్షితంగా మారుతుంది' అంటూ ఓపెన్ఏఐ చెప్పుకొచ్చింది. బగ్​క్రౌడ్ అనే సంస్థ చాట్​జీపీటీ బౌంటీ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుంది. చాట్​జీపీటీలో ఉన్న లోపాల వివరాలను బగ్​క్రౌడ్ వెబ్​సైట్​లో ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. బగ్ తీవ్రతను బట్టి రివార్డు ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్​లైన్స్ కూడా జారీ చేసింది ఓపెన్ఏఐ. చాట్​జీపీటీ ద్వారా తప్పుడు సమాధానాలు వచ్చేలా చేయడం బగ్స్ గుర్తింపు కిందకు రాదని స్పష్టం చేసింది.

ఇటీవల కొందరు చాట్​జీపీటీ యూజర్ల డేటా ఇతర యూజర్లకు కనిపించింది. చాట్​జీపీటీ ప్లస్ యూజర్ల సెర్చ్ హిస్టరీ, పేమెంట్ సమాచారం వంటివి వేరేవారి ఖాతాల్లో దర్శనమిచ్చాయి. వ్యక్తిగత సమాచారంతో పాటు క్రెడిట్ కార్డుల చివరి నాలుగు అంకెలు ఇతరులకు కనిపించాయని ఓపెన్ఏఐ సంస్థ వెల్లడించింది. వెంటనే ఈ సమస్యను సరిచేసినట్లు తెలిపింది. స్వల్పకాలం పాటు చాట్​జీపీటీ సేవలను నిలిపివేసి సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చాట్​జీపీటీతో తమ ప్రైవసీకి ముప్పు ఉంటుందేమో అనే అనుమానాలు కొందరు యూజర్లలో తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బగ్ బౌంటీ కార్యక్రమం ప్రకటించింది ఓపెన్ఏఐ. మైనర్ల డేటాను ఎలా సంరక్షిస్తారనే విషయంపైనా చాట్​జీపీటీపై ఒత్తిడి నెలకొంది. ఇందులోని లోపాలను ఎత్తిచూపుతూ చాట్​జీపీటీని ఇటలీ తమ దేశంలో నిషేధించింది.

30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం
చాట్​జీపీటీతో సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సాంకేతికత వల్ల కోట్లాది ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి. కృత్రిమ మేధ సాంకేతికతల్లో వస్తున్న కొత్త ఒరవడులు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని గోల్డ్​మన్ శాక్స్ ఇటీవల అంచనా వేసింది. చాట్​జీపీటీ వంటి సంస్థలు తమ సామర్థ్యం మేరకు పనిచేస్తే శ్రామికరంగంలో ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. పరిపాలన రంగంలో 46శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వెల్లడించింది. అయితే, కృత్రిమ మేధ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని.. తద్వారా ప్రపంచ జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.