Chandrayaan 3 Pragyan Rover Travel Distance : చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం ప్రయాణించిందని ఇస్రో శుక్రవారం వెల్లడించింది. దాని పేలోడ్లు ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్- APXS, లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్- LIBS ఆన్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్లు సవ్యంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది.
Rover Payloads Of Chandrayaan 3 : చంద్రుడి ఉపరితలంపై కెమికల్ కంపోజిషన్, మినరలాజికల్ కంపోజిషన్‌ను అంచనా వేయడానికి APXS పేలోడ్‌లో ఉపయోగపడుతుంది. ఇక, చంద్రుడి నేల, ల్యాండింగ్ ప్రాతంలో రాళ్లలో ఉండే వివిధ మూలకాలను LIBS పేలోడ్ గుర్తిస్తుంది.
Chandrayaan 3 Pragyan Rover Landing Video : అంతకుముందు విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో శుక్రవారం (ఆగస్టు 25న) విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజ్ కెమెరా.. రోవర్ జాబిల్లిపై దిగుతున్న దృశ్యాలను బంధించింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. అనతంరం తన వెనుక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్ర వేసింది.
-
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
Chandrayaan 3 Payload Details : చంద్రయాన్-3లోని అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ల్యాండర్ మాడ్యూల్‌లోని పేలోడ్లు ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ- ILSA, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్ అట్మాస్పియర్- RAMBHA, చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్- ChaSTE, ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని.. స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్- SHAPE పేలోడ్‌ను ఆన్ చేశామని ఇస్రో శుక్రవారం తెలిపింది. ILSA పేలోడ్.. ల్యాండింగ్ ప్రాంతంలో భూకంప పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. చంద్రుడి చుట్టూ ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని RAMBHA పేలోడ్ అధ్యయనం చేస్తుంది. ఇక, ChaSTE పేలోడ్.. చంద్రుడి ఉపరితల ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.
ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్.. జాబిల్లిపై అసలు పని షురూ! కొత్త ఫొటోలు చూశారా?