ETV Bharat / science-and-technology

సర్వత్ర ఉత్కంఠ..! అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోసారి పిలుపు.. హాజరు కాలేనన్న ఎంపీ

CBI issues notices to Avinash Reddy:కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ మరోసారి ప్రశ్నించనుంది. కడపలో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసిన నేటి విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాసిన నేపథ్యంలో రేపటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

అవినాష్ రెడ్డి
CBI issues notices to Avinash Reddy
author img

By

Published : Mar 5, 2023, 10:45 PM IST

YS Viveka murder: మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో రేపు కీలక విచారణ జరగనుంది. వివేకా హత్య జరిగినప్పటి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ మరోసారి ప్రశ్నించనుంది. కడపలో సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసిన నేటి విచారణకు హాజరు కాలేనని సీబీఐ కి లేఖ రాశారు. సోమవారం పులివెందులలో జరిగే కార్యక్రమాల్లో అవినాష్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ మరోమారు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సోమవారం ఉదయం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే తాను హాజరు కాలేనని అవినాష్ రెడ్డి చెప్పినప్పటికీ... తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సీబీఐ అధికారులు శనివారం రాత్రి స్పష్టం చేశారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి ఆదివారం సాయంత్రం సీబీఐకి లేఖ రాశారు. ఆయన సోమవారం ఉదయం వేంపల్లి లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఉదయం 8 గంటలకు పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వై.ఎస్. భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు సోమవారం కడపలో విచారించనున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

వివేకా హత్య జరిగిన విషయం బాహ్య ప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే... అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి అంతకు ముందే తెలుసని సీబీఐ భావిస్తోంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచి వేయించడం, మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి తరలించడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది సీబీఐ వాదన. హత్య జరిగిన ముందు రోజు మార్చి 14వ తేదీ సాయంత్రం ఏ-2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి పావుగంట పాటు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ ఆధారాలు సేకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భారీ కుట్ర చేసి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు వైయస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీబీఐ విచారణకు హాజరుకాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసినప్పటికీ సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే భాస్కర్ రెడ్డి మాత్రం సీబీఐ కి ఎలాంటి లేక రాయలేదని తెలుస్తుంది ఆయన కూడా సోమవారం కడుపులో సీబీఐ విచారణ హాజరవుతారా లేక సమయం కోరుతారా అనేది ఆసక్తిగా మారనుంది.

ఇవీ చదంవడి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.