ETV Bharat / science-and-technology

చిట్టి వాషింగ్​ మెషీన్​ కొనేయ్- ఇయర్​బడ్స్​ ఉతికేయ్​!

ఇయర్​బడ్స్​ను శుభ్రం చేసేందుకు చిట్టి వాషింగ్​ మెషీన్​నే తయారు చేసింది ఓ సంస్థ. దీనికి ప్రస్తుతం గిరాకీ పెరుగుతోంది. ఈ మెషీన్​ ద్వారా రెండు నిమిషాల్లో మన ఇయర్​బడ్స్​ శుభ్రం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు మీరూ చూసేయండి..

wireless earbuds washer, cardlax earphone cleaner
ఇయర్​ బడ్స్​ క్లీనర్
author img

By

Published : Apr 12, 2021, 5:03 PM IST

Updated : Apr 12, 2021, 5:12 PM IST

ఇప్పుడు ఎక్కడ చూసినా వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ ట్రెండ్​ నడుస్తోంది. సులభంగా వినియోగించే వెసులుబాటు ఉండటం వల్ల వాటికి క్రేజ్​ పెరిగిపోయింది. అదే సమయంలో వాటిని శుభ్రంగా ఉంచుకోవడం కష్టంగా మారింది. అందుకే.. 'ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు మా వాషింగ్​ మెషీన్​ను కొనుక్కోండి' అని వినియోగదారులను ఆహ్వానిస్తోంది ఓ సంస్థ. చిన్న సైజులో ఉండే ఇయర్​బడ్స్​ను శుభ్రం చేసేందుకు వాషింగ్​ మెషీన్​తో పనేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇక్కడే ఉంది అసలు విషయం. అది మనం బట్టలు ఉతికేందుకు ఉపయోగించే వాషింగ్​ మెషీన్​ కాదు.. కేవలం ఇయర్​బడ్స్​ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చిట్టి ఇయర్​బడ్స్​ వాషర్.

ఎలా పనిచేస్తుంది..?

కార్డ్​లాక్స్​ సంస్థ రూపొందించిన ఈ ఇయర్​బడ్స్​ వాషర్​లో సిలిండర్​ స్పాంజ్​ సహా ఓ చిన్న బ్రష్​ ఉంటుంది. వాషింగ్​ మెషీన్​ లాగనే ఇందులో మన ఇయర్​బడ్స్​ను పడేస్తే.. ఆ బ్రష్​ వాటిని శుభ్రం చేస్తుంది. ఈ ప్రక్రియ కేవలం రెండు నిమిషాల్లో పూర్తవడం విశేషం. యాపిల్​ సంస్థకు చెందిన ఇయర్​బడ్స్​ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వాషర్​.. వేరే ఇయర్​బడ్స్​ను శుభ్రం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని కార్డ్​లాక్స్​ స్పష్టం చేసింది. ఈ పరికరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని తెలిపింది.

మెషీన్​ను సమర్థంగా వినియోగించేందుకు ఓ వీడియోను కూడా యూట్యూబ్​లో షేర్​ చేసింది ఆ సంస్థ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆర్డర్లు ప్రారంభం

ఈ ఇయర్​బడ్స్​ వాషర్​ను కొనుగోలు చేసేందుకు కిక్​స్టార్టెడ్​ అనే వెబ్​సైట్​లో ఆర్డర్​ చేసుకోవాలి. అమెరికాలో ఇది జూన్​లో అందుబాటులోకి వస్తుంది.

ఇవీ చదవండి : ఇక 'హలో​ మోటో'.. 108 మెగాపిక్సెల్స్​​ కెమెరాతో!

సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఫీచర్లు ఇవే!

Last Updated : Apr 12, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.