ETV Bharat / science-and-technology

electric vehicles: రూపాయికే రయ్‌రయ్‌మని పోవచ్చు... మరి ఆలస్యమెందుకు! - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలు కిలోమీటరు తిరిగేందుకు సగటున రూ.5 ఖర్చవుతాయి. అదే విద్యుత్‌ వాహనాలు(ఈవీ) కిలోమీటర్‌ దూరం తిరిగేందుకు అయ్యే వ్యయం రూపాయి మాత్రమే అంటున్నారు ఈవీ తయారీదారులు. ఆటోలైతే అర్థ రూపాయే అంటున్నారు. మరి ఆలస్యమెందుకు విద్యుత్‌ వాహనాల గురించి తెలుసుకుందామా...

electric vehicles
electric vehicles
author img

By

Published : Oct 30, 2021, 11:52 AM IST

విద్యుత్‌ వాహనాల వాడకం వల్ల కాలుష్య సమస్య అస్సలు ఉండదంటున్నారు ఈవీ తయారీదారులు. అంతే కాదు సాధారణ వాహనాల్లో మాదిరి ఆయిల్‌ గట్రా మార్చే పని ఉండదు కాబట్టి వీటి నిర్వహణ తేలిక అని.. చాలావరకు ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. వాహన తయారీదారులు తమ కొత్త విద్యుత్తు వాహనాలను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రదర్శనకు పెట్టారు. వాటిలో కొన్ని మోడల్స్‌ను చూస్తే...

విద్యాసంస్థల ప్రాంగణంలో తిరిగేందుకు అనువైన చిన్న వాహనం

మినీ..

కంపెనీలు, విద్యాసంస్థల ప్రాంగణంలో తిరిగేందుకు అనువైన చిన్న వాహనం. 25 కి.మీ. వేగంతో వేగంతో వెళుతుంది. ఒక సారి ఛార్జింగ్‌కు గంట పదినిమిషాలు పడుతుంది. ధర రూ.27 నుంచి 32 వేల మధ్యన ఉంది.

కార్లలో మూడు మోడల్స్‌ మాత్రమే..

ప్రదర్శనలో టాటా, ఎంజీ సంస్థలకు చెందిన ఈవీ మోడళ్లను ప్రదర్శించారు. ప్రస్తుతం ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈవీలో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న టాటా నెక్సాన్‌, కొత్తగా వచ్చిన టిగోతో పాటూ ఎంజీ ఈవీ కారును ప్రదర్శించారు. రూ13 లక్షల నుంచి రూ.26 లక్షల ధరల శ్రేణిలో కార్ల ధరలు ఉన్నాయి. బ్యాటరీ ఖర్చు అధికమని.. వాహన ధరలో 30 శాతం దీనికోసం అవుతోందని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఈవీలో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న కారు టాటా నెక్సాన్‌

  • టాటా టిగో పూర్తి ఛార్జింగ్‌కు 8 గంటలు పడుతుంది. 30 యూనిట్లు ఖర్చు అవుతుంది. 220 నుంచి 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు
  • ఎంజీ ఈవీ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 350 కి.మీ. వస్తుంది. నెమ్మదిగా ఛార్జింగ్‌కు 6 గంటలు పడుతుంది. 45 యూనిట్ల వరకు ఖర్చువుతాయి. మొట్టమొదటి ఇంటర్‌నెట్‌ కారు ఇది. ప్రత్యేకంగా సిమ్‌ ఉంటుంది. అసిస్టెంట్‌ ఉండటం ప్రత్యేకత.
ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ ఆటో..
ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ ఆటో..

ఈటో.. ఆటో..

తెలంగాణకు ఈటో మోటార్స్‌ ఒకటి ప్యాసింజర్‌, మరోటి కార్గో ఆటోను తీసుకొచ్చింది. ప్యాసింజర్‌ ఆటో ఒకసారి ఛార్జ్‌ చేస్తే 120 కి.మీ. ప్రయాణిస్తుంది. 4 గంటల ఛార్జింగ్‌కు 10 యూనిట్ల కరెంట్‌ ఖర్చవుతుంది. మూడున్నర నుంచి రూ.4లక్షల వరకు ధర ఉంది. ఎలక్ట్రిక్‌ ఆటోలు నడిపేందుకు ఇంకా అనుమతులు లేకపోవడంతో మన రోడ్ల మీద ఇంకా ఇవి తిరగడం లేదు. కాచిగూడలో ఒక వాహనాన్ని తిప్పుతున్నారు. జడ్చర్లలో వీటిని తయారు చేస్తున్నారు. కిలోమీటర్‌కు రూపాయి కంటే తక్కువ ఖర్చు అవుతుందని.. ఏడాదిలో లక్ష రూపాయలు ఆదా చేయవచ్చని, కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఈటో మోటార్స్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ అన్నారు.

అలసట లేదంటున్న ఎలక్ట్రిల్‌ ఆటో డ్రైవర్‌...

అలసట లేదు..

2014 నుంచి నేను ఆటో నడుపుతున్నాను. అద్దెకు తీసుకుని నడిపేదాన్ని. గత ఏడాది కొవిడ్‌ కారణంగా ఉపాధి పోయింది. ఆ సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈటో గురించి తెలిసింది. వీరు ఎలక్ట్రిల్‌ వాహనాలతో ఈ కామర్స్‌ సంస్థకు డెలివరీ ఇస్తున్నారు. ఆహారం, సరకుల డెలివరీపై ఆంక్షల్లేకపోవడంతో ఏడాదిన్నరగా ఇందులో చేస్తున్నాను. కొంతకాలం వీరితో పనిచేశాక సొంతంగా బతికేందుకు ఎలక్ట్రిక్‌ ఆటోను ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌లో ఆటో నడుపుతున్నాను. ఇది చాలా సౌకర్యంగా ఉంది. - ఆటో మీనా, దమ్మాయిగూడ

అటమ్‌ 1.0 బైక్‌..
అటమ్‌ 1.0 బైక్‌..

అటమ్‌ 1.0 బైక్‌..

రాష్ట్రానికి చెందిన సంస్థ ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే వందకిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్ఛు పూర్తి ఛార్జింగ్‌కు 4 గంటలు పడుతుంది. బ్యాటరీని తీసి ఇంట్లోనూ ఛార్జింగ్‌ చేసుకోవచ్ఛు ఇందులో లిథియం అయాన్‌ బ్యాటరీ వాడారు. ఎనిమిదేళ్లు వారంటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్‌లో రూ.50వేలకు ఈ బైక్‌ను విక్రయిస్తున్నట్లు అటం మొబైల్‌ అంకుర సంస్థ సీనియర్‌ మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు. త్వరలో మరింత వేగంగా వెళ్లే బైక్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

మడతపెట్టి తీసుకెళ్లే  విద్యుత్‌ వాహనాలు
మడతపెట్టి తీసుకెళ్లే విద్యుత్‌ వాహనాలు

మడతపెట్టి తీసుకెళ్లేలా..

ఈ-కామర్స్‌లో డెలివరీ కోసం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఇందులో మూడు రకాలు.. రూ.47వేల నుంచి 65 వేల మధ్య ఉన్నాయి. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 50కి.మీ. వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌కు మూడు గంటలు. ఒక యూనిట్‌ ఖర్చు అవుతుంది. మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

మన పరిస్థితులకు తగ్గట్టుగా..

ఇండియా గోస్‌ ఎలక్ట్రిక్‌(ఇన్‌గో) పేరుతో ప్రస్తుతం మూడు మోడల్స్‌ వాహనాలను తయారు చేస్తున్నాం. కావాలంటే వీటిని మడతపెట్టి తీసుకెళ్లవచ్ఛు 15 కిలోలు మాత్రమే బరువు ఉంటాయి. భారతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేశాం. బైక్‌ను తమ అభిరుచులకు తగ్గట్టుగా బాడీ కలర్స్‌, గ్రాఫిక్‌ స్టిక్టర్స్‌, అలాయ్‌ చక్రాలు, సైడ్‌ ప్యానల్‌ స్టిక్టర్స్‌ను రూపొందించుకోవచ్ఛు ఇప్పటివరకు 105 వాహనాలను విక్రయించాం. వ్యాపార భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నాం. - నిఖిల్‌, సీఈవో, ఇన్‌గో, బెంగళూరు

ఇదీ చదవండి: Minister Jagadish Reddy: 'రాబోయే కాలం ఎలక్ట్రిక్‌ యుగం.. అందుకే విద్యుత్ వాహనం తీసుకున్న'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.