Buying used iPhone : మొబైల్ మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. కొత్త ఫోన్ కొనలేని వారు వీటిపై అభిమానంతో సెకెండ్ హ్యాండ్లో కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భారీ స్థాయిలో డబ్బు ఆదా అవటంతో పాటు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లపై గ్యారెంటీ ఉంటుంది. సెకెండ్ హ్యాండ్ ఐఫోన్లు తీసుకోవడం వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనడం వల్ల కలిగే లాభాలు
1. డబ్బు ఆదా అవుతుంది : సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ తీసుకోవడం వల్ల మొదటగా భారీ స్థాయిలో డబ్బు ఆదా అవుతుంది. కొత్త మొబైల్‌తో పోలిస్తే.. వేలల్లో నగదు మిగులుతుంది. ఫోన్ కండిషన్, మోడల్, ఇతర వివరాలను అనుసరించి ధర ఉంటుంది. దీనితో పాటు ఆ ఫోన్ ఎక్కడ తీసుకున్నారు అనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ కన్నా.. యాపిల్ స్టోర్స్‌లో రీఫర్బిష్డ్ ఫోన్ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.
2. పర్యావరణ హితం : ఆల్రెడీ వాడిన ఫోన్ ఉపయోగించడం వల్ల మీరు.. ఎలక్ట్రానిక్ వేస్ట్ తయారు చేయకుండా కాపాడిన వారవుతారు. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా ఐఫోన్లను రీసైకిల్ చేయరు. వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) ఫోరం ప్రకారం.. గతేడాది 5.3 బిలియన్ (530 కోట్ల) మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వేస్ట్‌గా మారాయి.
3. పాత మోడళ్లు వాడొచ్చు : మంచి పాత మోడళ్లను వాడే అవకాశం సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొనటం వల్ల సాధ్యమవుతుంది. ఉదాహరణకు గతంలో బాగా ఆదరణ పొందిన ఐఫోన్ 10, 11 మోడళ్లు 2023 జూన్‌లో దొకరడం చాలా కష్టం.
4. ధరలు తగ్గుతాయి : సెకెండ్ హ్యాండ్లో తీసుకోవడం వల్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు 2020లో ఐఫోన్ 12 విడుదలైనప్పుడు దాని ధర 599 డాలర్లు. అదే ఫోన్‌ను అమెజాన్‌లో ఇప్పుడు తీసుకోవాలనుకుంటే సుమారు 330 డాలర్లు లేదా అంతకంటే తక్కువే ఉంటుంది.
సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనడం వల్ల కలిగే నష్టాలు
1. లో రీసేల్ ప్రైస్ : కొత్త ఫోన్‌కు ఉన్న రీసేల్ విలువ సెకెండ్ హ్యాండ్ ఫోన్లకు ఉండదు. మార్కెట్లో నూతన ఫోన్‌ను అమ్మినప్పుడు వచ్చే ధర వీటికి రాదు.
2. లో వారంటీ / వారంటీ లేకపోవడం : నూతన ఫోన్ కొన్నప్పుడు ప్రతి కంపెనీ దానికి సుమారు ఏడాది వారంటీ ఇస్తుంది. ఈ కాలం పూర్తయిన తర్వాత ఏ రిపేర్ వచ్చినా.. డబ్బు చెల్లించాల్సిందే. సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడు వారంటీ పీరియడ్ తక్కువగా ఉంటుంది లేదా వారెంటీ లేకపోవచ్చు. యాపిల్ సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ఫోన్లు కొనుగోలు చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎందుకంటే వాటికి కూడా నూతన ఫోన్లలాగే ఏడాది వారంటీ ఉంటుంది.
3. లిమిటెడ్ ఆప్షన్లు ఉంటాయి : కొత్త ఐఫోన్ కొన్నప్పుడు మనకు నచ్చిన కలర్, ఫీచర్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సెకెండ్ హ్యాండ్ ఫోన్లలో ఈ ఆప్షన్ ఉండదు. ఐఫోన్ వాడాలనుకున్నప్పుడు.. దాని ఫీచర్లు, కలర్ నచ్చకపోయినా అందుబాటులో ఉన్న ఫోనే తీసుకోవాలి.
4. యాక్సెసరీలు ఉండకపోవచ్చు : సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొన్నప్పుడు ఛార్జర్, ఇయర్ ఫోన్స్ లాంటి యాక్సెసరీలు ఉండకపోవచ్చు. కొన్ని సార్లు మీరు సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి వాటిని కొనుగోలు చేయడం మంచిది కాదనే విషయం గుర్తుంచుకోండి.
5. సాఫ్ట్వేర్ అప్డేట్లు ఉండవు : సాధారణంగా యాపిల్ ఫోన్లకు యావరేజ్‌గా ఆరేళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి. మీరు తీసుకునే ఫోన్ లాంఛ్ అయ్యి 2, 3 ఏళ్లు అయితే.. సాఫ్ట్వేర్ సపోర్ట్ తగ్గిపోతుంది. ఐవోఎస్ అప్డేట్లు రాకుంటే వివిధ బగ్‌ల నుంచి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.