ETV Bharat / science-and-technology

బంగారం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? - బంగారం దేన్ని నుంచి పుడుతుంది

Origin of Gold: ఒక నక్షత్రం.. ఓ అణు సంయోగం.. ఓ భారీ విస్ఫోటం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? బంగారం పుట్టుకకు మూలం! అవును బంగారం పుట్టుకొచ్చింది నక్షత్ర విస్ఫోటం నుంచే. ఒకరకంగా చెప్పాలంటే బంగారం గ్రహాంతర సంపద!

Birth secret of Gold
Birth secret of Gold
author img

By

Published : Mar 9, 2022, 10:01 AM IST

Origin of Gold: అరుదైనది, ఆకర్షణీయమైనది, అంతకన్నా విలువైనది. తుప్పు పట్టదు. ఎన్నేళ్లయినా చెక్కు చెదరదు. దృఢమైందే కాదు, కావాల్సినట్టుగా సాగుతుంది కూడా. అందుకేనేమో బంగారం అనాదిగా మనిషి ఊహలో అమూల్యమైనదిగానే చలామణి అవుతూ వస్తోంది. ద్రవ్య వినిమయంగా, ఆభరణాలుగా, నాణాలుగా, సంపద చిహ్నంగా.. ఇలా ఎన్నెన్నో రకరకాలుగా చరిత్రను పంచుకుంటోంది. ఇంతకీ బంగారానికి ఇంత అరుదైన ఘనత ఎలా లభించింది? రహస్యమంతా దాని పుట్టుకలోనే ఉంది.

నక్షత్ర పేలుడుతో..

బంగారం కోసం మన భూమి లోపల అన్వేషిస్తుంటాం. గనులను తవ్వి వెలికి తీస్తుంటాం. కానీ దీని పుట్టుక గురించి తెలుసుకోవాలంటే మాత్రం నక్షత్రాల్లోకి తొంగి చూడాల్సిందే. మనకు తెలిసిన మూలకాల్లో బంగారం ఒకటి. ఇది ఏర్పడటమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో సంక్లిష్టమైంది. దీనికి చాలా చాలా శక్తి అవసరం. కాబట్టే ఇది నక్షత్రాల్లో.. అదీ విస్ఫోటమయ్యే నక్షత్రాల్లోనే ఏర్పడుతుంది. నక్షత్రాలు చాలావరకు హైడ్రోజన్‌తో కూడుకొని ఉంటాయి. ఇది మామూలు, తేలికైన మూలకం. గురుత్వాకర్షణ ఒత్తిడి మూలంగా నక్షత్ర కేంద్రకంలో అణు సంయోగం (ఫ్యూజన్‌) ప్రేరేపితమవుతుంది. దీంతో హైడ్రోజన్‌ నుంచి శక్తి విడుదలవుతుంది. దీని మూలంగానే నక్షత్రం ప్రకాశిస్తుంది. అణుసంయోగం క్రమంగా హైడ్రోజన్‌ను హీలియం, కార్బన్‌, ఆక్సిజన్‌ వంటి మూలకాలుగా మారుస్తుంది. హైడ్రోజన్‌ మోతాదులు తగ్గినప్పుడు నక్షత్రం తర్వాతి దశలోకి చేరుకుంటుంది. హీలియం తనకన్నా పెద్ద మూలకంతో జతకట్టటం ఆరంభిస్తుంది. ఐరన్‌ ఏర్పడేంతవరకూ ఇలా ఒక్కొక్కటిగా మూలకాలన్నీ కలుస్తూ వస్తూనే ఉంటాయి. ఐరన్‌ ఏర్పడ్డాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఐరన్‌ శక్తిని ఉత్పత్తి చేయదు సరికదా తనే శక్తిని గ్రహించుకోవటం ఆరంభిస్తుంది. దీంతో తీవ్రమైన ఒత్తిడి, గురుత్వాకర్షణను ప్రతిఘటించటానికి అవసరమైన శక్తి నక్షత్ర కేంద్రం నుంచి ఉత్పత్తి కాదు. ఫలితంగా నక్షత్రం కుప్పకూలటం మొదలవుతుంది. ఒకవేళ పెద్ద నక్షత్రమైతే అది భారీగా విస్ఫోటం (సూపర్‌నోవా) చెందుతుంది. నక్షత్ర విస్ఫోటం చెందే క్రమంలో వెలువడే తీవ్రమైన శక్తి మూలంగా భారీ మూలకాలు పుట్టుకొస్తాయి. బంగారం ఏర్పడేది ఇలాగే. ఇది నక్షత్ర విస్ఫోట సమయంలో కేవలం కొన్ని సెకండ్లలోనే పుట్టుకొస్తుంది. నక్షత్రం విస్ఫోటం చెందాక బంగారం వంటి మూలకాలన్నీ ఎగిసిపడి.. నక్షత్ర మండల మాధ్యమంలో వాయువు, ధూళి రూపంలో తిరుగాడుతుంటాయి. ఇవి ఒకదగ్గరికి చేరుతూ, గట్టిపడి కొత్త నక్షత్రాలు, గ్రహాలు పుట్టుకొస్తాయి. మన సౌర మండలం ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇదే. అంటే భూమి ఏర్పడటానికి ముందే బంగారం పుట్టుకొచ్చిందన్నమాట.

భూమి చల్లబడ్డాక..

అంతరిక్షంలోని శూన్యంలోకి వెలువడిన బంగారం వంటి మూలకాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్న భూమిలో అంతర్భాగమయ్యాయి. భూమి చల్లబడుతున్నకొద్దీ కోర్‌, మాంటిల్‌, క్రస్ట్‌ పొరలు వేరవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జియోథెర్మల్‌ ప్రక్రియ ద్వారా ఎక్కడో లోపల చిక్కుకుపోయిన బంగారం నెమ్మదిగా ఉపరితలం వైపునకు రావటం ఆరంభించింది. ఇదెలా జరిగిందనే దానిపై చాలా సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. చాలావరకు ఆమోదం పొందిన సిద్ధాంతం ప్రకారం- వేడి, పీడనం ప్రభావంతో ద్రవ నీరు పైకి రావటం మొదలైంది. ఈ నీటితో పాటు అందులో కలిసి ఉన్న బంగారమూ ప్రయాణిస్తూ వచ్చింది. ఉపరితలం వైపునకు వస్తున్నకొద్దీ నీరు చల్లబడటం, దానిలోంచి అవక్షేపం చెందిన బంగారం బయటకు వచ్చింది. ఇది ప్రవాహ మార్గాలు, ముద్దల రూపంలో గడ్డ కట్టుకుపోయింది. కాలం గడుస్తున్నకొద్దీ కొంత బంగారం నీటి కాల్వల ద్వారా ఉపరితలానికి వచ్చింది. నదుల్లో కలిసింది. కొన్ని నదుల్లో బంగారం రజను రూపంలో ఉండటానికి కారణమిదే. మరి మనిషికెలా చిక్కింది? బహుషా మొదట్లో చేపలు పట్టేవారెవరికో ఈ బంగారం లభించి ఉంటుంది. తళతళ మెరిసే బంగారానికి ముగ్ధులై సేకరించటం ఆరంభించి ఉంటారు. ఇది కొన్నిచోట్ల మాత్రమే ఉందంటే అక్కడ పెద్ద ముద్ద ఉండొచ్చనే అనుమానంతో కొందరు తవ్వటం ఆరంభించి ఉంటారు. క్రమంగా బంగారాన్ని తవ్వి తీయాలనే ఆలోచన బలపడుతూ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న బంగారమంతా ఇలా భూమిలోంచి తవ్వి తీసిందే.

చరిత్రనే మార్చేసింది

బంగారం దేశాల చరిత్రనే మార్చేసిన దాఖలాలు లేకపోలేదు. ఇందుకు ఆస్ట్రేలియా పెద్ద ఉదాహరణ. 19వ శతాబ్దం చివర్లో అక్కడికి ‘బంగారు పరుగు’ ఆరంభమైంది. దీంతోనే ఆస్ట్రేలియా జనాభా మూడింతలు పెరిగింది. అప్పట్నుంచీ అక్కడ బంగారాన్ని తవ్వి తీస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో 'ఎవల్యూషన్‌ మైనింగ్‌' అనే కంపెనీ మరో గొప్ప నిధినీ వెలికితీసింది. బంగారం కోసం తవ్వుతుండగా ఒకచోట పగుళ్లతో కూడిన రాతి పొరలు బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటివి అగ్ని పర్వత బిలం వద్ద కనిపిస్తుంటాయి. అధునాతన మ్యాపింగ్‌ పద్ధతులతో వీటిని విశ్లేషించగా మూడు మైళ్ల వెడల్పయిన గ్రహశకలం బిలం బయటపడింది.

తయారుచేస్తే పోలా?

సీసాన్ని బంగారంగా మార్చాలనే ప్రయత్నం ఈనాటిది కాదు. మూలకంలోని ప్రోటాన్ల సంఖ్యను రసాయన చర్య ద్వారా మార్చలేం. అందువల్ల సీసాన్ని బంగారంగా మార్చటం సిద్ధాంత పరంగానైతే సాధ్యం కాదు. కానీ గ్లెన్‌ సీబోర్గ్‌ అనే శాస్త్రవేత్త 1980లో కొద్దిమొత్తంలో సీసాన్ని బంగారంగా మార్చటంలో సఫలమయ్యారు. నక్షత్రంలో సంభవించే సంక్లిష్ట అణు ప్రతిచర్యలను అనుకరించే పార్టికల్‌ యాక్సిలరేటర్లతోనైతే బంగారాన్ని తయారు చేయటం సాధ్యమే. అయితే ఈ యంత్రాలు బంగారాన్ని అణువు అణువునూ పేర్చుకుంటూ వస్తాయి. ఇలా ఒక గ్రాము బంగారం తయారవటానికి కోట్లాది ఏళ్లు పడుతుంది. దీనికన్నా భూమిలోంచి తవ్వుకోవటమే నయం. భూమి లోపలే కాదు, మహా సముద్రాల్లోనూ 2కోట్ల టన్నుల బంగారం కరిగిన రూపంలో ఉంటుందని అంచనా. కాకపోతే అతి సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీన్ని వెలికితీయటం ఖర్చుతో కూడుకున్న పని. ఇతర గ్రహాల్లోంచి తీసుకొస్తే మేలనే ఆలోచనలూ లేకపోలేదు. ఏదో ఒకనాడు అది సాధ్యమైనా ఆశ్చర్యం లేదు.

ఆభరణాల దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్స్‌ వరకూ

ఆకర్షణీయమైనది, అరుదైనది కావటం వల్ల బంగారం మీద మనకు మొదట్నుంచీ మోజే. పైగా దీనికి సాగే గుణం ఉండటం ఆభరణాల తయారీకి వీలు కల్పించింది. రకరకాల ఆకారాల్లో దీన్ని మలచుకొని అలంకరించుకోవటం ప్రాచీనకాలం నుంచీ వస్తున్నదే. ఇప్పటికీ బంగారు ఆభరణాలంటే అందరికీ ఆసక్తే. కేవలం ఆభరణాల కోసమే కాదు. బంగారం చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.

Birth secret of Gold
బంగారు ఆభరణాలు
  • బంగారానికి తుప్పు పట్టదు. మంచి విద్యుత్‌ వాహకం కూడా. అందుకే అధునాతన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోనూ ఇది విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. భూమి మీద వాడే పరికరాల్లోనే కాదు, అంతరిక్ష పరికరాల్లోనూ కనెక్టర్లకు బంగారుపూత పూస్తుంటారు.
    Birth secret of Gold
    విద్యుత్ వాహకంగా బంగారం
  • బంగారం గట్టిగా ఉంటుంది. కావాలంటే వంచుకోవచ్చు. విషపూరితం కాదు. అన్నింటికీ మించి తుప్పు పట్టదు. ఇలాంటి గుణాలే దంత చికిత్సకు అనువుగా మార్చాయి. పుచ్చిపోయిన పళ్ల రంధ్రాలను బంగారంతో నింపుతుండటం తెలిసిందే.
    Birth secret of Gold
    బంగారం పూత
  • ఎంతకాలం నిల్వ ఉంచినా బంగారం చెడిపోదు. కాబట్టే ప్రాచీన కాలం నుంచి ద్రవ్య వినిమయానికి వాడుకుంటున్నాం. చాలాకాలం బంగారు నాణాలను కరెన్సీగానూ ఉపయోగించుకున్నాం. సంపదకు, విలాసానికి చిహ్నంగా బంగారాన్ని పరిగణిస్తున్నాం.
    Birth secret of Gold
    బంగారు నాణెం

ఇదీ చూడండి: క్రేజీ ఫీచర్ల​తో శాంసంగ్​ గ్యాలక్సీ ఎఫ్​23 5జీ.. అదిరిపోయే ఆఫర్ కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.