ETV Bharat / science-and-technology

సులభంగా ఇమేజ్​ రిసైజ్ చేసుకోవచ్చిలా.. - ఫోటో ఎడిటింగ్ టూల్స్

ఫొటోలు, ఇమేజ్​లను వివిధ అవసరాలకు తగ్గట్లు ఒరిజినల్ కాపీని రిసైజ్​ చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. అయితే చాలా మంది ఫొటోను రిసైజ్​ చేసుకోవాలంటే ఫొటోషాప్, ఇతర యాప్​లతోనే సాధ్యమనుకుంటారు. నిజానికి ఆన్​లైన్​లో పలు వెబ్​సైట్లు ఉచితంగా ఫొటో రిసైజ్, ఎడిటింగ్​ సేవలందిస్తున్నాయి. ఆ వెబ్​సైట్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు మీ కోసం.

best photo Resize websites
ఉత్తమ ఫోటో ఎడిటింగ్ వెబ్​సైట్లు
author img

By

Published : Dec 7, 2020, 11:10 AM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ఫొటోలు రిసైజ్‌ చేసుకోవడం కోసం చాలా మంది ఫొటోషాప్‌.. తదితర యాప్స్‌, సాఫ్ట్‌వేర్స్‌ కోసం వెతుకుతుంటారు. కానీ అలాంటివేమీ లేకపోయినా కూడా మీరు ఇమేజ్‌ రిసైజ్‌ చేసుకోవచ్చు. ఫొటోషాప్‌ వంటి యాప్స్‌ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఉచితంగా ఇమేజ్‌ రిసైజింగ్‌ సేవలను అందిస్తున్నాయి కొన్ని వెబ్​సైట్లు. రిసైజింగ్‌ మాత్రమే కాదు.. ఇమేజ్‌ ఎడిటింగ్, కంప్రెసింగ్‌, ఫిల్టరింగ్‌ సౌకర్యాల్ని కూడా కల్పిస్తున్నాయి. ఫొటోషాప్‌లో లభించే చాలా ఫీచర్లు వీటిల్లో అందిస్తున్నారు. ఉచితంగా అలాంటి సదుపాయాల్ని అందించే కొన్ని ఆన్‌లైన్‌ ఫొటోస్‌ రిసైజింగ్‌ టూల్స్‌ గురించి తెలుసుకుందాం.

లూనాపిక్‌ రిసైజర్‌

ఇమేజ్‌ రిసైజర్‌ టూల్స్‌ ప్లాట్‌ఫాంలలో ఎక్కువ మంది ఉపయోగించే వాటిలో 'లూనాపిక్‌ రిసైజర్‌' ఒకటి. ఇందులో వందలాది ఎడిటింగ్‌ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. గ్రాబ్‌ అండ్‌ డ్రాగ్‌ సహా పలు కస్టమైజ్డ్‌ ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు. ఫొటోషాప్‌లో ఉండే ఆప్షన్‌ చాలా వరకు ఇందులో మనకు అందుబాటులో ఉంటాయి.

luna pic resizer
లూనాపిక్‌ రిసైజర్‌

వెబ్‌ రిసైజర్‌

క్రాప్‌, షార్పెన్‌, కంప్రెస్‌, రిసైజ్‌ వంటి ఫీచర్లు ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. దాంతో పాటు ఈ వెబ్‌సైట్‌లో రకరకాల ఎడిటింగ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఇది బల్క్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది.

పిక్‌ రిసైజ్‌

'పిక్‌ రిసైజ్‌' అనేది ఆన్‌లైన్‌ ఫొటో రిసైజింగ్‌ టూల్‌. ఈ టూల్‌ ద్వారా ఫొటోలను ప్రీసెట్‌ పర్సెంటేజీ ఆధారంగా సైజుల్లో మార్పులు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫొటోలకు ఇతర ప్రత్యేక ఎఫెక్ట్స్‌ను సైతం యాడ్‌ చేసుకునేలా అదనపు ఫీచర్లను ఈ టూల్‌ అందిస్తోంది. ఇమేజ్‌ క్రాపింగ్‌, రొటేటింగ్‌ వంటి ఆప్షన్లను పొందవచ్చు.

pic resize
పిక్‌ రిసైజ్‌

సోషల్‌ ఇమేజ్‌ రిసైజర్‌ టూల్‌

ఇది ఎక్కువగా ఫేస్‌బుక్‌, గూగుల్‌, యూట్యూబ్‌, లింక్‌డ్‌ఇన్‌, పింట్‌రెస్ట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమ సైట్లలో ఉపయోగిస్తారు. ఇందులో కావాలనుకుంటే కస్టమ్‌ సైజ్‌ను కూడా మీరు ఇవ్వవచ్చు.

Social image resizer tool
సోషల్‌ ఇమేజ్‌ రిసైజర్‌ టూల్‌

పిక్‌ ఘోస్ట్‌

ఇందులో మీరు ఒకేసారి 40 ఫొటోలను ఎడిటింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇమేజెస్‌ ప్రిసెట్ రేంజ్‌‌, కస్టమ్‌ స్థాయుల్ని మార్పులు చేసుకోవచ్చు.

క్విక్‌ థంబ్‌నెయిల్‌

'క్విక్‌ థంబ్‌నెయిల్‌' టూల్‌ ద్వారా క్విక్‌ ఇమేజ్‌ రిసైజింగ్‌తో పాటు, ఫిల్టరింగ్‌ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. అదే వాటర్‌ మార్కు. ఎడిట్‌ చేసుకున్న ఫొటోకు వాటర్‌ మార్కును జత చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో ప్రిసెట్‌ రిసైజ్‌ నిష్పత్తి ఆప్షన్‌ ఆకట్టుకుంటుంది. వెబ్‌ యాప్స్‌, మానిటర్ల కోసం ఈ టూల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.

Quick thumbnail
క్విక్‌ థంబ్‌నెయిల్‌

టూల్‌ యువర్‌

ఈ టూల్‌ ద్వారా ఫొటోలను కావాల్సిన సైజులోకి కంప్రెస్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఈ టూల్‌లో వివిధ రకాల పద్ధతులు అందుబాటులో ఉంచారు. ఇమేజ్‌ ఎత్తు, వెడల్పుకు సంబంధించి మనకు కావాల్సిన ప్రమాణాల్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది 25 ఇమేజ్ బల్క్‌ ప్రాసెసింగ్‌కు వంటి ఫీచర్లను అందిస్తుంది.

గో టూ కన్వర్టర్

గో టూ కన్వర్టర్‌ 200 ఫార్మాట్లలో ఇది పనిచేస్తుంది. ఇందులోనూ రిసైజ్‌తో పాటు ఇమేజ్‌ కంప్రెస్‌ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా వెబ్‌రిసైజర్‌, బీఫంకీ, సింపుల్‌ ఇమేజ్‌ రిసైజర్‌, ఇమేజ్‌ ఆప్టిమైజర్‌, ఐఎంజీఆన్‌లైన్‌, జేపీఈజీ ఆప్టిమైజర్‌ వంటి అనేక టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి:ఉత్తమ సెట్​టాప్ బాక్స్​ను ఎంపిక చేసుకోండిలా...

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.