Best mobile phones under 15000 : మీకు తెలుసా.. భారత దేశంలో ఎక్కువ మంది ఉపయోగించేది బడ్జెట్ ఫోన్స్ మాత్రమే. సుమారుగా రూ.15,000 లోపు ఉండే ఈ స్మార్ట్‌ఫోన్స్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి, వారి నిత్యావసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందుకే మొబైల్ కంపెనీలు అన్నీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్స్ తెచ్చాయి ఇంకా తెస్తూనే ఉన్నాయి.
పవర్ఫుల్ హార్డ్‌వేర్ కూడా
ముఖ్యంగా సామాన్యులను ఆకర్షించేందుకు.. బెస్ట్ కెమెరా, ఫాస్టర్ ప్రాసెసర్, మంచి బ్యాటరీ లైఫ్ ఉండే బడ్జెట్ ఫోన్లు తెచ్చేందుకు అన్ని ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకప్పుడు రూ.20,000 కంటే ఎక్కువ ధర ఉండే సెల్ఫోన్లలో మాత్రమే ఉపయోగించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్లు.. ఇప్పుడు రూ.15,000 ప్రైస్ సెగ్మెంట్ ఫోన్లలోనూ అందుబాటులోకి తెచ్చాయి. ఇదే కాదు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్లు కూడా ఈ సెగ్మెంట్ ఫోన్లలో వాడుతున్నారు. అంటే యూజర్లకు మంచి పవర్ఫుల్ హార్డ్‌వేర్ కూడా ఇదే సెగ్మెంట్లో లభిస్తోంది.
బెస్ట్ కెమెరా
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బెస్ట్ కెమెరా ఫోన్లపై మక్కువ పెంచుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ కంపెనీలు ఈ బడ్జెట్ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ కెమెరాలను కూడా అందిస్తున్నాయి. చూశారుగా.. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఫోన్స్ ఏమిటో చూద్దామా?
లావా బ్లేజ్ 5జీ
భారతదేశంలో లభిస్తున్న బెస్ట్ 5జీ ఫోన్లలో 'లావా బ్లేజ్ 5జీ' ఒకటి. ఇది ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో, ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది.
lava Blaze 5G specifications
- డిస్ప్లే : 6.51 అంగుళాలు, 720x1600 పిక్సెల్స్, 90హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 700
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ కెపాసిటీ : 5000 ఎమ్ఏహెచ్ + 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ+0.3ఎమ్పీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎమ్పీ
Lava Blaze 5G Price : లావా బ్లేజ్ 5జీ ధర సుమారు రూ.10,999 ఉంది.
ఐకూ జెడ్6 లైట్ 5జీ
ఐకూ కంపెనీ భారత దేశంలో లాంఛ్ చేసిన బడ్జెట్ ఫోన్ 'జెడ్6 లైట్ 5జీ'. ఇది స్టెల్లార్ గ్రీన్ కలర్‌తో మంచి ప్రీమియం లుక్‌తో ఉంటుంది. అయితే బాక్స్‌లో మీకు ఛార్జర్ రాకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం.
iQOO Z6 Lite 5G specifications and features
- డిస్ప్లే : 6.58 అంగుళాలు, ఎల్సీడీ డిస్ప్లే + 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రోసెసర్
- బ్యాటరీ కెపాసిటీ : 5000 ఎమ్ఏహెచ్ + 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎమ్పీ
iQOO Z6 Lite 5G Price : ధర సుమారుగా రూ.13,999 ఉంది.
రియల్మీ సీ55
రియల్మీ సీ55 కేవలం 4జీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బడ్జెట్ లెవెల్ గేమింగ్ ఆడడం కొంచెం కష్టం. కానీ సాధారణ గేమ్స్ ఆడడానికి మాత్రం బాగుంటుంది. దీనిలోని కెమెరా డే లైట్లో బాగా పనిచేస్తుంది.
ఈ ఫోన్లోని మైనస్ పాయింట్స్ ఏమిటంటే.. సాఫ్ట్వేర్ కొంచెం గజిబిజిగా ఉంటుంది. దీనిలో చాలా కంపెనీ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. దీనికి తోడు చాలా స్పామీ నోటిఫికేషన్లు వచ్చి చిరాకు పెట్టిస్తుంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా పెద్దగా ఏమీ ఉండదు.
Realme C55
- డిస్ప్లే : 6.72 అంగుళాలు, 1080x2400 పిక్సెల్స్
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ88
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ కెపాసిటీ : 5000 ఎమ్ఏహెచ్
- రియర్ కెమెరా : 64 ఎమ్పీ+2ఎమ్పీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎమ్పీ
Realme C55 Price : ధర సుమారు రూ.10,999 ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ
అతి తక్కువ బడ్జెట్లోని బెస్ట్ 5జీ ఫోన్ ఇదేనని చెప్పవచ్చు. ఇది 12 5జీ బ్యాండ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇందులోని సాఫ్ట్వేర్ అంతగా బాగుండదనే చెప్పాలి.
Infinix Hot 20 5G specifications
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 810
- ర్యామ్ : 4జీబీ
- స్టోరేజ్ : 64 జీబీ
- బ్యాటరీ కెపాసిటీ : 5000 ఎమ్ఏహెచ్
- రియర్ కెమెరా : 50ఎమ్పీ+2ఎమ్పీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎమ్పీ
Infinix Hot 20 5G price : మార్కెట్లో దీని ధర సుమారు రూ.11,499 ఉంది.
రెడ్మీ 11 ప్రైమ్ 5జీ
రెడ్మీ 11 ప్రైమ్ 5జీ కూడా బడ్జెట్లోని మంచి 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
Redmi 11 Prime 5G specifications and features
- డిస్ప్లే : 6.58 అంగుళాలు, 2400x1080 పిక్సెల్స్
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 700
- ర్యామ్ : 6జీబీ
- స్టోరేజ్ : 128జీబీ
- బ్యాటరీ కెపాసిటీ : 5000 ఎమ్ఏహెచ్
- రియర్ కెమెరా : 50ఎమ్పీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎమ్పీ
Redmi 11 Prime 5G Price : దీని ధర సుమారు రూ.12,999 ఉంది.
ఇవీ చదవండి :