ETV Bharat / science-and-technology

సింధునేత్ర తయారీలో బెంగళూరు మహిళల కీలకపాత్ర - banglore women in pslv-c 51 satellite launch

వేలకిలోమీటర్ల సముద్ర తీరం...  దట్టమైన మంచుతో నిండి, మనుషులు అడుగుపెట్టడానికి వీలులేని చైనా, పాక్‌ సరిహద్దు ప్రాంతాలు... శత్రువులు ఎలా అయినా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు..  వాళ్లపై నిరంతరం కన్నేయాలంటే..సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఓ నిఘానేత్రం అవసరం.  ఆ బాధ్యతలే తీసుకుంది ‘సింధునేత్ర’.  తాజాగా పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాల్లో ఇదీ ఒకటి. దీని తయారీలో కీలకపాత్ర పోషించిన మహిళా బృందం మనతో ముచ్చటించింది...

bangalore women played a key role in the making of Sindhu Netra satellite
సింధునేత్ర తయారీలో బెంగళూరు మహిళల కీలకపాత్ర
author img

By

Published : Mar 2, 2021, 8:05 AM IST

స్రో పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహక నౌక నింగిలోకి 19 శాటిలైట్స్‌ని పంపిస్తే వాటిల్లో ‘సింధునేత్ర’(ఆర్‌శాట్‌) నిఘా ఉపగ్రహం ఒకటి. దీనికి డీఆర్‌డీవో నిధులు సమకూర్చగా, బెంగళూరులోని పీఈఎస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తుదిరూపునిచ్చారు. సముద్ర తీరంలో గస్తీ కాస్తూ శత్రు దేశ నౌకల సమాచారాన్ని మన అధికారులకు చేరవేయడం సింధునేత్ర పని. దీని తయారీలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా కీలకపాత్ర పోషించిన కావ్య నిత్యం పరిశోధనల్లో మునిగితేలడంలోనే అంతులేని సంతృప్తి ఉందని అంటున్నారు. గతంలో పీశాట్‌ ఉపగ్రహం తయారీలో పనిచేసిన అనుభవం ఉందామెకు. ఈ ప్రాజెక్టులో అసెంబ్లీ ఇంటిగ్రేషన్‌ టెస్టింగ్‌, ఆన్‌బోర్డ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ వంటి వ్యవహారాలని పర్యవేక్షించారామె.

‘ఆరేళ్లుగా సింధునేత్ర కోసం పనిచేస్తున్నా. ఈ ప్రయాణంలో డిజైన్‌, టూల్స్‌పై పట్టు సాధించటం సవాలుగా అనిపించింది. నిత్యం మారుతున్న సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. చాలా ఓర్పుతో ఉండాలి. నా స్నేహితులంతా ఎంఎన్‌సీల్లో పని చేస్తూ మంచి జీతాలు అందుకుంటున్నారు. వారాంతాల్లో నచ్చినట్టుగా ఉంటారు. నాకు అంతంత వేతనాలు, సౌకర్యాలు లేకపోయినా పరిశోధన రంగంలో నేను సాధించిన ఈ విజయం ఇచ్చిన సంతృప్తి వెలకట్టలేనిది’ అంటోంది కావ్య.

చిన్న ఉపగ్రహమే కానీ..

bangalore women played a key role in the making of Sindhu Netra satellite
సింధునేత్ర తయారీలో బెంగళూరు మహిళల కీలకపాత్ర

తక్కువ వ్యయంతో... లక్ష్యాలను చేరుకునే ఉపగ్రహాల తయారీ అంత సులువు కాదు. వీటిని రూపకల్పనకు నేర్పు, ఓర్పు కూడా చాలా అవసరం అంటారు మరో రీసెర్చ్‌ అసోసియేట్‌ అభిరామి. ‘ఉపగ్రహాల తయారీకి వాడే సాఫ్ట్‌వేర్‌లు ప్రతి ఏటా మారిపోతుంటాయి. ఏమాత్రం వెనుకబడినా కష్టమే. అందుకే ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఈ ప్రాజెక్టులో సిస్టమ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ కూర్పులు నాకు సవాళ్లు విసిరేవి. పేరుకు చిన్న ఉపగ్రహమే అయినా పెద్ద శాటిలైట్‌కు అవసరమైన డిజైన్లు, ఇంటిగ్రేషన్‌లు సమకూర్చాల్సి వచ్చింది’ అంటారామె.

వైఫల్యాలే పాఠాలుగా..

వైఫల్యాలే తనకు విలువైన పాఠాలు నేర్పాయని అంటున్నారు ఈ ప్రాజెక్టులో శాటిలైట్‌ డిజైన్‌, యాంటెన్నా టెస్టింగ్‌ విభాగాల్లో పనిచేసిన సుష్మ.
‘ఈ శాటిలైట్‌ కోసం యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌లతోనే యాంటెన్నా డిజైన్‌లను రూపొందించా. కానీ అవేమీ నాకు నచ్చలేదు. వైఫల్యం చెందిన ప్రతిసారీ కొత్త డిజైన్‌లు తయారు చేశా. అప్పుడే పుస్తకాల్లో చదివిన దానికీ ప్రత్యక్ష ప్రాజెక్టులకు ఎంత తేడా ఉంటుందో తెలిసొచ్చింది. దీని టెస్టింగ్‌ కోసం రోజూ 50కి.మీల దూరంలోని డీఆర్‌డీఓ కేంద్రానికి వెళ్లేదాన్ని’ అంటోంది సుష్మ శంకరప్ప.

విద్యార్థులకు శిక్షణ ఇచ్చి..

ఈ ప్రాజెక్టులో శాస్త్రవేత్తలే కాదు... విద్యార్థులూ పాలుపంచుకున్నారు. దాదాపు 10బ్యాచ్‌లకు చెందిన 50మంది విద్యార్థులు దీంట్లో పని చేశారు. వీరి నైపుణ్యాలను గుర్తిస్తూ వాటిని ప్రాజెక్టు కోసం ఉపయోగపడేలా చేశారు మెంటార్‌ ప్రియాంక అగర్వాల్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.