ఎప్పటి నుంచో వాట్సాప్‌ని డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఇతర వెబ్ ప్లాట్‌ఫామ్‌లపై వాడేస్తున్నాం. ఇందుకోసం సింపుల్‌గా ఫోన్ డెస్క్‌టాప్, వెబ్‌లలో వచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. మీరే కాదు మీ ఫోన్లో ఎవరైనా వెబ్ వాట్సాప్‌ని ఓపెన్ చేసి చూసేందుకు అవకాశం లేకపోలేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులెవరూ వెబ్ వాట్సాప్‌ని ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వాట్సాప్ కొత్తగా ప్రవేశపెడుతున్న సెక్యూరిటీ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసుకోండి.
దీంతో వాట్సాప్ వెబ్లో ఓపెన్ చేయాలంటే.. మీ ఫింగర్ ప్రింట్ తప్పనిసరిగా కావాలి లేదా ఫేస్ ఐడీని అయినా అన్‌లాక్ చేసేందుకు పెట్టుకోవచ్చు. అంటే... ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ ఉంటేనే వెబ్ వాట్సాప్ ఓపెన్ చేయడం సాధ్యం అవుతుందన్నమాట. అన్‌లాక్ చేశాక, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే గానీ వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ప్రత్యక్షమవదు. అంతేకాదు... ఈ సదుపాయాన్ని ఎనేబుల్ చేయడం ద్వారా ఇతరులు ఎవరైనా మీ ప్రమేయం లేకుండా వెబ్లో వాట్సాప్ వాడేందుకు ప్రయత్నిస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఆలర్ట్ వస్తుంది కూడా.
ఇదీ చదవండి: నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన