ETV Bharat / science-and-technology

Apple Release New iOS 17 Update : ఐఫోన్​ వేడెక్కుతోందా? ఈ అప్​డేట్​తో​ సమస్యకు చెక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 2:18 PM IST

Apple Release New iOS 17 Update In Telugu : ఐఫోన్​ 15 హీటింగ్ సమస్యకు చెక్ పెడుతూ యాపిల్ కంపెనీ ఐఓఎస్​ 17 అప్​డేట్​ను రిలీజ్ చేసింది. A17 Pro చిప్​పై అదనపు భారం పడకుండా యాప్స్​ను అప్టిమైజ్ చేసేందుకు కృషి చేస్తోంది. అలాగే రెండు సెక్యూరిటీ ప్యాచ్​లను విడుదల చేసి, ఫోన్​లోని బగ్స్​ను ఫిక్స్​ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..​

Apple iOS 17 update
Apple release new iOS 17 update

Apple Release New iOS 17 Update : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ లేటెస్ట్​గా ఐఓఎస్​ 17 అప్​డేట్​ను తీసుకువచ్చింది. దీనిలో రెండు సెక్యూరిటీ ప్యాచ్​లు కూడా ఉన్నాయి. ఈ తాజా అప్​డేట్​తో ఐఫోన్​ 15లోని బగ్స్​ అన్నింటినీ ఫిక్స్ చేశామని.. అందువల్ల ఐఫోన్​​ హీటింగ్​ సమస్యలకు చెక్​ పడుతుందని యాపిల్​ కంపెనీ వెల్లడించింది.

సమస్య- పరిష్కారం!
యాపిల్ కంపెనీ ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లను మార్కెట్​లోకి విడుదల చేసింది. అందుకు అనుగణంగా కొత్త ఐఓఎస్​ 17.0.2ను తీసుకొచ్చింది. దీనితో అందరూ ఈ ఐఓఎస్​ను అప్​డేట్​ను చేసుకున్నారు. కానీ అక్కడి నుంచే సమస్య మొదలైంది. ఐఫోన్​ 15 సిరీస్​ ఫోన్లు పరిమితికి మించి వేడెక్కడం స్టార్ట్​ అయ్యింది. దీనితో యాపిల్ యూజర్లు అందరూ కంపెనీకి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. రంగంలోకి దిగిన కంపెనీ తాజాగా ఐఓఎస్​ 17.0.3 అప్​డేట్​ను రిలీజ్ చేసింది. దీని ద్వారా ఐఫోన్​ 15 హీటింగ్ సమస్యకు చెక్ పడుతుందని పేర్కొంది.

ఐఫోన్​ 15లో కొన్ని యాప్స్​ కూడా సరి​గా రన్ కాలేదు. ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​, ఉబర్ లాంటి యాప్స్ సక్రమంగా పనిచేయలేదు. తాజా అప్​డేట్​తో ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది.

ఓవర్​ లోడ్ పడకుండా ఆప్టిమైజేషన్​​!
ఐఫోన్​ 15లో A17 Pro చిప్‌ను అమర్చారు. కొన్ని యాప్స్​ వల్ల దీనిపై ఓవర్​ లోడ్ పడుతోంది. అందువల్ల ఐఫోన్​ 15 ఓవర్ హీట్ అవుతోంది. దీనిని గుర్తించిన యాపిల్​ కంపెనీ.. A17 Pro చిప్​పై ఓవర్ లోడ్ పడకుండా.. యాప్​లను అప్టిమైజ్ చేయాలని.. యాప్​ డెవలపర్లకు కోరింది. పైగా వారికి కావాల్సిన సహకారం కూడా అందిస్తోంది.

అప్​డేట్​ చేసుకోండిలా!
ఐఫోన్ 15 యూజర్లు ముందుగా తమ ఫోన్​లోని Settingsను ఓపెన్ చేయాలి. అక్కడ అన్న General ఆప్షన్​పై క్లిక్ చేయాలి. మీకు Software Update అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఐఓఎస్​ 17.0.3ను అప్​డేట్ చేసుకోవాలి. అంతే సింపుల్​!

థర్మల్ సిస్టమ్​లో లోపాలు!
యాపిల్​ కంపెనీ.. ఐఫోన్​లోని థర్మల్​ సిస్టమ్​ డిజైన్​లో కాంప్రమైజ్​ కావడం వల్లనే ఐఫోన్​ 15 ఓవర్ హీట్ కావడానికి కారణమని యాపిల్ ఎనలిస్ట్ మింగి-చి-కుయో అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ప్రాసెసర్​పై కచ్చితంగా భారం తగ్గించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మింగి-చి-కుయో వాదనలను యాపిల్ కంపెనీ కొట్టిపారేసింది.

రిమోట్ యాక్సెస్​ను నిరోధించేందుకు!
యాపిల్ కంపెనీ ఐఓఎస్ 17.03, ఐపాడ్​ ఓఎస్ 17.0.3ల్లో రెండు సెక్యూరిటీ ప్యాచ్​లను విడుదల చేసింది. ఇతరులు ఎవ్వరూ, అనుమతి లేకుండా ఐఫోన్ 15 యాక్సెస్​ చేయకుండా ఇవి నిరోధిస్తాయి. ఫలితంగా యూజర్ల ఫోన్​కు మరింత భద్రత లభిస్తుంది.

How To Find A Lost Or Stolen Phone In 2023 : మీ స్మార్ట్​ఫోన్​ను పోగొట్టుకున్నారా?.. సింపుల్​గా కనిపెట్టేయండిలా!

Google Pixel 8 Series Launch : చిమ్మ చీకటిలోనూ ఫుల్​ క్లారిటీతో ఫొటోస్​!.. ఏఐ టెక్నాలజీతో.. గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్ ఫోన్స్ లాంఛ్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.