ETV Bharat / science-and-technology

యాపిల్ నయా అప్డేట్​.. మాస్క్ ధరించినా స్క్రీన్ అన్​లాక్ - యాపిల్ లేటెస్ట్ ఫేస్​ మాస్క్ అప్డేట్

Apple New Update Features: కరోనా వేళ ఐఫోన్ యూజర్ల కోసం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్. ఫేస్ మాస్క్ ధరించినా ఫేస్ ఐడీ స్కాన్​ సాయంతో స్క్రీన్ అన్​లాక్ అయ్యేలా సరికొత్త అప్డేట్​ను విడుదల చేసింది. మరి ఈ ఫీచర్​ను ఎలా సెట్ చేయాలో చూద్దాం..

యాపిల్
apple new update
author img

By

Published : Mar 15, 2022, 10:47 AM IST

Apple New Update Features: ఐఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్‌. కరోనా దృష్ట్యా ఐఫోన్ యూజర్స్ కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ్ టెక్ దిగ్గజం యాపిల్. ఐఫోన్ వినియోగదారులు ఫేస్​మాస్క్ ధరించినా ఫేస్ఐడీ ద్వారా స్క్రీన్​ అన్​లాక్ అయ్యే కొత్త అప్డేట్​ ఐఓస్​ 15.4ను సోమవారం విడుదల చేసింది. యూజర్స్​ మాస్కు ధరించినా కూడా.. స్క్రీన్ అన్​లాక్ అవుతుందని పేర్కొంది.

ఈ ఫీచర్​ను ఎలా సెట్ చేయాలి?

ఈ ఫీచర్​ను పొందాలంటే ఐఓఎస్ 15.4ను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్​>ఫేస్​ ఐడీ& పాస్​వర్డ్​>యూజ్ ఫేస్ ఐడీ విత్ ఏ మాస్క్​ ఆఫ్షన్​కు వెళ్లాలి.

అప్పుడు మీ ఫేస్​ను అన్ని కోణాల్లో స్కాన్ చేస్తుంది. ఆ సమయంలో మీరు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.

ఫేస్ ఐడీ విత్ గ్లాసెస్ ఎలా సెట్ చేయాలి?

కళ్లద్దాలు ధరించినా స్క్రీన్ అన్​లాక్ అయ్యే విధంగా యాపిల్ ఫోన్​లలో మరో ఫీచర్ కూడా ఉంది.

  • సెట్టింగ్స్>ఫేస్ఐడీ&పాస్​కోడ్​>యాడ్ గ్లాసెస్​కు వెళ్లాలి.

ఈ అప్డేట్​తో పాటు మరికొన్ని ఫీచర్స్​ను తీసుకొచ్చింది యాపిల్. అవేంటో చూద్దాం..

  • 'ఎయిర్ ట్యాగ్'(వ్యక్తిగత వస్తువుల ట్రాకింగ్ పరికరం)లో భద్రతా మెసేజ్​లు,
  • న్యూ సిరి వాయిస్
  • ఆఫ్​లైన్​లో ఉన్నప్పుడు సమయం, తేదీకి సంబంధించి ఫీచర్స్​ అప్డేట్స్​
  • టాప్ టూ పే ఆన్ ఐఫోన్(యాపిల్ పే ద్వారా లావాదేవీలు)
  • యూనివర్సల్ కంట్రోల్(ఐపాడ్, మ్యాక్ నుంచి ఫైల్స్​ షేరింగ్)
  • నోట్స్ యాప్ ​నుంచి ఫైల్స్​ను డైరెక్ట్​గా వేరే చోటుకు సేవ్ చేసే అవకాశం
  • షేర్​ప్లే(వేగంగా సాంగ్స్, ఇతర కంటెంట్​ను బదిలీ చేయడం)
  • ఫేస్ టైం కంటెంట్​

ఇదీ చూడండి: వాట్సాప్ గ్రూప్​ చాట్​లో పోల్స్​ ఫీచర్.. అసలేంటిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.