Apple Battery Lawsuit Settlement : 2018కు ముందు మీరు ఐఫోన్‌ను కొన్నారా? అయితే సుమారు రూ.41వేల కోట్లలో మీ వాటా తీసుకోవడానికి మీరు అర్హులే. ఎందుకంటే 'బ్యాటరీగేట్' వివాదంపై నమోదైన కేసులో.. క్లెయిమ్ చేసుకున్న యూజర్లందరికీ పరిహారం చెల్లించేందుకు యాపిల్ సంస్థ సిద్ధమైంది.
Iphone Battery Lawsuit Settlement : 2018కు ముందు కొనుగోలు చేసిన పలు రకాల ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోయేది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు సంస్థ సాఫ్ట్వేర్ అప్డేట్లను ఇచ్చింది. అయితే వీటి వల్ల ఫోన్ పనితీరు మరింతగా మందగించిందని యూజర్లు ఆరోపించారు. ఫలితంగా చాలా మంది వినియోగదారులు 2020లో యాపిల్ సంస్థపై కేసు నమోదు చేశారు. దీనినే 'బ్యాటరీగేట్' వివాదంగా పిలుస్తారు. యాపిల్ సంస్థపై నమోదైన కేసులో 2020 నుంచి విచారణ జరుగుతూనే ఉంది.
Iphone Lawsuit for Slowing Down Phones : మరోవైపు ఫోన్ పనితీరు మందగించేందుకు కారణం అప్డేట్ చేయడం కాదని యాపిల్ వాదించింది. అప్డేట్లు కేవలం ఫోన్ జీవన కాలాన్ని పెంచడానికేనని చెప్పింది. బ్యాటరీ పనితీరు మందగిస్తే.. వాటిని మారిస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుందని కోర్టుకు చెప్పింది. ఈ కేసు దాదాపు మూడేళ్లుగా కొనసాగింది. అయితే, తాజాగా యాపిల్ సంస్థ మనసు మార్చుకుంది. 'బ్యాటరీగేట్' సమస్యలో నష్టపోయిన వినియోగదారులందరికీ పరిహారాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ న్యాయవాది మార్క్ సీ మోలుంపీ ప్రకటించారు.
ఒక యూజర్‌కు యాపిల్ ఎంత చెల్లిస్తుంది?
ఒక్కో వినియోగదారుడికి ఎంత చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఇది నమోదైన క్లెయిమ్‌లపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. ఒకవేళ మీరు క్లెయిమ్ చేసి ఉంటే.. మీకు సుమారుగా 128 డాలర్లు (రూ. 10,632) చెల్లిస్తుంది. ఇందులో కోర్టు, అటార్నీ, ఇతర ఖర్చులు పోను దాదాపు 65 డాలర్లు (రూ.5,399) వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు సుమారు 30లక్షల మందికి పైగా పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఎవరు అర్హులు..?
IOS 10.2.1 ఆధారంగా నడిచే ఐఫోన్ 6, 6 ప్లస్, 6S, 6S ప్లస్, SE మోడళ్లతో పాటు IOS 11.2 ఆధారంగా ఐఫోన్ 7, 7 ప్లస్ మోడళ్ల ఫోన్లు ఉన్న వారు అర్హులు. వీరితో పాటు 2017 డిసెంబర్ 21కి ముందు ఐఫోన్‌ను కొనుగోలు చేసిన వారు ఈ పరిహారాన్ని పొందేందుకు అర్హులు. అయితే, ఈ పరిహారాన్ని పొందేందుకు 2020 అక్టోబర్ 6వ తేదీకి ముందుగా క్లెయిమ్ చేసి ఉండాలి.
ఎప్పుడు పరిహారం అకౌంట్లో జమ అవుతుంది?
పరిహారం సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారనే విషయంపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై సంస్థ న్యాయవాదిని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదు.
గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..!
గూగుల్‌లో సెర్చ్ చేశారా? అయితే రూ.189 కోట్లలో మీకూ వాటా! అప్లై చేసుకోండిలా!