ETV Bharat / science-and-technology

మీ ఐఫోన్​ ఇకపై మీరే రిపేర్​ చేసుకోవచ్చు! - how to self repair iphone

ఐఫోన్​ 12, ఐఫోన్​ 13 లైనప్స్​తో పాటు, ఎం1 చిప్స్ ఉన్న మ్యాక్​కు సెల్ఫ్ సర్వీస్(Apple self service)​ రిపేర్​ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటిచింది. వచ్చే ఏడాది ప్రారంభంలో అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు దీన్ని విస్తరించనుంది. దీని ద్వారా ఆన్​లైన్​లో వినియోగదారులు ఇక తమ ఫోన్​కు కావాల్సిన పరికరాలను తామే కొనుగోలు చేసి, ఫిక్స్ చేసుకోవచ్చు.

Apple Self Service Repair
యాపిల్ సెల్ఫ్​ సర్వీస్​ రిపేర్​
author img

By

Published : Nov 18, 2021, 3:31 PM IST

యాపిల్ ఉత్పత్తులను భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తాం. పొరపాటున ఆ వస్తువులకు ఏమైనా సమస్యలు తలెత్తితే మాత్రం రిపేర్ కోసం నానా తంటాలు పడాల్సిందే. రిపేర్ చేసే షాపులు దొరకడమే చాలా కష్టం. ఒకవేళ దొరికినా.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా.. షాపు వాళ్లు అసలైన ఫోన్ పార్ట్స్ తీసుకుని, నకిలీ పార్ట్స్ వేసి అందించే ప్రమాదమూ లేకపోలేదు. మరి ఈ ఇబ్బందులేవీ లేకుండా మన ఫోన్ మనమే రిపేర్(Apple self service) చేసుకుంటే.. బాగుంటుంది కదా! ఈ నేపథ్యంలోనే.. బుధవారం యాపిల్(Apple news) సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ వినియోగదారులు ఇకపై సొంతంగా తమ వస్తువులను తామే మరమ్మతు(Apple self service) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి సెల్ఫ్ సర్వీస్​ రిపేర్(Apple self service)​ సదుపాయాన్ని ఐఫోన్​ 12, ఐఫోన్​ 13 లైనప్స్​తో పాటు, ఎం1 చిప్స్ ఉన్న మ్యాక్​కు అందించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోని వారికి అందుబాటులోకి తేనుంది. మరమ్మతు చేసేందుకు కావాల్సిన పరికరాలతో పాటు, ఫోన్​లో పాడైన స్పేర్​ పార్ట్స్​​ను కూడా అందిస్తున్నట్లు యాపిల్​ ప్రకటించింది. ఈ సెల్ఫ్ సర్వీస్ రిపేర్​ కోసం ఓ ఆన్​లైన్​ స్టోర్​ను యాపిల్ సంస్థ ప్రారంభించనుంది. అందులో 200కుపైగా స్పేర్ పార్ట్స్​ ఉంచనున్నట్లు తెలిపింది. ముందుగా యాపిల్ ఐఫోన్ డిస్​ప్లే, బ్యాటరీ, కెమెరా వంటివాటి రిపేర్​కు మాత్రమే అనుమతించనుంది. ఆ మరుసటి ఏడాదికి మిగతా స్పేర్ పార్ట్స్​కు కూడా ఈ సదుపాయాన్ని తీసుకురానుంది.

తమకు కావాల్సిన యాపిల్ జెన్యూన్ పార్ట్ కోసం వినియోగదారులు.. యాపిల్​ సెల్ప్ సర్వీస్ రిపేర్​ స్టోర్​లో ఆర్డర్ చేసుకోవచ్చు. పాడైపోయిన పార్ట్స్​ను పంపిస్తే.. రీసైక్లింగ్ కోసం వినియోగించి, వినియోగదారులకు తాము కొనే వస్తువులపై డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది యాపిల్​. అమెరికాలోని చాలా మంది వినియోగదారులు సొంతంగా తయారు చేసుకునేందుకు 'రైట్​ టు రిపేర్'​ పేరుతో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్​ ఈ తాజా ప్రకటన చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.