Android New Version : ప్రముఖ సంస్థ గూగుల్ మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అతిత్వరలో ఆండ్రాయిండ్ 14(Android 14 Beta 5) స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ ఇప్పటికే ఫైనల్ ప్రీ-రిలీజ్ బిల్డ్ అయిన బీటా 5ను రిలీజ్ చేసింది.
ఈ ఆవిష్కరణతో గూగుల్.. సాఫ్ట్వేర్ రంగంలో అతిపెద్ద సంస్కరణకు అడుగు వేసినట్లయింది. ఈ వెర్షన్లో SDK, NDK APIలు, వీటితో పాటు సిస్టమ్ బిహేవియర్స్ ఉన్నాయి. వీటి పనితీరును తెలుసుకునేందుకు ఔత్సాహికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరిస్తోంది. అలా వచ్చిన అభిప్రాయాల ద్వారా ఆండ్రాయిడ్ 14 ఫైనల్ వెర్షన్ ఓఎస్‌ను గూగుల్ విడుదల చేయనుంది. ఫీడ్‌బ్యాక్ గనుక పాజిటివ్‌గా వస్తే డెవలపర్లు రానున్న కొత్త ఓఎస్‌లో తమ అప్లికేషన్లు సపోర్ట్ చేసేలా వాటిని రూపొందించుకోవాలని సూచించింది.
బీటా 5 వెర్షన్‌ను తెచ్చేందుకు గత నెలలోనే 4.1 బీటా వెర్షన్‌లోని అనేక బగ్స్‌ను ఫిక్స్ చేసి, ఆప్టిమైజ్ చేసింది గూగుల్. ఈ వెర్షన్‌తో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ పెరగనుంది. రిలీజ్ క్యాండిడేట్ పేరుతో ఫైనల్ బీటా అప్డేట్స్ను కూడా లాంఛ్ చేసింది. దీంతో ఫిక్స్డ్ లేదా స్టేబుల్ స్టేటస్‌కు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. మొత్తంగా త్వరలో అందుబాటులో(Android 14 Release Date)కి రానున్న ఈ నయా సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ ట్యాబ్లెట్ సహా కంపాటిబుల్ పిక్సెల్ డివైజ్ యూజర్లు ఆస్వాదించవచ్చు.
ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రానున్న కీలక ఫీచర్లివే..
మరింత మెరుగ్గా బ్యాటరీ లైఫ్..
Android New Update : గూగుల్ తీసుకురానున్న ఈ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో స్మార్ట్ ఫోన్ల్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడనుంది. దీంతో విద్యుత్ వాడకం కూడా తగ్గనుంది. బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ మేనేజ్మెంట్, అప్లోడ్స్, డౌన్లోడ్స్ వంటి యాక్షన్స్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫలితంగా బ్యాటరీ లైఫ్‌స్పాన్ పెరుగుతుంది.
200% సైజులో ఫాంట్..
Android 14 Features : రానున్న ఈ కొత్త సాఫ్ట్వేర్(Android 14)తో మీ ఫోన్లో ఫాంట్ సైజ్‌ను 200 శాతం వరకు పెంచుకోవచ్చు. ఇది చిన్న అక్షరాలను చూసేందుకు ఇబ్బంది పడేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్..
Google Android 14 Features : ఈ వెర్షన్ ద్వారా వచ్చే కొత్త ఫీచర్లలో ఆకట్టుకునేది స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్. అంటే మీ మొబైల్‌కు ఏవైనా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీ కెమెరా స్క్రీన్ ఫ్లాష్ అవుతుంది. వినికిడి సమస్యతో బాధపడే వారికి ఈ ఫీచర్ బాగా దోహదపడుతుంది.
డెవలపర్లకు మరింత చేరువగా..
Android New Features For Developers : ప్రీమియం ఫోన్ యాపిల్‌లో లాగా అన్ని స్క్రీన్ పరిమాణాలకు యాప్స్ రూపొందించడం, టూల్స్‌ను అభివృద్ధి చేయడం వంటి సూపర్ ఆప్షన్లు డెవలపర్లకు అందుబాటులో ఉండనున్నాయి.
మీడియా ఫైల్స్‌కు ప్రైవసీ..
Android 14 New Features : ఆండ్రాయిడ్ 14 ఓఎస్(Android New Version Name) ద్వారా మీ స్మార్ట్ఫోన్లలో ఓ గొప్ప ఫీచర్ రానుంది. అదే మీడియా యాక్సెస్. దీంతో సదరు యాప్స్‌కు ఫొటోలు, వీడియోల యాక్సెస్‌ను పరిమిత సంఖ్యలో ఇవ్వచ్చు. అంటే మీకు కావాల్సిన ఫొటో లేదా వీడియోను మాత్రమే యాక్సెస్ చేసేందుకు ఆయా యాప్స్‌కు పర్మిషన్స్ ఇవ్వచ్చు. అప్పుడు మీ గ్యాలరీలోని మిగతా ఫొటోలు, వీడియోలను యాప్స్ యాక్సెస్ చేయలేవు. దీంతో యూజర్ల ప్రైవసీ మరింత పెరగనుంది.
మొబైల్ నెట్వర్క్ లేకున్నా..
Android 14 Beta 5 Features : ఆండ్రాయిడ్ 14తో శాటిలైట్ కనెక్టివిటీ అనే నయా ఫీచర్‌ను కూడా మీ స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని సందర్భాల్లో మొబైల్ నెట్వర్క్ సేవలు అందుబాటులో లేనివారికి శాటిలైట్ ద్వారా సేవలు పొందేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొంది. అంతేకాకుండా మున్ముందు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను కూడా పొందవచ్చని తెలిపింది.
మొత్తంగా ఆండ్రాయిడ్ 14 వెర్షన్ సాయంతో పైన తెలిపిన ఫీచర్లే కాకుండా మరికొన్ని ఫీచర్లను కూడా రూపొందిస్తున్నట్లు గూగుల్ చెప్పింది.