ETV Bharat / science-and-technology

ఫోన్‌తో గేమ్స్‌ ఆన్‌.. ఈ చిట్కాలతో ఎంతో ఫన్! - మొబైల్ గేమ్స్ టిప్స్

Mobile games tips: కొన్ని చిట్కాలు పాటిస్తే ఆండ్రాయిడ్ ఫోన్లలో గేమ్స్ మరింత మెరుగ్గా ఆడేయొచ్చు. బ్యాటరీ లైఫ్​ను పెంచడం, గేమింగ్ పరికరాలు, బూస్టర్లను వినియోగించడం తెలిస్తే.. గేమింగ్​ను బాగా ఆస్వాదించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చదివేయండి..

PHONE GAMES
PHONE GAMES
author img

By

Published : Dec 15, 2021, 9:16 AM IST

Mobile games tips: గేమ్స్‌ అరచేతిలోకి వచ్చేశాయి! ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్స్‌లోనే వీటిని ఆడేస్తున్నారాయె. అధునాతన గేమ్స్‌ రూపుదిద్దుకోవటమో.. ఇంటర్నెట్‌ స్పీడ్‌, క్లౌడ్‌ గేమింగ్‌ పెరగటమో.. కొవిడ్‌ నేపథ్యమో కారణమేదైనా ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ గేమ్స్‌ విపరీత ప్రాచుర్యం పొందుతున్నాయి. మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌లో మనదేశం ఐదో స్థానానికి ఎగబాకటమే దీనికి నిదర్శనం. మరి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గేమ్స్‌ బాగా ఆడాలంటే? కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

బ్యాటరీ లైఫ్‌ సురక్షితంగా

Android games battery: గేమ్స్‌ను బాగా ఆస్వాదించాలంటే బ్యాటరీ లైఫ్‌ బాగుండటం చాలా ముఖ్యం. వీలైనంతవరకు బ్యాటరీ ఎనర్జీని సేవ్‌ చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇందుకోసం బ్యాటరీ సేవర్‌, ఆడాప్టివ్‌ బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌లు బ్యాటరీని వాడుకోకుండా నిలువరిస్తాయి. దీంతో ఎక్కువసేపు గేమ్స్‌ ఆడుకోవటానికి వీలుంటుంది. ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు బ్యాటరీ చాలదని అనిపిస్తే పవర్‌బ్యాంకు వంటివి వెంట తీసుకెళ్లాలి.

అధిక స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌

mobile games refresh rate: స్క్రీన్‌ రిఫ్రెష్‌ వేగం ఎంత ఎక్కువగా ఉంటే గేమ్స్‌ అంత బాగా కనువిందు చేస్తాయి. యానిమేషన్‌ కదలికలు తేలికగా సాగుతాయి. చాలా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ను మార్చుకోవచ్చు. వీలైనంత ఎక్కువకు దీన్ని మార్చుకుంటే గేమ్స్‌ను బాగా ఆస్వాదించొచ్చు. ఇందుకోసం ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, డిస్‌ప్లేను ట్యాప్‌ చేయాలి. అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌ను ఎంచుకొని, రిఫ్రెష్‌ రేట్‌ బటన్‌ను నొక్కాలి. వీలైనంత ఎక్కువ రిఫ్రెష్‌ రేటును ఎంచుకోవాలి.

హోం స్క్రీన్‌ శుభ్రంగా..

హోం స్క్రీన్‌ మీద ఎక్కువ యాప్స్‌ లేకుండా చూసుకోవటమూ ముఖ్యమే. ఎందుకంటే వీటితోనూ ఫోన్‌ వేగం నెమ్మదిస్తుంది. కాబట్టి ఫోన్‌ ప్రాసెసర్‌ వేగం పెంచుకోవటానికి హోం స్క్రీన్‌ మీదా దృష్టి పెట్టాలి. తరచూ ఉపయోగించే యాప్స్‌నే ఇక్కడ ఉంచుకోవాలి. యానిమేటెడ్‌ వాల్‌పేపర్లకు బదులు స్థిరంగా ఉండే దృశ్యాలను ఎంచుకోవాలి.

Mobile games Dolby sound

డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌ ఎనేబుల్‌

కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లు డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌ను సపోర్టు చేస్తాయి. ఇది గేమింగ్‌ నైపుణ్యాన్ని బాగా ఇనుమడింపజేస్తుంది. ఫోన్‌లో ఈ ఫీచర్‌ ఉన్నట్టయితే ఎనేబుల్‌ చేసుకోవచ్చు. ఇందుకు సెటింగ్స్‌లోకి వెళ్లి సౌండ్‌ అండ్‌ వైబ్రేషన్‌ ఫీచర్‌ను తాకాలి. అనంతరం సౌండ్‌ క్వాలిటీ అండ్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా డాల్బీ ఆటమ్స్‌ను ఎంచుకొని, ఆన్‌ చేసుకోవాలి.

ఫోన్‌ గేమింగ్‌ పరికరాలు

ఎంతసేపని ఫోన్‌ను చేత్తో పట్టుకొని గేమ్స్‌ ఆడతాం. పైగా ఫోన్‌లో గేమ్‌ బటన్లను నొక్కటం, వదలటం కాస్త కష్టమైన పనే. అందువల్ల సాఫ్ట్‌వేర్‌తో పాటు గేమింగ్‌ పరికరాల మీదా దృష్టి పెట్టటం మంచిది. ఉదాహరణకు- ఎక్స్‌టర్నల్‌ గేమ్‌ కంట్రోలర్‌నే తీసుకోండి. ఫోన్‌కు జతకూడే దీంతో కంట్రోళ్లను తేలికగా వాడుకోవచ్చు. వీటిని తేలికగానే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఫోన్‌కు జతచేసి వాడుకోవటమే తరువాయి.

బ్యాక్‌గ్రౌండ్‌ సర్వీసెస్‌ టర్న్‌ ఆఫ్‌

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ యాప్‌లు గేమ్స్‌కు అడుగడుగునా అడ్డుతగులుతాయి. ఇవి బ్యాటరీ, ర్యామ్‌ మీద విపరీత ప్రభావం చూపుతాయి. నోటిఫికేషన్స్‌తో ప్రాసెసర్‌ వేగాన్నీ తగ్గిస్తాయి. దీంతో ఆటను మనసారా ఆస్వాదించటం కష్టమవుతుంది. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌ సర్వీసులను టర్న్‌ ఆఫ్‌ చేయటం మంచిది. సెటింగ్స్‌లోకి వెళ్లి అన్ని బ్యాక్‌గ్రౌండ్‌ సర్వీసులను డిసేబుల్‌ చేసుకోవచ్చు.

ఫోర్స్‌ 4ఎక్స్‌ ఆన్‌

కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఫోర్స్‌ 4ఎక్స్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఇది గేమ్‌ క్వాలిటీని బాగా పెంచుతుంది. ఈ ఆప్షన్‌ త్వరగా బ్యాటరీ ఖాళీ అయ్యేలా చేస్తుంది కాబట్టి చాలా ఫోన్లలో డిసేబుల్‌ అయ్యింటుంది. బ్యాటరీ గురించి చింతించాల్సిన అవసరం లేకపోతే, ఫోన్‌లో గేమ్స్‌ను ఆస్వాదించాలని అనుకుంటే దీన్ని ఆన్‌ చేసుకోవచ్చు. అయితే అన్ని ఫోన్లలో ఈ సదుపాయం ఉండకపోవచ్చు. అందువల్ల ముందుగా ఫోన్‌లో ఫోర్స్‌ 4ఎక్స్‌ ఆప్షన్‌ ఉందేమో చూసుకొని, ఎనేబుల్‌ చేసుకోవాలి. సెటింగ్స్‌లోని అబౌట్‌ ఫోన్‌ ద్వారా బిల్డ్‌ నంబర్‌ బటన్‌ను నొక్కాలి. అప్పుడు యూఆర్‌ డెవలపర్‌ అనే సందేశం కనిపిస్తుంది. తర్వాత తిరిగి మెయిన్‌ సెటింగ్స్‌లోకి వచ్చి సిస్టమ్‌ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. డెవలపర్‌ ఆప్షన్‌ ద్వారా ఫోర్స్‌ 4ఎక్స్‌ ఎంఎస్‌ఏఏ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

గేమ్‌ బూస్టర్‌ యాప్‌ సాయం

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గేమ్స్‌ ఆడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి వేగం పెంచటానికి యాప్స్‌ సైతం పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి గేమ్‌ బూస్టర్‌ యాప్స్‌ ఫోన్లలోని వివిధ ఫీచర్లను మారుస్తూ నిరాటంకంగా ఆడుకోవటానికి ఉపకరిస్తాయి. గేమ్స్‌ ఆడుతున్నప్పుడు దృష్టి చెదరకుండా నోటిఫికేషన్స్‌ను నిలువరిస్తాయి కూడా. ప్రతీ ఆప్షన్‌ను మనం ఆప్టిమైజ్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క ట్యాప్‌తోనే అన్నీ ఇవే చేసేస్తాయి. ఉచితంగా వేగం పెంచుకోవాలని అనుకుంటే గేమ్‌ బూస్టర్‌ యాప్‌ను ప్రయత్నించొచ్చు. ఇలాంటి గేమ్‌ లాంచర్‌ యాప్‌లు ఇంకా చాలానే ఉన్నాయి.

జంక్‌ ఫైళ్ల నిర్మూలన

ఎక్కువ ఫైళ్లు స్టోర్‌ అయ్యింటే ఫోన్‌ పనితీరు మందగిస్తుంది. అందువల్ల అనవసర ఫైళ్లను తొలగించేసుకోవటం మంచిది. దీంతో ఫోన్‌ వేగం పెరుగుతుంది. గేమ్స్‌ కూడా బాగా ఆడుకోవచ్చు. జంక్‌ ఫైళ్లు ఎక్కడ్నుంచైనా నిండిపోవచ్చు. ఆన్‌ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌ అవశేషాలు అలాగే ఉండిపోవచ్చు. పాత మీడియా ఫైళ్లు, ఉపయోగించని డాక్యుమెంట్లు అన్నీ జంక్‌గా మారిపోతాయి. ఇలాంటివాటిని గుర్తించటానికి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బిల్టిన్‌ సదుపాయం ఉంటుంది. ఇది సురక్షితంగా ఫోన్‌ నుంచి అనవసర ఫైళ్లను తొలగించేస్తుంది. ఇందుకోసం సెటింగ్స్‌లోకి వెళ్లి స్లోరేజీని క్లిక్‌ చేయాలి అనంతరం 'ఫ్రీ అప్‌ స్పేస్‌' బటన్‌ను నొక్కాలి. అనవసర ఫైళ్లను ఎంచుకొని, కింద ఉండే 'ఫ్రీ అప్‌' బటన్‌ను నొక్కాలి. కొన్ని ఫోన్లలో క్లీనర్‌ యాప్‌ ద్వారా జంక్‌ ఫైళ్లను ఎంచుకొని తొలగించుకోవచ్చు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.