ETV Bharat / science-and-technology

spaceX project: అందరికీ రోదసియానం- 15న కీలక ప్రయోగం! - space travel for private people

రోదసియానాన్ని(Space Tour) పరిశోధకులకే కాక ఇతరులకూ అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్‌ఎక్స్‌(spaceX project) అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 15న కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 'ఇన్‌స్పిరేషన్‌4' ప్రాజెక్టు(Inspiration 4 Mission) కింద నిర్వహించే ఈ యాత్రలో తొలిసారిగా నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపనుంది.

inspiration4 project
స్పేస్​ ఎక్స్​ ప్రాజెక్ట్​
author img

By

Published : Sep 7, 2021, 7:33 AM IST

రోదసియానాన్ని(Space Tour) పరిశోధకులకే కాక ఇతరులకూ అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ స్పేస్‌ఎక్స్‌(SpaceX Project) ఈ నెల 15న కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 'ఇన్‌స్పిరేషన్‌4' ప్రాజెక్టు(Inspiration 4 Mission) కింద నిర్వహించే ఈ యాత్రలో తొలిసారిగా నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపనుంది. అంతరిక్ష పర్యాటకంలో ఇదో మైలురాయి కాబోతోంది. పూర్తిగా ప్రభుత్వేతర, ప్రైవేటు వ్యక్తులతో కూడిన ఒక వ్యోమనౌక మొదటిసారిగా భూమిని చుట్టిరాబోతోంది. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక ద్వారా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ వ్యోమనౌకలోని నాలుగు సీట్లను అమెరికాకు చెందిన బిలియనీర్‌, 'షిఫ్ట్‌4 పేమెంట్స్‌' వ్యవస్థాపకుడు జేర్డ్‌ ఇజాక్‌మన్‌ కొనుగోలు చేశారు. టెన్నెసీలోని సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ కోసం నిధులు సేకరించే ఉద్దేశంతో ఆయన ఈ చర్యను చేపట్టారు. చిన్నారుల్లో వచ్చే లుకేమియా, ఇతర రకాల క్యాన్సర్లపై ఈ వైద్యశాలలో పరిశోధన చేస్తుంటారు.

ఈ ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్న హేలీ ఆర్సెనోవ్‌ కూడా రోదసియాత్రలో(Space Tourism) పాల్గొంటారు. చిన్నతనంలో ఆమె ఎముక క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. ఇంకా.. సియాన్‌ ప్రాక్టర్‌, క్రిస్‌ సెంబ్రోస్కీలూ యాత్రకు ఎంపికయ్యారు. ఈ నలుగురూ కొద్దినెలలుగా రోదసియాత్ర కోసం శిక్షణ పొందుతున్నారు. రోదసి యాత్రలో భాగంగా ఈ నలుగురు మూడు రోజుల పాటు భూమిని చుట్టి వస్తారు. ఆ తర్వాత వారి వ్యోమనౌక అట్లాంటిక్‌ మహాసముద్రంలో పడుతుంది. 'ఇన్‌స్పిరేషన్‌4' యాత్ర కోసం డ్రాగన్‌ వ్యోమనౌకలో మార్పులు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావడానికి వీలుగా అందులో డాకింగ్‌ పోర్ట్‌ ఉంటుంది. 15న జరగబోయే యాత్ర కోసం దీన్ని తొలగించి, గుమ్మటం లాంటి కిటికీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా యాత్రికులు.. రోదసి నుంచి భూమిని వీక్షించొచ్చు.

డేటా సేకరణ

ఈ యాత్ర ద్వారా భారీస్థాయిలో ఆరోగ్య డేటాను సేకరించనున్నారు. భవిష్యత్‌లో మానవసహిత అంతరిక్ష యాత్రల కోసం దీన్ని ఉపయోగిస్తారు. యాత్రికుల నుంచి ఈసీజీ, కదలికలు, నిద్ర, గుండె కొట్టుకునే రేటు, లయ, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, క్యాబిన్‌లో ధ్వనులు, కాంతి తీవ్రత వంటి అంశాలకు సంబంధించి డేటాను సేకరిస్తారు. 'ఇన్‌స్పిరేషన్‌4' ద్వారా అంతరిక్ష పర్యాటకాన్ని మరింత చౌకలో, ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని స్పేస్‌ఎక్స్‌ భావిస్తోంది.

ఇదీ చదవండి:చంద్రయాన్-2 ఘనత.. జాబిల్లి చుట్టూ 9 వేల సార్లు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.