ETV Bharat / science-and-technology

ఈ యాప్​తో జరభద్రం.. మీ డేటా చోరీ చేసి అంగట్లో పెడుతుంది.. వెంటనే అన్​ఇన్​స్టాల్​ చేసుకోండి! - స్పైహైడ్​ సాఫ్ట్​వేర్​ బారి నుంచి ఎలా బయటపడాలి

Stalkerware App : ప్రమాదకరమైన స్టాక్​వేర్​ యాప్​ను ఇన్‌స్టాల్ చేసుకున్న వేల మంది ఆండ్రాయిడ్​ యూజర్స్​ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ యాప్​లో ఉన్న సాఫ్ట్​వేర్​ మన ప్రైవేటు డేటాను మొత్తం అంగట్లో పెడుతుంది. మరి దీని బారి నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Stalkware App Spyhide Software 60 Thousand Phones Infected
ఆ యాప్​ ద్వారా 60 వేల ఫోన్లల్లో వైరస్​.. అందులో మీరు ఉన్నారేమో.. ఓసారి చెక్ చేసుకోండి..
author img

By

Published : Jul 26, 2023, 6:51 PM IST

Updated : Jul 26, 2023, 7:26 PM IST

Techcrunch Report On Cyber Security : ఆండ్రాయిడ్​ మొబైల్​ యూజర్స్​కు ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. హానికరమైన యాప్​గా పేర్కొంటున్న స్టాక్​వేర్ యాప్​ను ఇన్‌స్టాల్​ చేసుకుని వినియోగిస్తున్న దాదాపు 60 వేల మంది ఆండ్రాయిడ్​ యూజర్లు​ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే అందులో ఉండే స్పైహైడ్​ అనే ప్రమాదకరమైన సాఫ్ట్​వేర్​ మన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం అంగట్లో అమ్మకానికి పెడుతోంది. ఈ యాప్​ ద్వారా దాదాపు 60 వేల ఆండ్రాయిడ్​ ఫోన్లల్లోకి వైరస్​ చొరబడిందని.. అది మన ప్రైవేటు డేటాను రహస్యంగా యాక్సెస్​ చేసి మార్కెట్​లో విక్రయాలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ​ వెబ్​సైట్​ రిపోర్ట్​ నివేదించింది. చాలా ప్రమాదకరమైన​ సాఫ్ట్​వేర్​గా పేర్కొనే స్పైహైడ్​ సాఫ్ట్​వేర్ 2016 నుంచి ఇప్పటి వరకు వేలాది ఆండ్రాయిడ్ యూజర్ల డివైజుల్లోకి చొరబడి డేటాను యాక్సెస్​ చేసినట్లు వెల్లడించింది. ఈ డేటాలో మన కాల్​ లాగ్స్​, కాంటాక్ట్స్​, ఫొటో గ్యాలరీ, మెసేజ్​లు, రికార్డింగులు, రియల్​ టైమ్​ లొకేషన్​తో పాటు ఇతర విలువైన సమాచారాన్ని కూడా అపహరించినట్లు స్పష్టం చేసింది.

లక్షల మంది వివరాలు..
Spyhide Software : ఇటీవలే స్విట్జర్లాండ్​కు చెందిన Maia Arson Crimew హ్యాకర్​ కూడా స్పైహైడ్​ సాఫ్ట్​వేర్​ ద్వారా వేల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని గుర్తించింది. అంతే కాకుండా ఈ స్పైహైడ్​ ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్​గా పనిచేస్తుందని టెక్​ క్రంచ్ నివేదిక​ తెలిపింది. అమెరికాలో 3,100 ఆండ్రాయిడ్​ మొబైల్స్​లోని లక్ష కంటే ఎక్కువ లొకేషన్​ డేటా పాయింట్లను సేకరించిందని చెప్పింది. మొత్తం 7,50,000 మంది సైన్​ అప్​ వినియోగదారుల వివరాలను అపహరించినట్లుగా ఆధారాలు సేకరించింది. ఇందులో 3.29 మిలియన్ల మెసేజ్​లు, పాస్‌వర్డ్ రీసెట్ లింక్‌లు, 1.2 మిలియన్ కాల్ లాగ్‌లు, 3,12,000 కాల్ రికార్డింగ్ ఫైల్‌లు, 9,25,000కి పైగా కాంటాక్ట్ లిస్ట్‌లు, 3,82,000 ఫొటోలు ఉన్నాయి.

ఇది కాస్త డిఫరెంట్..
Stalkerware App : మన ఫోన్​లోని డేటాను దొంగిలించేందుకు సైబర్​ నేరగాళ్లు పంపే సాధారణ యాప్​ లింక్స్​ కంటే ఇది అత్యంత ప్రమాదకరమని.. ఇది మన ఫోన్​లో ఉండే సున్నితమైన సమాచారాన్ని మనకి తెలియకుండానే అపహరిస్తుందని టెక్​ నిపుణులు అంటున్నారు. ఈ స్పైహైడ్​ సాఫ్ట్​వేర్​ మన ప్రైవేటు డేటాను యాక్సెస్​ చేసి దాన్ని సైబర్​ కేటుగాళ్లకు అందిస్తుంది. ఇలా సేకరించిన డేటాను ఇతర సైబర్​ నేరగాళ్లకు సరఫరా చేస్తూ బాధితులు పెద్ద మొత్తంలో నష్టపోయేలా మోసాలకు పాల్పడుతోందని ఓ రిపోర్ట్​ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఈ సాఫ్ట్​వేర్​ లేదా యాప్​ను ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్​ పరికరాల నుంచి తొలగించడమే పెద్ద సవాలుగా మారింది.

How To Detect Stalkerware On Android Phone : ఈ సాఫ్ట్​వేర్​ ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్​గా పనిచేస్తోందని నివేదికలు స్పష్టం చేసిన నేపథ్యంలో.. భారత్​లోనూ ఆండ్రాయిడ్​ యూజర్స్​ కాస్త భయాందోళనలకు గురవుతున్నారు. అయితే మీరు దీని బారిన పడలేదని నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. కాగా, ఒకవేళ మీరూ బాధితులైతే ఈ కింద తెలిపిన స్టెప్స్​ ఫాలో అవుతూ దాని బారి నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు చూద్దాం.

గుర్తిస్తే.. తీసేయండిలా..
How To Delete Spy App On Android : ఈ రకమైన యాప్‌లు తరచుగా మీ ఫోన్‌లో సాధారణ యాప్స్​ లాగే కనిపిస్తుంటాయి. కానీ, అవి మన డేటాను అపహరించేవి అని గుర్తించడం అంత సులువైన విషయం కాదు. ఉదాహరణకు డివైజ్​లో స్పైహైడ్​ ఉన్నా సరే దానిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే గూగుల్​ సెట్టింగ్స్​లో గూగుల్​ థీమ్డ్​ యాప్స్​ వలె అది కనిపిస్తుంది. లేదా రింగ్​టోన్​ యాప్​లా ఉండే టీ రింగ్​టోన్​లా ఉంటుంది. వాస్తవానికి దీనిని మనం గూగుల్​ అందించే యాప్స్​ అనే అనుకుంటాము. కానీ కొన్ని సార్లు అటువంటి ఐకాన్​లతో పోలి ఉన్న ఫేక్​ యాప్స్​ కూడా మన మొబైల్​లో ఇన్​స్టాల్​ అయి ఉంటాయి. అప్పుడు మీరు సెట్టింగ్స్​లోకి వెళ్లి మీరు ఇన్​స్టాల్​ చేసుకున్న యాప్స్​ను మాత్రమే ఉంచుకొని అనుమానంగా కనిపించిన యాప్స్​ను డిలీట్​ లేదా అన్​ఇన్​స్టాల్​ చేసేయండి.

పాస్​వర్డ్స్​కు బదులు ఫింగర్​ప్రింట్స్​..
స్పైహైడ్​, స్టాక్​వేర్​ వంటి ప్రమాదకరమైన యాప్స్​, సాఫ్ట్​వేర్​ల బారిన పడకుండా ఉండేందుకు.. ఆండ్రాయిడ్​ అందించే బెస్ట్​ యాంటీవైరస్​ యాప్​లను స్కానింగ్​ కోసం వినియోగించండి. అలాగే మీ ఫోన్​ లాక్​లను తెరిచేందుకు పాస్​వర్డ్స్​, పిన్​ల కంటే.. ఫింగర్​ప్రింట్స్​, ఫేస్​ రికగ్నిషన్​ వంటి బయోమెట్రిక్స్​ను ఉపయోగించడం ద్వారా ఈ మాల్​వేర్​ బారి నుంచి సులభంగా బయటపడతారు. అయితే ఈ మాల్​వేర్​ పట్ల కేవలం ఆండ్రాయిడ్​ యూజర్స్​ మాత్రమే కాకుండా ఐఓఎస్​ వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు టెక్​ నిపుణులు.

Last Updated : Jul 26, 2023, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.