How to remove virus from pc for free : కంప్యూటర్ల పాలిట వైరస్లు ఒక పీడకలగా మనం చెప్పవచ్చు. ఇవి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కీలకమైన ఫైల్స్, డేటా కోల్పోవడానికి కారణమవుతాయి. మరీ ముఖ్యంగా మన ప్రైవసీకి భంగం కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కనిపెట్టిందే యాంటీ వైరస్.
యాంటీ వైరస్లు వాస్తవానికి చాలా సమర్థవంతంగా వైరస్‌లను ఎదుర్కొంటాయి. కానీ వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని ఎఫర్ట్ చేయలేరు. కానీ వీటిని కొనుగోలు చేయలేని వారు చింతించాల్సిన పనిలేదు. వైరస్‌లను పూర్తిగా నిరోధించే అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
I. విండోస్ డిఫెండర్‌ను టర్న్ ఆన్ చేసుకోండి
windows defender for antivirus : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి యాంటీ వైరస్ల ఖరీదు చాలా ఎక్కువ. కానీ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తూ ఉంటే కనుక అందులో బిల్ట్-ఇన్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే విండోస్ డిఫెండర్. దీనిని కచ్చితంగా టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది వైరస్‌లను, మాల్వేర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
విండోస్ డిఫెండర్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
How to enable windows defender : విండోస్ డిఫెండర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం.
- ముందుగా మీ కంప్యూటర్లోని start బటన్‌ను క్లిక్ చేసి, Windows security అని టైప్ చేయాలి.
- వెంటనే windows security app ఓపెన్ అవుతుంది. అప్పుడు దానిలోని virus & threat protection పై క్లిక్ చేయాలి.
- వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్‌లో Manage settings పై క్లిక్ చేయాలి.
- తరువాత Real-time protection ని టర్న్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, కన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అంతే!
- విండోస్ డిఫెండర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ, మీ పీసీని రెగ్యులర్‌గా స్కాన్ చేస్తూ ఉంటుంది. వైరస్, మాల్వేర్ అటాక్స్ నుంచి మీ కంప్యూటర్ను కాపాడుతుంది.
II. వైరస్ రిలేటెడ్ బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్‌ను నిరోధించండి
Virus related background processes : సాధారణంగా వైరస్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఇవి సిస్టమ్ రిసోర్స్‌లను ఉపయోగించుకుంటూ ఉంటాయి. హానికరమైన పనులను చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ కంప్యూటర్ పనితనాన్ని, జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని మాయం చేస్తాయి. కొన్ని సార్లు హ్యాకర్లకు మీ సున్నితమైన సమాచారాన్ని అందిస్తాయి. కానీ మరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ చేసే వైరస్‌లను చాలా సులువుగా నిరోధించవచ్చు.
- మీ కంప్యూటర్ సెర్చ్ బాక్స్‌లో Task Manager అని టైప్ చేయండి.
- వెంటనే మీకు టాస్క్ మేనేజర్లో Processes or Details టాబ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏమైనా అనుమానాస్పదంగా ప్రాసెసెస్ జరుగుతూ ఉంటే, దానిపై క్లిక్ చేసి End task నొక్కండి. అంతే! బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి.
III. అన్నోన్ స్టార్టప్ ప్రోగ్రామ్‌లను డిజేబుల్ చేయండి!
How to disable unknow startup programs : మీ కంప్యూటర్ దిగువ భాగంలో చాలా ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఎలాంటి హాని కలిగించని యాప్స్‌లాగా కనిపిస్తాయి. కానీ ఇవి మీ కంప్యూటర్లోని డేటాను చాలా సులువుగా తస్కరిస్తూ ఉంటాయి. మీ బ్రౌజింగ్ హిస్టరీపై గూఢచర్యం చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మీ కంప్యూటర్ పనితనం మందగించేలా చేస్తాయి. అందుకే ఇలాంటి తెలియని, ఉపయోగపడని యాప్‌లను వెంటనే డిజేబుల్ చేసేయాలి. ఇందుకోసం..
- కీబోర్డ్‌లోని Ctrl+Alt+Deleteని క్లిక్ చేయాలి. తరువాత టాస్క్ మేనేజర్‌ను ఓపెన్ చేయాలి.
- దీనిలో startup టాబ్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి. అప్పుడు మీకు చాలా పేర్లు, ఐకాన్లు కనిపిస్తాయి. వాస్తవానికి మీరు కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా లాంఛ్ అయిపోతూ ఉంటాయి. కనుక మీరు ఏదైనా ఐకాన్ అనుమానాస్పదంగా ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే దానిని Disable చేసేయండి.
- ఇలానే అక్కడ కనిపిస్తున్న అన్ని ఐకాన్స్‌ను చూసి, వాటిలో ఏది డేంజర్ అనిపిస్తే, వాటిని డిజేబుల్ చేసేయండి.
- అవసరంలేని యాప్‌లను డిజేబుల్ చేసిన తరువాత, టాస్క్ మేనేజర్‌ను క్లోజ్ చేసేయండి. తరువాత మీ కంప్యూటర్ను రీస్టార్ట్ చేయండి.
- ఇప్పుడు మరలా మీ కంప్యూటర్ను ఆన్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ చాలా వేగంగా, స్మూత్‌గా పనిచేస్తున్నట్లు గమనిస్తారు.
IV. టెంపరరీ ఫైల్స్‌ను డిలీట్ చేయండి!
How to delete temporary files : సాధారణంగా కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడు చాలా ప్రోగ్రామ్‌లు టెంపరరీ ఫైల్స్‌ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాస్తవానికి వాటిలో చాలా సమాచారం ఉంటుంది. కొన్నిసార్లు ఈ టెంపరరీ ఫైల్స్‌లో ప్రమాదకరమైన సాఫ్ట్వేర్లు హిడెన్‌గా ఉంటాయి. ఇవి మీ కంప్యూటర్లను పూర్తిగా డామేజ్ చేస్తాయి. అందువల్ల ఇలాంటి టెంపరరీ ఫైల్స్‌ను, వాటిలో దాక్కున్న ప్రమాదకరమైన సాఫ్ట్వేర్లను డిలీట్ చేసేయాలి.
- ముందుగా కంప్యూటర్లోని సెర్చ్ బాక్స్‌లో disk cleanup అని టైప్ చేయాలి.
- disk cleanupలో ఉన్న మీకు నచ్చిన డ్రైవ్‌ను ఎంచుకొని ok క్లిక్ చేయాలి. అప్పుడు మీ డ్రైవ్‌లో ఉన్న స్పేస్ గురించి, అందులో ఉన్న టెంపరరీ ఫైల్స్ గురించి మొత్తం సమాచారం మీకు తెలుస్తుంది.
- ముఖ్యంగా రీసైకిల్ బిన్, డౌన్లోడ్స్, థంబ్‌నెయిల్స్ మొదలైన టెంపరరీ ఫైల్స్ మీకు కనిపిస్తాయి. వాటిపైన క్లిక్ చేసి Clean up system filesని క్లిక్ చేయాలి. అలాగే ఓల్డ్ విండోస్ అప్డేట్స్, ప్రీవియస్ ఇస్టాలేషన్స్ని కూడా క్లీన్అప్ చేయాలి.
- ఈ ప్రాసెస్ అయినంత వరకు వేచి ఉండాలి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు.
- మొత్తం ఫైల్స్ డిలీట్ అయిన తరువాత కంప్యూటర్ను రీస్టార్ట్ చేయాలి. దీనిలో మీ సిస్టమ్ వైరస్-ఫ్రీ అవుతుంది.
V. రీస్టోర్ యువర్ సిస్టమ్ టు ప్రీవియస్ పాయింట్
System restore previous date : టైమ్ మెషిన్లో వెనుకటి కాలానికి వెళ్లడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే మీ కంప్యూటర్ను కూడా పాత కాలానికి తీసుకెళ్లడం ద్వారా ప్రమాదకరమైన వైరస్‌లను నిరోధించవచ్చని మీకు తెలుసా?
ఉదాహరణకు నిన్నటి వరకు మీ కంప్యూటర్లో ఎలాంటి హానికరమైన వైరస్ లేదు అనుకుందాం. కానీ ఇవాళ మీ కంప్యూటర్లోకి ఒక ప్రమాదకరమైన వైరస్ ప్రవేశించింది అనుకుందాం. అప్పుడు మీరు మీ కంప్యూటర్ను ఒకరోజు వెనక్కు తీసుకెళ్లడం ద్వారా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చు. అది ఎలాగంటే..
- కంప్యూటర్ సెర్చ్ బాక్స్‌లో Recovery అని టైప్ చేయండి. కంట్రోల్ ఫ్యానెల్లోని Recovery ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తరువాత open system restoreపై క్లిక్ చేయండి.
- తరువాత Next పై క్లిక్ చేయండి. మీకు చాలా రీస్టోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో మీకు నచ్చిన రీస్టోర్ పాయింట్‌పై క్లిక్ చేసి, Next బటన్ నొక్కండి.
- ఈ రీస్టోర్ పాయింట్ వద్ద మీ కంప్యూటర్లో ఏమేమి మార్పులు వస్తాయో, తెలుపుతూ ఒక బాక్స్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి, Finish బటన్ నొక్కండి. దానిని మరలా కన్ఫార్మ్ చేయడానికి Yes బటన్‌ను క్లిక్ చేయండి. అంతే! మీ సిస్టమ్ మొత్తం రీస్టోర్ అవుతుంది.
- రీస్టోర్ అయిన తరువాత మీ కంప్యూటర్ను మరలా రీస్టార్ట్ చేయండి. అంతే రీస్టోర్ సక్సెస్ఫుల్ అయినట్లు మీకు మెసేజ్ కనిపిస్తుంది.
VI. హార్డ్ డ్రైవ్‌ను ఫార్మాట్ చేయండి!
How to format hard drive : కంప్యూటర్లోని ప్రమాదకరమైన వైరస్‌లను నిర్మూలించడానికి హార్డ్ డ్రైవ్‌లను ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే.. కొన్ని సార్లు మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న మొత్తం డేటాను మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల హార్డ్ డ్రైవ్‌ను ఫార్మాట్ చేసే ముందు కచ్చితంగా బ్యాక్ అప్ తీసుకోవడం ఉత్తమం. ఇందుకోసం ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ గానీ, గూగుల్ డ్రైవ్గానీ ఉపయోగించడం మేలు చేస్తుంది.
హార్డ్ డ్రైవ్ ఫార్మాట్ చేయడం ఎలా?
- దీని కోసం బూటబుల్ ఇన్స్టాలేషన్ డిస్క్ లేదా యూఎస్‌బీని మీ కంప్యూటర్‌కు ఇన్సర్ట్ చేయాలి.
- కంప్యూటర్ను రీస్టార్ట్ చేసి, తరువాత ఇన్స్టాలేషన్ డిస్క్ లేదా యూఎస్‌బీని బూట్ చేయాలి.
- తరువాత స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. అంతే! మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్, ఓఎస్ పూర్తిగా క్లీన్ అవుతాయి. వాటిలోని వైరస్లు అన్నీ మాయమవుతాయి.
యాంటీ వైరస్ వాడడం చాలా ఉత్తమం
Best antivirus for PC : వాస్తవానికి వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే, కచ్చితంగా మంచి యాంటీ వైరస్‌ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. అలాగే మీ కంప్యూటర్ను రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకోవాలి. బ్రౌజింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచి మాత్రమే కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీ కంప్యూటర్లను వైరస్ బెడద నుంచి కాపాడుకోవాలి.