Long Lasting Battery Phone 2023 : ప్రస్తుతం మనం స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేని స్థితికి వచ్చేశాం. ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్లినా చార్జర్, పవర్ బ్యాంక్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళుతున్నారు కొందరు. అది కొంచెం దూరమైనా సరే. దీనికి కారణం వారి ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం లేదా తక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండటమే. మెసేజ్, కాల్స్ దగ్గర్నుంచి గేమ్స్ ఆడటం, ఎడిటింగ్ చేసేవరకు మొబైల్లో ఏం చేయాలన్నా.. ఛార్జింగ్ కచ్చితంగా ఉండాలి. మనకెంత మంచి ఫోన్ ఉన్నా సరే.. అందులో సరైన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే వృథానే.
మరి ఇలాంటి బాధలు తొలగాలంటే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయాలి. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారు, ఫోన్లో ఫొటోలు, వీడియోలు ఎడిటింగ్ చేసే వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాయి. మరి ఈ ఏడాది రిలీజైన అలాంటి టాప్ 5 మొబైల్స్ ఇవి.
1. Asus ROG Phone 7 Ultimate
ఈ మధ్య కాలంలో వచ్చిన లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఫోన్లలో ఇదొకటి. 65W స్పీడ్ ఛార్జర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ను.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 18.5 గంటలు పనిచేస్తుంది. దీనికి కారణం ఇందులో ఉన్న 6000 mAh గల బ్యాటరీ సామర్థ్యం. Snapdragon 8 Gen CPUతో రావడం వల్ల గేమ్స్ ఆడటం, ఫొటోలు, వీడియోలు ఎడిటింగ్ చేసేవారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్.
![long lasting battery phone 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18586161_1-1.png)
2. Apple I Phone 14 Pro Max
యాపిల్ ఫోన్ అనగానే సరిగా ఛార్జింగ్ ఆగదు అనే ఒక అపవాదు ఉంది. వాటన్నింటికి ఈ ఫోన్‌తో సమాధానం చెప్పింది ఆ కంపెనీ. ఇటీవల విడుదల చేసిన ఈ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సుమారు 13.5 గంటలకు పైగా వాడుకోవచ్చు. దీంతో పాటు పవర్ మేనేజ్మెంట్ చేసే A16 Bionic Processor కూడా బ్యాటరీ లాంగ్ లైఫ్‌కు కారణం. ఇప్పటి దాకా వచ్చిన మోడళ్లలో బ్యాటరీ పరంగా ఇదే బెస్ట్ ఫోన్.
3. Moto G Power 2022
మోటరోలా నుంచి వచ్చిన మంచి బ్యాటరీ ఫోన్ ఇది. ఇప్పటిదాకా వచ్చిన Moto G సిరీస్ అన్నింటిలోకెళ్లా ఇది ఛార్జింగ్ కొంచెం మెల్లగా అయినప్పటికీ.. బ్యాటరీ మాత్రం ఎక్కువ కాలం వస్తుంది. మోటరోలా నుంచి వచ్చిన ఇతర ఉత్పత్తుల కంటే బ్యాటరీ పరంగా ఉత్తమమైన ఫోన్. టెస్టింగ్ సమయంలోనూ దీనికి మంచి మార్కులే పడ్డాయి.
![long lasting battery phone 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18586161_1-2.jpg)
4. OnePlus North N300
వన్ ప్లస్ నుంచి తక్కువ ధరకే వచ్చిన ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంది. టెస్టింగ్ సమయంలో Asus Zenfone 9, Nubia RedMagic 6S Pro లతో పోలిస్తే.. మొదటి స్థానంలో నిలిచింది. సింగిల్ ఛార్జ్‌తో 13 గంటలు వస్తుంది. దీని రిఫ్రెష్ రేటు 90Hz ఉన్నప్పటికీ ఇది ఫోన్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపదు.
![long lasting battery phone 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18586161_1-4.jpg)
5. OnePlus 11
వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చిన నార్డ్ సిరీస్ ఫోన్లలో మాత్రమే మంచి బ్యాటరీ లైఫ్ ఉంది. కానీ ఈ OnePlus 11 లో ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్‌లో 5000 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. దీంతో దీని బ్యాటరీ బ్యాకప్ సూపర్‌గా ఉంది. దీనిలోని Snapdragon 8 Gen CPU సామర్థ్యాన్ని పెంచుతుంది.
![long lasting battery phone 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18586161_1-3.jpg)
ఇవీ చదవండి : ఐఫోన్ 15 సిరీస్‌లో సంచలన మార్పులు.. ఈ ఒక్క ఫీచర్‌తో మార్కెట్ షేక్!
నోకియా కొత్త కీప్యాడ్ ఫోన్లు.. ఇంటర్నెట్ లేకుండానే ఆన్లైన్ పేమెంట్స్.. ఎలా అంటే?