ETV Bharat / science-and-technology

మీరూ స్టాకర్వేర్ బాధితులా? తెలుసుకోండిలా?

దేశంలో దాదాపు 4,627 మంది మొబైల్​ యూజర్స్​.. స్టాకర్వేర్​ బాధితులుగా ఉన్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. స్టాకర్వేర్ అనేది సాధారణంగా గృహహింసకు వాడుతున్న ఒక సర్వెలెన్స్​ సాఫ్ట్​వేర్​. ఈ సాఫ్ట్​వేర్​ యాప్స్​ సాధారణంగా వివిధ రకాల మారుపేర్లతో ఉంటూ.. సన్నిహితుల మొబైల్స్​లోని మెసేజ్​లు, కాల్స్, లొకేషన్​ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పసిగడతాయి.

4627 indian mobile users stalk their partners through stalkerware apps
దేశంలో 4627 మంది స్టాక్​వేర్​ బాధితులు
author img

By

Published : Mar 3, 2021, 12:48 PM IST

సన్నిహితుల జీవితాలను డిజిటల్​ సహాయంతో నియంత్రించాలని కొంత మంది ప్రయత్నిస్తుంటారు. దాని కారణంగా దేశంలో సుమారు 4,627 మంది మొబైల్​ యూజర్స్​ స్టాకర్వేర్ బాధితులుగా మారారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో లాక్​డౌన్​ విధించకముందు ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. లాక్​డౌన్​లలో అందరూ ఇళ్లకే పరిమితమైన కారణంగా ఈ సంఖ్య ప్రస్తుతం కొంత తగ్గిందని అధ్యయనం అభిప్రాయపడింది.

ఏంటీ స్టాకర్వేర్​..

స్టాకర్వేర్​ అనేది గృహహింసకు వాడుతున్న ఒక సర్వెలెన్స్​ సాఫ్ట్​వేర్​. ఈ సాఫ్ట్​వేర్​ యాప్స్​ సాధారణంగా మారుపేర్లతో ఉంటాయి. ఇతరుల మొబైల్స్​లోని మెసేజ్​లు, కాల్స్​ వివరాలు, లొకేషన్​ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు అనుమానాస్పద వ్యక్తులు వీటిని ఉపయోగిస్తారని సైబర్​ సెక్యురిటీ సంస్థ కాస్పెర్స్కీ స్పష్టం చేసింది.

2020లో 53,870 మొబైల్ యూజర్లు స్టాకర్వేర్ బాధితులుగా ఉన్నారు. 2019లో 67,500 మంది దీని బారిన పడ్డారు. 2020 మార్చి నుంచి జూన్​ వరకు దీని బాధితుల సంఖ్య బాగా తగ్గింది. కానీ లాక్​డౌన్​లు ఎత్తివేసిన తర్వాత అది పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని కాస్పెర్స్కీ సంస్థ తెలిపింది.

స్టాకర్వేర్ బారిన పడిన మొబైల్​ యూజర్స్​ ప్రస్తుత గణాంకాల కన్నా చాలా ఎక్కువగా ఉంటారు. ఈ సాఫ్ట్​వేర్​ బారినపడ్డ కొత్త శాంపుల్స్​ను ప్రతిరోజూ మేము కనుగొంటున్నాము. ప్రస్తుతం బయటపడ్డ గణాంకాలలో ప్రతి సంఖ్య వెనుక ఒక జీవితం ఉంటుంది. సహాయం కోసం కొన్నిసార్లు సైలైంట్​ కాల్స్​ వస్తుంటాయి.

- విక్టర్​ చెబిషెవ్, కాస్పెర్స్కీ రీసెర్చ్​ డెవలప్​మెంట్​ టీం లీడర్​

దీనిని ఎలా గుర్తించాలి?

మీ మొబైల్​లో 'అన్​నోన్​ సోర్సెస్'​ సెట్టింగ్​ ఆన్​ చేసి ఉందా చూసుకోవాలి. ఒకవేళ ఆన్​ చేసి ఉంటే అనవసరమైన సాఫ్ట్​వేర్​ను ఇతరులు ఇన్​స్టా​ల్​ చేయడానికి సూచికగా భావించాలి. మీ మొబైల్​ను దుర్వినియోగం చేసే వ్యక్తి..స్టాకర్వేర్​ను డౌన్​లోడ్​ చేయడానికి కొన్ని వెబ్​ పేజీలను వాడతాడు. ఒకవేళ హిస్టరీని డిలీట్​ చేస్తే..తమ మొబైల్​ దుర్వినియోగం అవుతుందన్న విషయం సదరు బాధితుడు కనుగొనలేడు.

ఏం..చేయాలి?

స్టాకర్వేర్​ సాఫ్ట్​వేర్​ ఉందన్న విషయం తెలియగానే దానికి సంబంధించిన యాప్​లను డిలీట్​ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే..మీ మొబైల్​ను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలిసిపోతుంది. ఆ తర్వాత మరింత దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉందని కాస్పెర్స్కీ సంస్థ తెలిపింది. వివిధ దేశాల సంస్థలతో కలిసి పనిచేస్తున్న కాస్పెర్స్కీ సంస్థ..గత ఏడాది నవంబర్​లో యాంటీ స్టాకర్వేర్​ టూల్​ 'టినీచెక్​'​ను వెలుగులోకి తెచ్చింది. గృహహింసను, మొబైల్​ యూజర్ల వ్యక్తిగత భద్రతను కాపాడడానికి లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

ఇదీ చదవండి:తగిన మూల్యం చెల్లించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.