ప్రస్తుతం మార్కెట్లో దొరికే కురగాయలు, ఆకుకూరలపై ఎక్కువగా క్రీమిసంహారక మందులు ఉంటున్నాయి. కానీ పైకి అవి ఉన్నట్లు కనిపించవు! వాటిని మనం ఎంత శుభ్రం చేసుకున్నా కొన్నిసార్లు ఆ మందుల అవశేషాలు ఉండిపోతుంటాయి. అలాంటప్పుడే ఇంట్లోనే దొరికే కొన్నివస్తువులతో వాటిని ఎలా శుభ్రం(kitchen tips) చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో రైస్ వైన్ వెనిగర్, బాల్స్మిక్ వెనిగర్, యాపిల్ సిడార్ వెనిగర్, సింథటిక్ వెనిగర్ అని పలు రకాల వెనిగర్లు(vinegar uses) లభ్యమవుతుంటాయి. వీటిలో చవకగా దొరికే సింథటిక్ వెనిగర్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దానిని వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు క్లీనింగ్ కోసం కూడా వాడొచ్చు.
ముందుగా ఓ బాటిల్లో కొంత నీరు తీసుకుని అందులో కాస్త సింథటిక్ వెనిగర్(vinegar varieties and uses), కాస్త ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. దానిని కూరగాయలు, ఆకుకూరలపై స్ప్రే చేసి దాదాపు 10-15 నిమిషాలు వాటిని అలా వదిలేయాలి. దీంతో క్రీములు, పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. ఆ తర్వాత ఆ కూరగాయల్ని ఓసారి నీటితో కడుక్కోని వండుకుంటే సరి.
పైన చెప్పిన వెనిగర్స్లో యాపిల్ సిడార్ వెనిగర్‌ను(apple cider vinegar) బరువు తగ్గడం కోసం తయారుచేసే పదార్థాల్లో ఉపయోగిస్తారట.