ETV Bharat / priya

పండ్లనీ కూరగాయల్నీ పొడి చేసేస్తున్నారు..! - తెలంగాణ వార్తలు

‘నాకిప్పుడు పైనాపిల్‌ జ్యూస్‌ కావాలి’ అంటూ మారాం చేస్తోంది సుశ్మి. వెంటనే మార్కెట్‌కి బయల్దేరబోయాడు విజయ్‌. ‘అవసరం లేదండీ... చిటికెలో చేసిస్తా’ అంటూ సీసాలో ఉన్న పొడిని చల్లని నీళ్లలో కలిపి ఇచ్చింది చందన. ‘అరె... ఉల్లిపాయలు అయిపోయాయే... ఈ చికెన్‌ కర్రీకి ఫ్లేవర్‌ ఎలా...’ అనుకుంటోన్న ప్రియకి ‘డోన్ట్‌వర్రీ’ అంటూ ఓ ప్యాకెట్‌ అందించాడు కిరణ్‌. అవును మరి... సీజన్‌ కాదనో మార్కెట్‌ దగ్గర లేదనో ఇప్పుడు బాధ పడక్కర్లేదు. పండ్లూ కూరగాయలన్నీ పొడిరూపంలో దొరుకుతూ ఆయా రుచుల్నీ పోషకాల్నీ అందిస్తున్నాయి.

vegetables-and-fruits-using-as-powders-to-prepare-juice-and-other-recipes
పండ్లనీ కూరగాయల్నీ పొడి చేసేస్తున్నారు..!
author img

By

Published : Mar 14, 2021, 1:00 PM IST

vegetables-and-fruits-using-as-powders-to-prepare-juice-and-other-recipes
పొడుల రూపంలో పండ్లు

మామిడికాయలు వేసవిలోనే వస్తాయి. అందుకనే వాటిని ఒరుగుల రూపంలో ఎండబెట్టుకుని ఏడాది పొడవునా వాడుకుంటుంటారు. అలాగే ఇతర కూరగాయలకి కాస్త మామిడికాయ రుచి తగిలితే బాగుంటుందీ అనుకునేవాళ్లు ఎండబెట్టి చేసిన పొడినీ వాడతారు. జ్యూస్‌ కావాలనుకుంటే పండ్ల గుజ్జుతో చేసిన స్క్వాష్‌ని కలుపుకుంటారు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క మామిడి కాయా పండూ మాత్రమే కాదు, పనస పండు నుంచి పచ్చిమిర్చి వరకూ అన్ని రకాల పండ్లనీ కూరగాయల్నీ పొడి చేసి అమ్మేస్తున్నారు. చివరకు చెరకురసాన్నీ, కొబ్బరినీళ్లనీ, మజ్జిగనీ సైతం పొడి రూపంలోకి మార్చేస్తున్నారు.

పొడులతో ఆరోగ్యం

ఆయా పండ్లూ కూరగాయల్లోని పోషకాల్నీ రుచినీ అన్ని కాలాల్లోనూ ఆస్వాదించడంతోపాటు నిల్వచేసుకుని వాడుకోగలిగే సౌలభ్యం ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు పనస, మామిడి, సీతాఫలం వంటి పండ్లు ఏడాది పొడవునా ఉండవు. కానీ వాటిని తినాలనో ఆ ఫ్లేవర్‌ కావాలనో అనిపిస్తుంది. అదే ఆ పొడి ఉంటే నీళ్లలో కలిపి చిటికెలో జ్యూస్‌ చేసుకోవచ్చు. ఐస్‌క్రీమ్‌, కుకీ, స్మూతీ, డెజర్ట్‌ల తయారీలో వాడుకోవచ్చు. పండ్ల మాదిరిగానే కూరగాయలన్నీ కూడా అన్నిచోట్లా అన్ని కాలాల్లోనూ దొరకవు. బెర్రీలూ చెర్రీలూ నేరేడూ వంటి పండ్లూ, ఆకుకూరలూ, టొమాటో.. వంటివి రవాణాలో దెబ్బతింటాయి. అదీ ఇదీ అని లేకుండా పండ్లూ కాయగూరలూ ఆకుకూరలూ మైక్రోగ్రీన్సూ... ఇలా అన్నింటినీ పొడి కొట్టేస్తున్నారు.

ఎలా చేస్తారు?

పండ్లలోని నీరంతా ఆవిరైపోయేలా ఫ్రీజ్‌ డ్రై చేసి, పొడి చేసే విధానాన్ని మొదట స్పెయిన్‌లో వాడారట. ఈ పద్ధతి వల్ల వాటిల్లోని పోషకాలన్నీ యథాతథంగా ఉండటమే కాదు, యాంటీఆక్సిడెంట్ల శాతం తగ్గకుండానూ ఉంటుందట. పైగా పొడి రూపంలోని పండునీ కూరగాయనీ ఏ ఆహారపదార్థం మీదయినా నేరుగా చల్లుకుని తినొచ్చు. పాలకూర, తోటకూర, బచ్చలి, ఆలూ, టొమాటో, క్యారెట్‌, బీట్‌రూట్‌, మునగ... వంటి ఆకుకూరలూ, కూరగాయలతోపాటు పుట్టగొడుగుల్నీ పొడి చేసేస్తున్నారు. ఆపిల్‌, పుచ్చ, ద్రాక్ష, బొప్పాయి, చెర్రీ, స్ట్రాబెర్రీ, కమలా, మామిడి, పైనాపిల్‌... ఇలా పండ్ల లిస్టయితే చాలానే ఉంది. అంతేకాదు, కొన్ని రకాల ఆకుకూరలూ మూలికలూ కూరగాయలూ కలిపి పొడి చేస్తున్నారు. గ్రీన్‌ పౌడర్స్‌గా పిలుస్తోన్న వీటిని కొంచెంగా తీసుకున్నా అన్ని పోషకాలూ ఏకకాలంలో అందుతాయట. ఉదాహరణకు క్రూసిఫెరస్‌ కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బ్రకోలీ, కేల్‌... వంటివి కలిపి చేసిన పొడి హార్మోన్‌ అసమతౌల్యాన్ని పోగొడుతుందట. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్‌ సమస్యలకి ఇది మేలని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి కారప్పొడుల రూపంలో కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, పుదీనా... వంటి ఆకుల్ని పొడిచేసి వాడుకోవడం మనదగ్గర పూర్వకాలం నుంచీ వాడుకలో ఉంది. అయితే ఇప్పుడు వాటిల్లోని పోషకాలు ఏమాత్రం దెబ్బతినకుండా శీతలీకరణ పద్ధతుల్లో ఆరబెట్టి పొడి చేస్తున్నారన్నమాట. కొన్ని కంపెనీలు ఈ పొడుల్ని సప్లిమెంట్లగానూ తయారుచేస్తున్నాయి.

చిటికెలో తయార్

మంచివేనా?

ఊబకాయం, బీపీ, హృద్రోగాలతో బాధపడేవాళ్లని కార్బొహైడ్రేట్లు తక్కువగానూ విటమిన్లూ ఖనిజాలూ వంటి పోషకాలు ఎక్కువగానూ ఉండే పండ్లూ కూరగాయల్ని రోజూ తీసుకోమంటున్నారు. కానీ రోజువారీ ఆహారంలో అన్నీ తినడం అందరికీ కుదరకపోవచ్చు. దొరకడం సంగతి అటుంచితే, కొంతమందికి అన్ని కూరగాయలూ రుచించవు. కాకర తినమంటే చికాకు పడేవాళ్లు కొందరయితే, కీరా మాట వింటేనే వికారం అంటారు మరికొందరు. అలాంటివాళ్లకి ఈ పొడులయితే ఇబ్బంది ఉండదు. వరసగా మూడునెలలపాటు అన్ని రకాల పండ్లూ కూరగాయల పొడుల్ని ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లకి బీపీ తగ్గినట్లు ఇప్పటికే అనేక పరిశోధనల్లోనూ తేలింది. ప్రతి ఒక్కరూ రోజుకి 400 గ్రా. తాజా పండ్లనీ కూరగాయల్నీ తింటే హృద్రోగాలూ పక్షవాతం, చక్కెరవ్యాధి... వంటివి త్వరగా రావనేది నిపుణుల మాట. అయితే అది అన్నివేళలా సాధ్యం కాదు కాబట్టి పొడులైనా మంచిదే మరి. విటమిన్‌-కె, ల్యూటెన్‌, ఫోలేట్‌, బీటాకెరోటిన్‌లు ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయల పొడులు మెదడు ఆరోగ్యానికీ మేలుచేస్తాయట. ఎందుకంటే కూరగాయలూ పండ్లూ ఎక్కువగా తినే వృద్ధుల్లో మెదడు చురుకుగా పనిచేస్తున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ వయసు వాళ్లు అన్నీ తినలేరు కాబట్టి పొడి రూపంలో తీసుకుంటే సరి అంటున్నారు పరిశోధకులు. ఇక, ఆహారాన్ని నేరుగా తినలేని రోగులకీ అంతరిక్షంలో ప్రయాణించే ఆస్ట్రోనాట్లకీ ఈ పొడులు ఉపయోగం అన్నది తెలిసిందే.

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు

సహజంగా దొరికే కూరగాయలూ పండ్లతో పోలిస్తే పొడుల్లో పీచు తక్కువే. కానీ కొద్దిపాళ్లలో ఉండే పీచు ప్రీబయోటిక్‌గానూ పనిచేస్తుందట. కూరగాయలూ పండ్లూ ఏవైనా ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి కాబట్టి ఈ పొడుల్ని సహజ రంగులుగానూ వాడుకోవచ్చు. కూరగాయల్ని వండే విధానాలవల్ల కూడా వాటిల్లోని కొన్ని పోషకాలు నశిస్తాయి. కాబట్టి తాజాగా దొరికేవి తింటూనే నిల్వ ఉండే ఈ పొడుల్నీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు.కూరగాయలైనా పండ్లైనా రోగనిరోధకశక్తిని పెంచుతాయనేది తెలిసిందే. కొవిడ్‌ కాలంలో వాటిని పొడుల రూపంలో తినడమూ బాగా పెరిగిందట. బేకరీ, డెయిరీ ఉత్పత్తుల్లోనూ వీటి వాడకం ఎక్కువైంది. మరో ఏడాది కల్లా ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ పౌడర్‌ మార్కెట్‌ 15.6 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఓ అంచనా.

అసలే కరోనా కూడా ఉన్న వేసవి కాలం... కొవ్వునీ బరువునీ పెంచే ఏ శీతల పానీయమో తాగడం కన్నా ఎలాంటి ప్రిజర్వేటివ్‌లూ పంచదారా కృత్రిమ రంగులూ కలపని పండు పొడినో కూరగాయ పొడినో నీళ్లలో కలుపుకుని తాగడం అన్ని విధాలా ఉత్తమం. అటు దాహమూ తీరుతుంది, ఇటు వాటిల్లోని పోషకాలూ అందుతాయి. ఏమంటారు?

ఇదీ చదవండి: కశ్మీరి చిల్లీ మటన్​.. చూస్తేనే నోరూరెన్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.