ETV Bharat / priya

Corn recipes : కార్న్​తో వెరైటీ వంటకాలు.. తింటే వాహ్వా అంటారు... - corn masala sabji

మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌, బేబీకార్న్‌... ఇలా అన్నీ దొరికే కాలం ఇది. వాటిని ఎప్పుడూ ఒకే విధంగా తినడం కన్నా అప్పుడప్పుడూ కూర, స్వీటు, హాటు... ఇలా రకరకాలుగా చేసుకుంటే వెరైటీ రుచుల్నీ(Corn recipes) ఆస్వాదించొచ్చు.

కార్న్​తో వెరైటీ వంటకాలు
కార్న్​తో వెరైటీ వంటకాలు
author img

By

Published : Aug 1, 2021, 4:03 PM IST

మొక్కజొన్న పాకం గారెలు

మొక్కజొన్న పాకం గారెలు

కావలసినవి

తాజా మొక్కజొన్న గింజలు: రెండు కప్పులు, బియ్యప్పిండి: కప్పు, బొంబాయిరవ్వ: అరకప్పు, బెల్లం తరుగు: కప్పు, యాలకులపొడి: అరచెంచా, వంటసోడా: చిటికెడు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

మొక్కజొన్నగింజల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత అందులో బొంబాయిరవ్వ, బియ్యప్పిండి, వంటసోడా వేసి బాగా కలపాలి. ఓ గిన్నెలో బెల్లంతరుగు, పావుకప్పు నీళ్లు, యాలకులపొడి వేసుకుని స్టౌమీద పెట్టాలి. బెల్లం కరిగి తీగపాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక మొక్కజొన్నపిండిని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరవాత వాటన్నింటినీ బెల్లంపాకంలో వేసి తీసుకోవాలి.

క్రిస్పీ ఫైడ్‌ కార్న్‌

క్రిస్పీ ఫైడ్‌ కార్న్‌

కావలసినవి

లేత మొక్కజొన్న గింజలు/స్వీట్‌కార్న్‌: రెండు కప్పులు, మొక్కజొన్నపిండి: పావుకప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, మైదా: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, కారం: అరచెంచా, జీలకర్రపొడి: పావుచెంచా, ఆమ్‌చూర్‌ పొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం

ఓ గిన్నెలో నాలుగుకప్పుల నీళ్లు పోసి స్వీట్‌కార్న్‌/మొక్కజొన్న గింజలు, చెంచా ఉప్పు వేసి స్టౌమీద పెట్టాలి. అవి ఉడికాయనుకున్నాక దింపేసి నీటిని వంపేయాలి. అవి కాస్త చల్లారాక వీటిపైన మొక్కజొన్నపిండి, బియ్యప్పిండి, మైదా, మిరియాలపొడి, పావుచెంచా ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన కారం, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌పొడి, మరో పావుచెంచా ఉప్పువేసి అన్నింటినీ కలిపి వడ్డించేముందు ఉల్లిపాయముక్కలు, క్యాప్సికం తరుగు, కొత్తిమీర అలంకరించాలి.

కార్న్‌ మసాలా సబ్జీ

కార్న్‌ మసాలా సబ్జీ

కావలసినవి

వెన్న: రెండు టేబుల్‌స్పూన్లు, స్వీట్‌కార్న్‌: ముప్పావుకప్పు, క్యాప్సికం: ఒకటి, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకు: ఒకటి, దాల్చినచెక్క: చిన్న ముక్క, యాలకులు: రెండు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: పావుచెంచా, ఉప్పు: తగినంత, టొమాటోముద్ద: కప్పు, జీడిపప్పు ముద్ద: పావుకప్పు(పావుకప్పు జీడిపప్పు పలుకుల్ని కాసేపు వేడినీటిలో నానబెట్టి ఆ తరువాత ముద్దలా చేసుకోవాలి), పనీర్‌ ముక్కలు: అరకప్పు, గరంమసాలా: పావుచెంచా, కసూరీమేథీ: చెంచా.

తయారీ విధానం

స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను వెన్న వేయాలి. అది కరిగాక స్వీట్‌కార్న్‌, క్యాప్సికం ముక్కల్ని వేసి బాగా వేయించి తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన వెన్న, నూనె వేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా తగినంత ఉప్పు వేసి కలపాలి. నిమిషమయ్యాక టొమాటో ముద్ద, జీడిపప్పు ముద్ద వేసి కప్పు నీళ్లు పోయాలి. ఇది బాగా ఉడికి నూనె పైకి తేలాక వేయించి పెట్టుకున్న స్వీట్‌కార్న్‌, క్యాప్సికం, పనీర్‌ ముక్కలు, కసూరీమేథి వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

క్రిస్పీ బేబీకార్న్‌ చిల్లీ

క్రిస్పీ బేబీకార్న్‌ చిల్లీ

కావలసినవి

బేబీకార్న్‌: పదిహేను (రెండుగా కోసుకోవాలి), మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం: రెండు, ఉల్లికాడల తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, అల్లం: చిన్న ముక్క, రెడ్‌చిల్లీసాస్‌: చెంచా, టొమాటో కెచెప్‌: టేబుల్‌స్పూను, సోయాసాస్‌: చెంచా, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలపొడి: చెంచా, నూనె: అరకప్పు.

తయారీ విధానం

మొక్కజొన్నపిండిలో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి... అందులో బేబీకార్న్‌ ముక్కల్ని వేసి వాటికి పిండి పట్టేలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి ముప్పావువంతు నూనె వేసి బేబీకార్న్‌ ముక్కల్ని వేసుకుని సన్ననిమంటపైన బాగా వేయించుకుని దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి క్యాప్సికం, పచ్చిమిర్చి తరుగు, అల్లం- వెల్లుల్లి తరుగు, ఉల్లికాడల తరుగు వేయాలి. అన్నీ వేగాక రెడ్‌చిల్లీసాస్‌, టొమాటోకెచెప్‌, సోయాసాస్‌ కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండునిమిషాలయ్యాక బేబీకార్న్‌ ముక్కలు వేసి కలపాలి. వాటికి మసాలా పట్టిందనుకున్నాక దింపేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.