ETV Bharat / priya

మడకర్రలపై వండే చప్పిడి చేపలు.. సూపర్ టేస్ట్​ గురూ! - కట్టిపరిగల ఇగురు

అత్యంత ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలలో చేపలు (sea food varities) ఒకటి. వీటిని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ వంటకంగా వండుకుంటారు. అవేంటో తెలుసుకుందాం!.

fish recipes preparation
మడకర్రలపై వండే చప్పిడి చేపలు
author img

By

Published : Oct 3, 2021, 4:35 PM IST

చప్పిడి చేపలు అంటే చప్పగా ఉంటాయేమో అనుకునేరు. అదేం లేదు. అదిరిపోయే రుచి (fish recipes preparation) వీటి సొంతం. మామూలుగా అయితే పచ్చి చేపని (sea food varities) తెచ్చుకున్న వెంటనే (sea food recipes) వండుకోవాల్సిందే. లేదంటే నిల్వ చేయడం కోసం ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఎండు చేపలు కొనుక్కోవాలి. కానీ ఈ చప్పిడి చేపలు ఫ్రిజ్లో పెట్టకపోయినా కూడా వారం రోజుల వరకూ ఏం కావు. అదే వీటి ప్రత్యేకత.

fish recipes preparation
మడకర్రలపై వండే చప్పిడి చేపలు

తూర్పుగోదావరి జిల్లా మడ అడవుల్లో దొరికే మడ కర్రల పైనా, చెరకు పిప్పిపైనా గడ్డిని ఉంచి వీటిని ప్రత్యేకంగా కాలుస్తారు. తేమ పోయి వీటికి ఒక రకమైన ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఓ మోస్తరు పరిమాణంలో ఉండే కట్టిపరిగ, ఇసుకదొందులు, కొయ్యింగ చేపల్ని ఈ పద్ధతిలో కాలుస్తుంటారు. వీటిని వండుకోవడం కూడా సులభం. పైన పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది. వీటిని ముక్కలుగా కోసుకుని మునక్కాడ, కోడిగుడ్డు, చిక్కుడుకాయ కాంబినేషన్తో వండుకుంటే ఆ రుచే వేరని అంటారు స్థానికులు. విడిగా కూడా వండుకోవచ్చు. ఇగురు కూరలు బాగుంటాయి. అయితే వీటిని కాల్చడం ప్రత్యేకమైన కళ. పండి పల్లం, పి.గన్నవరం వంటి ప్రాంతాల్లో కాల్చిన చేపలకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వీటినే ఆర్చిన చేపలని, పొగబెట్టిన చేపలనీ కూడా అంటారు. ముల్లు తీసేసి పిట్టులా కూడా వండుకోవచ్చు.

కట్టిపరిగల ఇగురు

fish recipes preparation
కట్టిపరిగల ఇగురు

కావాల్సినవి:

కట్టిపరిగ చేపలు- నాలుగు(పెద్దవి), ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- నాలుగు(నిలువుగా చీల్చినవి), ఉప్పు తగినంత, కారం- చెంచా, ధనియాలు- చెంచా, జీలకం- అరచెంచా, వెల్లుల్లి పదిరేకలు, అల్లం- చిన్నముక్క, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు- రెండు రెబ్బలు, నూనె - తగినంత

తయారీ:

పొలుసూ, చేదుగట్టు అన్నీ తీసి చేపల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్నవయితే ముక్కలు చేయకుండా అలానే వండుకోవచ్చు. పెద్దవయితే రెండు ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నింటినీ మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేంతవరకూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుని కాసేపటికి ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసుకుని గరిటెతో చేపలు చెదిరిపోకుండా కొద్దిగా అటూఇటూ తిప్పుకోవాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా ఉడికిపోతాయి. ఘుమఘుమలాడే వాసన వచ్చేసరికి కొత్తిమీర వేసుకుని దింపుకోవడమే. ఇందులో మసాలాలు వాడలేదని మీరనుకోవచ్చు. అవేమి అవసరం లేకుండా కూడా ఈ కూర రుచిగా ఉంటుంది.

ఇదీ చదవండి:వెల్లుల్లి చేపల ఇగురు.. టేస్ట్ అదురుద్ది గురూ!

నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.