ETV Bharat / priya

గణనాథుడికీ ఇమ్యూనిటీ పెంచే రెసిపీస్! - simple prasadam recipes

వినాయక చవితి పండుగంటేనే బోలెడన్ని పిండి వంటలు, నైవేద్యాలు. వాటిని తయారుచేసి దేవుడికి ఎప్పుడెప్పుడు నైవేద్యం పెడదామా.. మనమెప్పుడు లాగించేద్దామా అని ఎదురుచూస్తుంటాం. అయితే ఎప్పుడూ విభిన్న స్వీట్లు, మోదక్‌, ఉండ్రాళ్లు.. వంటివన్నీ తయారుచేసి ఆ బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకుంటుంటాం. కానీ, ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితుల నుంచి గణనాథుడిని కాపాడుకోవాలి కదా! అందుకే, చవితి నైవేద్యాలతోనే రోగనిరోధక శక్తిని పెంచి.. మనమూ ఆరోగ్యాన్ని అందుకుందాం! ఇంకెందుకు ఆలస్యం.. చవితి స్పెషల్ రెసిపీలు చూసేద్దాం రండి.

try vinayaka chavithi special recipes like modak, kududmulu and carrot kheer and what not
బొజ్జ గణపయ్యకు ఇమ్యూటినీ పెంచే రెసిపీస్!
author img

By

Published : Aug 22, 2020, 1:00 PM IST

ఇమ్యూనిటీని పెంచే నైవేద్యాలతో మనం కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడటమే కాదు, ఆ పార్వతీ తనయుడి ఆశీస్సులు కూడా అందుకోవచ్చు. మరి, రోగనిరోధక శక్తిని పెంచే ఆ పిండి వంటలేంటో, వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

try vinayaka chavithi special recipes like modak, kududmulu and carrot kheer and what not
క్యారట్‌ మఖానా ఖీర్

క్యారట్‌ మఖానా ఖీర్

కావాల్సినవి

  • బాదం పాలు - 2 కప్పులు
  • ఓట్స్‌ - 4 టేబుల్‌ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)
  • కిస్‌మిస్‌ - 1 టేబుల్ ‌స్పూన్
  • క్యారట్‌ తురుము - 4 టేబుల్‌ స్పూన్లు
  • యాలకుల పొడి - పావు టీస్పూన్
  • మఖానాలు (తామర గింజలు) - గుప్పెడు
  • బెల్లం పొడి - 4 టేబుల్ ‌స్పూన్లు
  • బాదం ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ

  • ముందుగా స్టౌ మీద ప్యాన్‌ పెట్టుకొని అందులో బాదం పాలు పోసి ఒక ఉడుకు రానివ్వాలి.
  • ఇప్పుడు ఇందులో ఓట్స్‌, క్యారట్‌ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై యాలకుల పొడి వేసి మరోసారి కలుపుకోవాలి.
  • పాలు మరుగుతున్న సమయంలో మఖానాలు వేసి పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి.
  • ఆ తర్వాత బెల్లం పొడి, బాదం ముక్కలు వేసి మిశ్రమం చిక్కపడేంత వరకూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
  • ఐదు నిమిషాలయ్యాక సర్వింగ్‌ బౌల్‌ లేదా గ్లాస్‌లోకి తీసుకొని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరి!

క్వినోవా ఆల్మండ్‌ డేట్‌ టఫుల్స్

క్వినోవా ఆల్మండ్‌ డేట్‌ టఫుల్స్

కావాల్సినవి

  • క్వినోవా - 1/3 కప్పు
  • బాదం పప్పులు - అరకప్పు
  • బాదం తురుము - పావు కప్పు
  • డేట్స్ - 16
  • పీనట్‌ బటర్‌ లేదా ఏదైనా బటర్‌ - 3 టేబుల్ ‌స్పూన్లు
  • డార్క్‌ చాక్లెట్‌ చిప్స్‌ - అరకప్పు

తయారీ

  • ముందుగా క్వినోవాను బాగా కడిగి దానికి ముప్పావు కప్పు నీళ్లు కలిపి కుక్కర్‌లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆపై కుక్కర్‌ ప్రెషర్‌ పోయేంతవరకు దాన్ని పక్కన పెట్టేయాలి.
  • ఆ తర్వాత బాదం పప్పులు, డేట్స్‌, పీనట్‌ బటర్‌, చాక్లెట్‌ చిప్స్‌, ఉడికించిన క్వినోవా.. వీటన్నింటినీ మిక్సీ జార్‌లోకి తీసుకొని ముద్దగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని బాదం తురుములో దొర్లించాలి. అంతే.. రుచికరమైన, ఆరోగ్యకరమైన క్వినోవా ఆల్మండ్‌ డేట్‌ టఫుల్స్‌ రడీ!

గుర్‌ సందేశ్

గుర్‌ సందేశ్

కావాల్సినవి

  • పనీర్‌ - కప్పు
  • నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు
  • బెల్లం - 1/3 కప్పు
  • పిస్తా పప్పు తురుము - టేబుల్‌ స్పూన్
  • యాలకుల పొడి - టీస్పూన్

తయారీ

  • ముందుగా పనీర్‌ని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ప్యాన్‌ పెట్టుకొని నెయ్యి వేసి అది కరిగాక బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇది కాస్త చిక్కపడ్డాక అందులో పనీర్‌ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమం చిక్కపడేదాకా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి.
  • ఆఖర్లో యాలకుల పొడి వేసి మరోసారి కలుపుకొని స్టౌ కట్టేయాలి.
  • పది నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన మౌల్డ్స్‌లో వేసుకొని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
  • వినాయకుడికి నైవేద్యం పెట్టే ముందు పిస్తా పప్పు తురుముతో గార్నిష్‌ చేసుకోవాలి.

కొబ్బరి-బెల్లం కుడుములు

కొబ్బరి-బెల్లం కుడుములు

కావాల్సినవి

  • బియ్యప్పిండి - ఒక కప్పు
  • కొబ్బరి తురుము - ఒక కప్పు
  • యాలకుల పొడి - పావు టీస్పూన్
  • ఉప్పు - ముప్పావు టీస్పూన్
  • బెల్లం పొడి - ఒక కప్పు
  • నువ్వుల నూనె - అర టీస్పూన్
  • నెయ్యి - టేబుల్‌స్పూన్

తయారీ

  • ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కొబ్బరి తురుమును దోరగా వేయించాలి.
  • మరో ప్యాన్ తీసుకుని అందులో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి సన్నటి మంటపై ఉంచాలి.
  • కాసేపయ్యాక బెల్లం చిక్కగా మారి పాకంలా తయారవుతుంది. ఆ సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉంచి పదే పదే కలుపుతుండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి యాలకుల పొడిని జత చేసి మరోసారి కలపాలి.
  • కొన్ని సెకన్ల తర్వాత మంటను ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి.
  • ఆలోపు ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీళ్లను పోయాలి. ఆ తర్వాత నువ్వుల నూనె, ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కాస్త ఒత్తి.. అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న బెల్లం- కొబ్బరి ఉండల్ని స్టఫ్ చేయాలి.
  • ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే ఎంతో రుచికరంగా నోరూరించే కొబ్బరి- బెల్లం కుడుములు రెడీ!

డ్రైఫ్రూట్ కుడుములు

డ్రైఫ్రూట్ కుడుములు

కావాల్సినవి

  • బాదం పప్పులు - 12
  • ఎండిన ఖర్జూరాలు - 8
  • ఎండు కొబ్బరి - అర కప్పు
  • నీళ్లు - ఒక టీస్పూన్
  • జీడిపప్పు - 15
  • ఎండుద్రాక్ష (కిస్‌మిస్) - 2 టేబుల్‌స్పూన్లు
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
  • బియ్యప్పిండి - కప్పు
  • ఉప్పు - కొద్దిగా

తయారీ

  • ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి.. ఇవన్నీ ప్యాన్‌లోకి తీసుకొని దోరగా వేయించాలి.
  • ఆపై వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో గింజ తీసేసిన ఎండు ఖర్జూరాలు కూడా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ ముద్దలు కట్టుకునేలా కలుపుకోవాలి.
  • అరచేతులకు నెయ్యి రాసుకొని.. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.
  • మరో గిన్నెలో బియ్యప్పిండి తీసుకొని అందులో ఉప్పు వేసి వేడి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఈ బియ్యప్పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త ఒత్తి మధ్యలో డ్రైఫ్రూట్స్ ముద్దను ఉంచి మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్స్ కుడుములు సిద్ధం!

ఇదీ చదవండి: లంబోదరుడు మెచ్చే చవితి స్పెషల్ రెసిపీస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.