చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. అయితే బిర్యానీ అనగానే నాన్‌వెజ్ బాగుంటుందని అనుకుంటారు. కానీ అది భ్రమ. వెజ్‌లో కూడా నాన్వెజ్‌లా టేస్టీగా చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీల్మేకర్ బిర్యానీ. తింటే 'వహ్వా' అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం తయారీ విధానాన్ని చూసేయండి.
తయారీ విధానం
ముందుగా మీల్మేకర్(వేడి లేదా చల్ల)నీళ్లలో నానబెట్టాలి. అలాగే పొయ్యిపై ఓ బౌల్లో నీరు బాగా వేడి చేయాలి. ఇంకొక పొయ్యి మీద.. ఓ పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. అందులో బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, జాపత్రి , యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగిన పుదీన, కొత్తిమీర, పసుపు, టొమాటో ప్యూరి వేసి వేగనివ్వాలి. ఆ తరువాత అందులో నానబెట్టుకున్న మీల్మేకర్, కొంచెం పెరుగు వేసి కలపుకోవాలి. దీనిని మీల్మేకర్ మిశ్రమం అంటారు.
ఈలోగా ముందుగా బాణీలో మరిగిస్తున్న నీళ్లలో షాజీర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు వేసి ఉడికించుకోవాలి. అందులో కాస్త నూనె వేయాలి. ఇందులో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి ఉడికించుకోవాలి.
తయారుచేసుకున్న మీల్ మేకర్ మిశ్రమంలో ఉడకపెట్టుకున్న బాస్మతీ అన్నం వేయాలి. ఆ తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనిస్తే మీల్ మేకర్ బిర్యానీ రెడీ. అనంతరం దీనిపై కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: చాక్లెట్ బిర్యానీ.. ఇదేం టేస్ట్‌రా బాబూ?!