ETV Bharat / priya

'మటన్' మరోలా.. మనసుకు నచ్చేలా!

మనలో చాలామందికి మసాలాపెట్టి చేసే లేత మటన్‌ రుచి గురించి మాత్రమే తెలుసు. మటన్‌ అంటే అదొక్కటే కాదు... కీమా, బోటీ, నల్లి ఎముకలతో చేసే కొత్త రుచులు కూడా. వీటితో నోరూరించే కబాబ్‌లూ, కీమారుచులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి!

try-special-mutton-recipes-like-kolhapuri-kheema-dum-ka-nalli-mutton-kabab-kaliya-and-your-choice
'మటన్' మరోలా.. మనసుకు నచ్చేలా!
author img

By

Published : Sep 6, 2020, 1:01 PM IST

బోలెడన్ని మటన్ రెసిపీస్ చూసేయండి...

try-special-mutton-recipes-like-kolhapuri-kheema-dum-ka-nalli-mutton-kabab-kaliya-and-your-choice
దమ్‌ కా నల్లి

దమ్‌ కా నల్లి

కావాల్సినవి

నల్లి ఎముకలు- పన్నెండు, నూనె - అరకప్పు, ఉల్లిపాయలు - నాలుగు, టొమాటో గుజ్జు - అరకప్పు, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, దాల్చినచెక్క - పెద్ద ముక్క, యాలకులు - ఐదు, లవంగాలు - ఏడు, బిర్యానీ ఆకులు - నాలుగు, అల్లం - పెద్ద ముక్క, వెల్లుల్లి రెబ్బలు - పది, కారం - మూడు చెంచాలు, గరంమసాలా - చెంచా.

తయారీ

పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక దాల్చినచెక్కా, యాలకులూ, లవంగాలూ, బిర్యానీ ఆకులు వేయాలి. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లం,వెల్లుల్లి ముద్దా, కారం, తగినంత ఉప్పూ, నల్లి ఎముకలు కాసిని నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. ఆ ఎముకలు సగం ఉడికాక టొమాటో గుజ్జు కలపాలి. కాసేపటికి అవి పూర్తిగా ఉడుకుతాయి అప్పుడు గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.

కరి మిళగు

రి మిళగు

కావాల్సినవి

మాంసం - అరకేజీ, మిరియాలు - చెంచా, సోంపు - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - ఏడు, వెల్లుల్లి - ఆరు రెబ్బలు, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కట్ట, ధనియాలపొడి - చెంచా, కారం - చెంచా.

తయారీ

మాంసాన్ని కడిగి ముక్కల్లా కోయాలి. నూనె, కొత్తిమీరా, ఉల్లిపాయ, టొమాటోలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేయాలి. అవి వేగాక మాంసం ముక్కలు వేసి మంట తగ్గించాలి. పదిహేను నిమిషాల తరవాత ముందుగా చేసుకున్న మసాలా, గ్లాసు వేడినీళ్లూ పోసి మూత పెట్టేయాలి. మాంసం మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగూ వేసి దింపేయాలి.

కీమా కొల్హాపురి

కీమా కొల్హాపురి

కావాల్సినవి

కీమా - 750 గ్రా, వెల్లుల్లి రెబ్బలు - ఏడు, అల్లం - చిన్నముక్క, పసుపు - అరచెంచా, ఉల్లిపాయలు - రెండు, నూనె - కప్పు, గోడా మసాలా - నాలుగు చెంచాలు (బజార్లో దొరుకుతుంది)

మసాలాకోసం: గసగసాలు - రెండుచెంచాలు, జీలకర్రా, నువ్వులు - ఒకటిన్నర చెంచా చొప్పున, ఎండు కొబ్బరి, పచ్చికొబ్బరి తురుము - రెండు చెంచాల చొప్పున, కొత్తిమీర తరుగు - పావుకప్పు.

మసాలాకోసం

ఉల్లిపాయలు - మూడు, టొమాటోలు - ఐదు, టొమాటో గుజ్జు - నాలుగు చెంచాలు, ఉప్పు - తగినంత, గరంమసాలా - చెంచా, కొత్తిమీర - కట్ట.

తయారీ

కీమాను కడిగి పెట్టుకోవాలి. అల్లంవెల్లుల్లిని ముద్దలా చేసుకోవాలి. దాన్నీ, పసుపూ కీమాపై వేసి కలిపి పెట్టుకోవాలి. అరగంట అయ్యాక ఓ గిన్నెలో అరకప్పు నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. అవి ఎరుపు రంగులోకి వచ్చాక కీమా, సరిపడా నీళ్లూ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇంతలో గసగసాలూ, జీలకర్రా, నువ్వులూ, కొబ్బరితురుమును నూనె లేకుండా వేయించుకుని కొత్తిమీర తరుగు తీసుకుని మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని, టొమాటోలను విడివిడిగా వేయించుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మరో బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన అరకప్పు నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముద్దా, టొమాటో ముద్దా, టొమాటో గుజ్జూ వేసుకుని మంట తగ్గించాలి. కాసేపటికి నూనె పైకి తేలుతుంది. అప్పుడు చెంచా గోడా మసాలా కలపాలి. రెండుమూడు నిమిషాలయ్యాక గసగసాల ముద్ద వేసి కాసిని నీళ్లు పోసి మంట తగ్గించాలి. ఆ మసాలా ఉడికాక కీమా, మిగిలిన గోడామసాలా, తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, గరంమసాలా వేసి దింపేయాలి,

సీక్‌ కబాబ్‌ మసాలా

సీక్‌ కబాబ్‌ మసాలా

కావాల్సినవి

ఎముకల్లేని మటన్‌ - 400 గ్రా, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రెబ్బలు - పది, పచ్చిమిర్చి - పది, కారం - రెండు చెంచాలు, కొత్తిమీర, పుదీనా - కట్ట చొప్పున, గరంమసాలా - చెంచా.

మసాలాకోసం

ఉల్లిపాయలు - రెండు, టొమాటో గుజ్జు - అరకప్పు, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, గరంమసాలా - చెంచా, కారం - చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద -రెండు చెంచాలు, జీడిపప్పు ముద్ద - అరకప్పు, నూనె - పావుకప్పు.

తయారీ

ముందుగా మటన్‌, తగినంత ఉప్పూ, వెల్లుల్లిరెబ్బలూ, పచ్చిమిర్చీ కారం, కొత్తిమీరా, పుదీనా తరుగూ, గరంమసాలా ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను పొడుగ్గా చేసుకుని ఇనుప చువ్వలకు గుచ్చి గ్రిల్‌ పద్ధతిలో లేదా నిప్పులపై కాల్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు మసాలా తయారుచేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేడిచేయాలి. అందులో గరంమసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి ముద్దా, కారం, పసుపూ, తగినంత ఉప్పు వేసి వేయించాలి. తరవాత టొమాటో గుజ్జూ, జీడిపప్పు ముద్దా వేసి మంట తగ్గించాలి. కాసేపటికి మసాలా వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న కబాబ్‌లూ, కొత్తిమీర తరుగు వేసి వేయించి రెండుమూడు నిమిషాలయ్యాక దింపేయాలి.

కాలియా

కాలియా

కావాల్సినవి

మటన్‌ - అరకేజీ, ఉల్లిపాయ - ఒకటి, గోధుమలు - రెండు టేబుల్‌స్పూన్లు (నానబెట్టుకోవాలి), సోంపు, వాము - చెంచా చొప్పున, హోల్‌గరంమసాలా - టేబుల్‌స్పూను (బజార్లో దొరుకుతుంది), అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, కారం - చెంచా, ధనియాలపొడి - అరచెంచా, జీలకర్ర - చెంచా, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, పెరుగు - అరకప్పు, టొమాటోలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - కట్ట, నూనె - పావుకప్పు.

తయారీ

బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, పసుపూ, ధనియాలపొడీ, జీలకర్రా వేయాలి. వామూ, సోంపు, హోల్‌గరంమసాలాను ఓ వస్త్రంలో మూటలా కట్టి బాణలిలో ఓ పక్కన ఉంచాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేయాలి. అవి కొద్దిగా వేగాక మటన్‌ ముక్కలూ, నానబెట్టిన గోధుమలూ, మటన్‌ మెత్తగా అయ్యాక కాసిని నీళ్లూ పోసి మూత పెట్టాలి. గోధుమలు మెత్తగా అయ్యాక ముందుగా వాముమూట తీసేసి పెరుగూ, కాసిని నీళ్లు పోసి మూత పెట్టేయాలి. పదినిమిషాలయ్యాక కొత్తిమీరా, పచ్చిమిర్చి వేసి దింపేయాలి.

ఇదీ చదవండి: 'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసుకోవడం ఎంతో ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.