ETV Bharat / priya

నోరూరించే 'ఎగ్ సలాడ్‌'తో ఆరోగ్యం దరిచేరుతుంది!

ఆరోగ్యాన్నిచ్చే సలాడ్లు తినమని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. కానీ, ఎప్పుడూ ఆ పచ్చి కూరగాయలు, పండ్ల సలాడ్లు తింటే.. బోర్​ కొట్టడం ఖాయం. అందుకే, ఈ సారి కొత్తగా ట్రై చేద్దాం. ఎన్నో ప్రొటీన్ల పుట్టగా పిలిచే గుడ్డుతో సలాడ్​ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి..

try-egg-salad-recipe-at-home
నోరూరించే 'ఎగ్ సలాడ్‌'తో ఆరోగ్యం దరిచేరుతుంది!
author img

By

Published : Jul 7, 2020, 1:01 PM IST

రోజుకో గుడ్డు తింటే అనారోగ్యం దరిచేరదని వైద్య నిపుణులు ఏనాడో నిర్దరించారు. మరి ఆ గుడ్డుతో సలాడ్​ చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఇంకెందుకు ఆలస్యం.. రెసిపీ చూసేయండి.

try-egg-salad-recipe-at-home
నోరూరించే 'ఎగ్ సలాడ్‌'తో ఆరోగ్యం దరిచేరుతుంది!

కావాల్సినవి:

గుడ్లు - నాలుగు (ఉడికించినవి), ఉడికించిన బంగాళాదుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి (తురమాలి), ఆకుపచ్చ క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, మిరియాల పొడి - చెంచా, చాట్‌మసాలా - అరచెంచా, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - కొద్దిగా.

తయారీ:

గుడ్లను నాలుగు ముక్కల్లా చేసుకోవాలి. ఓ గిన్నెలో కూరగాయ ముక్కలన్నింటినీ తీసుకుని బాగా కలపాలి. అందులో కోడిగుడ్డు ముక్కలతోపాటూ చాట్‌మసాలా, మిరియాలపొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపితే చాలు. సలాడ్‌ సిద్ధమైనట్లే.

ఇదీ చదవండి: 'ఓట్స్‌ మంచూరియా' ఇలా చేసుకోండి.. హెల్దీగా ఉండండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.