అధిక ప్రొటీన్, కాల్షియంలతో నిండిన రుచికరమైన క్యారెట్ పనీర్ ఖీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా..
కావాల్సినవి
చిక్కనిపాలు: రెండు కప్పులు, కొబ్బరిపాలు: అరకప్పు, పనీర్: అరకప్పు, క్యారెట్లు: రెండు, యాలకులపొడి: అరచెంచా, డ్రైఫ్రూట్స్ పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు, చక్కెర: కప్పు.
తయారీవిధానం
ముందుగా క్యారెట్లను ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలు తీసుకుని స్టౌ మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర, పనీర్ తురుము వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక క్యారెట్ ముద్ద, కొబ్బరిపాలు, యాలకులపొడి వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కబడుతున్నప్పుడు నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి దింపేస్తే చాలు.
ఇదీ చదవండి: నోరూరించే గులాబ్ జామ్- మనింట్లోనే చేసుకుందాం!