ETV Bharat / priya

కాస్త భిన్నంగా 'గ్రీన్​ మసాల ఇడ్లీ' వడ్డించండిలా..!

ఇడ్లీ అంటే చాలా మందికి బోరింగ్​గా అనిపిస్తుంది. అలాంటి వారికి ఇడ్లీతోనే కాస్త డిఫరెంట్​గా ట్రై చేసి.. 'గ్రీన్​ మసాల ఇడ్లీ'ని పెట్టేయండి. ఆ వంటకం ఎలా చేయాలో ఇది చదివేయండి.

Green masala Idly
గ్రీన్​ మసాల ఇడ్లీ
author img

By

Published : Aug 28, 2021, 8:01 AM IST

ఆవిరి మీద ఉడికే తెల్లని ఇడ్లీలు.. తాకితేచాలు మాసిపోయేలా భలే ఉంటాయి. ఆరోగ్యానికి ఎంత మంచివైనా.. తరచూ తినాలంటే కాస్త కష్టంగా భావిస్తారు కొందరు. అలాంటి వారి కోసం కాస్త డిఫరెంట్​గా ట్రై చేసి.. 'గ్రీన్​ మసాల ఇడ్లీలు' పెట్టొచ్చు. ఒకవేళ ఉదయం చేసిన ఇడ్లీలు మిగిలిపోతే మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి కూడా ఈ ఇడ్లీలను ఇలా తయారు చేసుకోవచ్చు.

కావాల్సినవి

పాలకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, ఉప్పు, శనగపప్పు, మినపపప్పు, ఎండుమిర్చి, నెయ్యి, నిమ్మరసం.

తయారీ విధానం

ఒక గిన్నెలో నూనె వేడి చేసుకుని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పాలకూర, అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాయిలి. తర్వాత మిక్సీ జార్​లోకి తీసుకొని.. అందులో కాస్త ఉప్పు, నీళ్లు వేసి మిక్సీపట్టి పేస్ట్​ చేసుకోవాలి.

తర్వాత ఇంకొక పాన్​ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేసుకొని.. అందులో ఇడ్లీలు, ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్​ పేస్ట్​ వేసి కాసేపు మగ్గించుకోవాలి. అంతే గ్రీన్​ మసాల ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలు తినే ముందు నిమ్మరసం చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చేప పులుసు ఇష్టమా..? ఇలా ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.