ఎప్పుడూ ఒకేలా దోశలు చేసి చేసి బోర్ కొట్టేసిందా. ఇలా ప్రయత్నించి చూడండి. ఈ సొరకాయ దోశతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మరి ఎలా చేయాలంటే?
కావాల్సిన పదార్థాలు
బియ్యం, చనగపప్పు, మెంతులు,సొరకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, బొంబాయి రవ్వ, పసుపు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నూనె
తయారీ విధానం
ముందుగా బియ్యం, మెంతులు ఓ బౌల్లో నానబెట్టాలి. మరో పాత్రలో చనగపప్పు నానబెట్టాలి. సొరకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని గంటల తర్వాత మిక్సీ బౌల్లోకి నానబెట్టిన బియ్యం, మెంతులు, చనగపప్పు, సొరకాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి.. దోశల పిండిలా మెత్తగా రుబ్బాలి.
ఆ మిశ్రమంలో పసుపు, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి కలుపుకోవాలి. దానిని వేడి పెనంపై దోశల్లా వేసుకోవాలి. ఆ దోశలపై జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ దోశలు రెడీ..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: