ఇది రుచికరమైన సేమియా దోశ. అదేంటి ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? అయితే ఈ రోజు ప్రయత్నించి చూడండి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వావ్ అనిపించండి.
కావాల్సిన పదార్థాలు
సేమియా, బొంబై రవ్వ, బియ్యపు పిండి, మైదాపిండి, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, జీడిపప్పు, మజ్జిగ, ఉప్పు
తయారీ విధానం
ముందుగా ఓ పెద్ద బౌల్లో పైన చెప్పిన పదార్ధాలన్నీ తీసుకుని కాసిన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. దాని కొంచెంసేపు పక్కన పెట్టాలి. స్టవ్‌పై దోశల పెనం పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి. అది కాగిన తర్వాత దానిపై ముందుగా సిద్ధం చేసిన మిశ్రమాన్ని దోశలా వేసుకోవాలి. దానిపై గరిటతో కాస్త నూనె పోసుకుని, కాసేపు తర్వాత ప్లేట్ తీసుకుంటే సరి. ఎంతో రుచికరమైన సేమియా దోశ రెడీ. దీనిని పల్లీ లేదా కొబ్బరి చట్నీతో తీసుకుంటే టేస్ట్ అదుర్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: